నోటి పూత. ఇది కరోనా లక్షణమా? కాదా? ఎలా గుర్తించాలి? బండ గుర్తు ఇదే?

  • Published By: sreehari ,Published On : September 3, 2020 / 05:46 PM IST
నోటి పూత. ఇది కరోనా లక్షణమా? కాదా? ఎలా గుర్తించాలి? బండ గుర్తు ఇదే?

Sore Tongue A Sign Of Coronavirus : కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడుస్తోంది.. మందులేని కరోనా బారి నుంచి ఎలా బతికి బయటపడాలో తెలియక ప్రపంచవ్యాప్తంగా జనాలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. కరోనా వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది.. గాలిలోనూ కరోనా వ్యాపిస్తోంది.. ఇలాంటి పరిస్థితుల్లో ఏ కొంచెం జలుబు చేసినా కరోనా భయం వెంటాడుతోంది. జలుబు చేసినా జ్వరం వచ్చినా.. గొంతులో నొప్పిగా  ఉన్నా నోట్లో నాలుకపై పూత వచ్చినా చాలు.. వామ్మో కరోనా వచ్చిందేమోనని హడలిచస్తున్నారు జనం..



వాస్తవానికి కరోనా ప్రారంభ లక్షణాల్లో జలుబు, జ్వరం, గొంతునొప్పి, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి ప్రధాన లక్షణాలు చెబుతూ వచ్చారు.. రానురాను కరోనా లక్షణాలు కొత్తవి చేరుతున్నాయి.. కరోనా లక్షణాలు కూడా సాధారణ ఫ్లూ లక్షణాలు మాదిరిగానే ఉండటంతో కన్ఫూజ్ అయిపోతున్నారు..

ఏది మాములు జలుబో.. ఏది మాములూ జ్వరమో తెలియక ఆందోళన ఎక్కువైపోతోంది.. అందులోనూ వర్షాకాలం కావడంతో ఫ్లూ సీజన్ వ్యాధులు వస్తుంటాయి.. వాతావరణంలో మార్పుల కారణంగా చాలామందికి జలుబు చేస్తుంటుంది.. గొంతు పచ్చి చేస్తుంటుంది.. నోటి పూత కూడా వస్తుంది.. నాలుకపై మంటగా అనిపిస్తుంది.. కొంచెం కారం తిన్నా మండిపోతుంది. తట్టుకోలేరు.. నోటి పూత అంటే.. దీన్నే నోటి అల్సర్ అని కూడా పిలుస్తారు..  కొంతమందికి జ్వరం కూడా వస్తుంటుంది.. దీంతో కరోనా వచ్చిందని భయపడిపోతున్నారు.

వాస్తవానికి కోవిడ్-19 లక్షణాల్లో మూడు ప్రధానంగా చెప్పుకోవచ్చు.. అయితే ఈ కరోనా లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి.. వారి శరీరంలోని వ్యాధినిరోధక బట్టి కరోనా లక్షణాలు భిన్నంగా కనిపిస్తుంటాయి.. సాధారణంగా గొంతులో నొప్పి ఉంటే.. కరోనా లక్షణంగా చెబుతుంటారు.. అలాగే వాసన కోల్పోవడం.. రుచి తెలియకపోవడం కూడా కరోనా లక్షణాలుగానే గుర్తించారు.



యువకుల్లోనూ వ్యాపిస్తున్న కరోనా వైరస్ కారణంగా కనిపించే లక్షణాల్లో ఎక్కువగా గొంతునొప్పి కనిపిస్తుంటుంది. ఇంతకీ నోటి పూత (మౌత్ అల్సర్)ను కరోనా లక్షణంగా భావించవచ్చా? అంటే? తప్పకుండా అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు..

గొంతులో లేదా నోట్లో అసౌకర్యంగా అనిపించడం.. నోటి పూత (మౌత్ అల్సర్) నాలుక మంటగా అనిపించినంత మాత్రానా సాధారణంగా కరోనా లక్షణంగా భావించాల్సిన అవసరం లేదంటున్నారు. NHS డేటా ప్రకారం.. కరోనా వైరస్ సోకింది అనడానికి కచ్చితమైన మూడు ప్రధాన లక్షణాలను బట్టి నిర్ధారించవచ్చు.. అవేంటో ఓసారి చూద్దాం..

కరోనా ప్రధాన లక్షణాలేవే :
* తీవ్ర జ్వరం రావడం.. అంటే శరీరంలోని ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం.. మీ వెనుక లేదా ఛాతిభాగంలో ముట్టుకంటే కాలిపోతున్న భావన కలుగుతుంది.

* సాధారణ దగ్గుతో మొదలవుతుంది.. నిరంతరాయంగా దగ్గు వస్తూనే ఉంటుంది.. గంటకు పైగా దగ్గుతూనే ఉండటం.. లేదా 24 గంటల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు దగ్గు వస్తూనే ఉంటుంది. సాధారణ దగ్గు కంటే తీవ్రత ఎక్కువగా ఉంటుంది.. గొంతంతా మండిపోతుంది.. భరించలేనంత నొప్పిగా అనిపిస్తుంది.

* రుచి తెలియకపోవడం.. వాసన కోల్పోవడం.. ఏది స్మెల్ చేసినా కొంచెం కూడా వాసన రాదు.. ఎలాంటి స్మెల్ సెన్స్ ఉండదు.. ఏ ఆహార పదార్థం తిన్నా కూడా అసలు రుచే తెలియదు.. చప్పగానూ అదోలా అనిపిస్తుంటుంది..



కరోనా వైరస్ సోకిన చాలామందిలో ఈ మూడు లక్షణాలు ప్రధానంగా కనిపిస్తుంటాయి.. ఈ మూడింటిలో ఏదైనా ఒక లక్షణం కనిపించినా వెంటనే కరోనా టెస్టు చేసుకోవడం ఉత్తమం.. అలాగే ఇతరులకు దూరంగా మీకు మీరే ఐసోలేట్ కావడం ముందుగా చేయాలి. మీతో కలిసి ఉండేవారిని కూడా ఐసోలేట్ కావాలని చెప్పాలి..

* నోటిపూత.. నాలుక చెడిందని అంటారు.. ఇది మాత్రమే కనిపించి.. పైన చెప్పిన ఏ లక్షణాలు లేకపోయినా మీకు కరోనా వైరస్ లేదనట్టే.. కరోనా వైరస్ సోకినవారిలో చాలామందిలో WHO చెప్పిన ప్రకారం.. చాలా తక్కువ సాధారణ లక్షణాలు కనిపిస్తుంటాయి.. అవేంటంటే?



* ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు
* గొంతులో నొప్పి
* డయేరియా
* కండ్ల కలక ( కళ్లుగా ఎర్రగా అవుతాయి)
* తలనొప్పి
* చర్మంపై దద్దర్లు లేదా వేళ్లు లేదా కాలి వేళ్లపై రంగు మారడం

కరోనా లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటే.. వారిలో శ్వాస తీసుకోలేరు.. ఛాతిలో నొప్పి లేదా ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుంటుంది. మాట్లాడలేరు.. పైకి లేవలేరు.. ఎటు కదల్లేరు.. వీటిలో ఏదైనా లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే వైద్యున్ని సంప్రదించాలి..