ఉదయం తొందరగా నిద్రలేచేవారిలో మతిమరుపు ముప్పు ఎక్కువ.. అధ్యయనంలో తేలింది

  • Published By: sreehari ,Published On : August 20, 2020 / 05:55 PM IST
ఉదయం తొందరగా నిద్రలేచేవారిలో మతిమరుపు ముప్పు ఎక్కువ.. అధ్యయనంలో తేలింది

తెల్లవారుజామునే నిద్రలేచే అలవాటు ఉందా? అయితే మీలో మతిమరుపు ముప్పు ఎక్కువంట.. అధ్యయనంలో తేలింది.. ఉదయం సమయంలో తొందరగా నిద్రలేచేవారిలో అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనం తేల్చేసింది. ఈ వ్యాధికి ఎక్కువ కారణంగా ఉదయాన్నే నిద్రలేవడంతో ముడిపడి ఉందని సైంటిస్టులు కనుగొన్నారు.



లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన పరిశోధక బృందం అర మిలియన్ మందికి పైగా వ్యక్తులను అధ్యయనం చేసింది. వారిలో జన్యు సమాచారంతో పాటు నిద్ర విధానాలను కూడా లోతుగా విశ్లేషించింది. ఉదయం వేళ తొందరగా నిద్రలేచేవారిని ‘మార్నింగ్ పీపుల్’ అని పిలుస్తారు. వీరిలో అల్జీమర్స్ రెండు రెట్లు జన్యు ప్రమాదం 1 1 శాతం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. అంటే వీరంతా తక్కువగా నిద్రపోతున్నారని గుర్తించారు.

అధ్యయన ఫలితాల్లో ఉదయాన్నే లేవడం వల్ల మతిమరుపుకు కారణమవుతుందనే విషయాన్ని కొట్టిపారేశారు. శాస్త్రవేత్తలు నిద్ర విధానాలు వ్యాధికి కారణం కాదని చెప్పారు. దీనికి ప్రారంభ సంకేతం కావచ్చునని చెప్పారు. పొందే అవకాశం ఉన్న జన్యువులు కూడా నిద్రను ప్రభావితం చేస్తాయని అంటున్నారు. జన్యుపరంగా అల్జీమర్స్ వ్యాధికి గురయ్యే వారు ఉదయాన్నే ఎక్కువగా నిద్రలేస్తున్నారని కనుగొన్నామని అధ్యయన రచయితలలో ఒకరైన డాక్టర్ అబ్బాస్ డెహగాన్ అన్నారు.

Alzheimer, Morning people, wake up early, higher risk of the disease

కానీ అల్జీమర్స్ ప్రమాదంపై నిద్ర లక్షణాల ప్రభావం కనిపించలేదన్నారు. వ్యాధి సంభవించే ముందు ప్రజలు నిద్ర రుగ్మతలను ఎదుర్కొంటున్నారని చూశామని కారణ మవుతున్నాయా లేదా ముందస్తు హెచ్చరిక సంకేతాలు కాదా అని తెలియదు. దీనిపై మరిన్ని అధ్యయనాలు చేయవలసి ఉంది. పరిశోధనలో ఎక్కువ మంది యూరోపియన్లు, ఫలితాలు వివిధ జాతుల ప్రజలకు వర్తించవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.



ఈ పరిశోధన వేర్వేరు నిద్ర విధానాలకు అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదానికి మధ్య ఒక సంబంధాన్ని చూపిస్తుంది. ఈ వ్యాధికి కారణమయ్యే నిద్ర భంగం గురించి ఎలాంటి ఆధారాలు కనుగొనలేదు. ఆరునెలల వ్యవధిలో రోగులకు ఈ చికిత్సను సూచించవచ్చు. ఔషధాన్ని వాడుతున్న నెమ్మదిగా జ్ఞాపకశక్తిని కోల్పోతారు. అల్జీమర్స్ చికిత్సకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులు వ్యాధి లక్షణాలు కనిపించడలేదు.. కానీ అడుకానుమాబ్ మెదడులోని మార్పులను నియంత్రించడానికి ఇది సాయపడుతుందని సూచిస్తోంది.



వ్యాధి పురోగతిని ఆపగలదని సూచిస్తుంది. సుమారు 500,000 మంది బ్రిటన్లు అల్జీమర్స్ తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి చాప కింద నీరులా నెమ్మదిగా జ్ఞాపకశక్తి, ఆలోచనా నైపుణ్యాల సామర్థ్యాన్ని నాశనం చేస్తుందని సైంటిస్టులు తమ అధ్యయనంలో కనుగొన్నారు.