దశాబ్దాల చిక్కు ప్రశ్న: సరోగసి పిల్లల తల్లిదండ్రులు ఎవరనే విషయంపై ప్రభుత్వం సంచలన బిల్లు

  • Published By: nagamani ,Published On : November 17, 2020 / 10:59 AM IST
దశాబ్దాల చిక్కు ప్రశ్న: సరోగసి పిల్లల తల్లిదండ్రులు ఎవరనే విషయంపై ప్రభుత్వం సంచలన బిల్లు

japan bill submitted to clarify parenthood in fertility : సరోగసీ (కృత్రిమ గర్భధారణ) అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. భారత్‌తో పాటు పలు పాశ్చాత్య దేశాల్లో సరోగసీ అనేది కామన్ అయిపోయింది. కానీ ఈ పద్ధతి ద్వారా పిల్లల్ని కంటే ఆ పిల్లలకు అసలు తల్లిదండ్రులు ఎవరు? వీర్యదానం (perm donation) చేసినవారా? లేక గర్భాన్ని ధరించి పిల్లల్ని కన్నవారా? అనే ప్రశ్న చాలా కాలంనుంచి ఈ అంశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్నాయి.



ఈ విషయంపై ఎవరి అభిప్రాయాలను వారు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో సరోగసీ ద్వారా పిల్లల్ని కంటే ఆ పిల్లలకు తల్లిదండ్రులు ఎవరు? జన్మనిచ్చినవారా? లేక వీర్యం, అండం దానం చేసివారా? అనే అంశంపై జపాన్ ప్రభుత్వం సరికొత్త బిల్లును రూపొందించింది. దీనిపై ఈ బిల్లు ద్వారా జపాన్ ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చింది.



https://10tv.in/more-than-1-million-us-children-have-been-diagnosed-with-covid-19-pediatricians-say/
వివరాల్లోకి వెళితే..సరోగసీ ద్వారా పిల్లల్ని కంటే ఆ పిల్లలకు తల్లిదండ్రులు ఎవరు అనే కీలక అంశంపై ఎంతోకాలంగా చర్చలు కొనసాగుతోంది. దీనిపై రచ్చకూడా జరుగుతోంది. ఈ క్రమంలో విట్రో ఫర్టిలైజేషన్ ప్రక్రియతో జన్మించిన పిల్లల తల్లిదండ్రుల అంశంపై జపాన్ దేశ ప్రభుత్వం సరికొత్త బిల్లును రూపొందించింది. వీర్యం చేసిన దాతలు ఎవరైనాగానీ దాతలతో సంబంధం లేదని.. జన్మనిచ్చిన వారినే పిల్లల తల్లిదండ్రులుగా గుర్తిస్తూ బిల్లును తీసుకొచ్చింది. 3వ వ్యక్తి అయిన దాతలను గుర్తించకుండా.. జన్మనిచ్చిన వారినే చట్టరీత్యా తల్లిదండ్రులుగా గుర్తిస్తున్నట్టు బిల్లులో పేర్కొంది ప్రభుత్వం.



దశాబ్దాలుగా కొనసాగుతున్న చర్చ..సరోగసీ పిల్లలకు తల్లిదండ్రులు ఎవరు?
జపాన్ దేశంలో గత కొన్ని దశాబ్దాలుగా సరోగసీ పిల్లలకు తల్లిదండ్రులు ఎవరు? అనే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో వైద్య నిపుణులతో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు..కామన్ పీపుల్స్ కూడా పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకూ దానిపై స్పష్టత లేకపోవడంతో..ప్రభుత్వం దీనికో క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించింది.


ఈక్రమంలో జపాన్ పార్లమెంట్ ఓ బిల్లును రూపొందించింది. అద్దెగర్భం (surrogacy) లేదా కృత్రిమంగా గర్భధారణ చేసే సమయంలో 3వ వ్యక్తి సాయం తీసుకోవడం ద్వారా కలిగే సంతానానికి చట్ట రీత్యా తల్లిదండ్రులు ఎవరనే అంశం సాగుతున్న మీమాంసకు తెరదించే ప్రయత్నంలో భాగంగా ఈ కొత్త బిల్లును అధికార, ప్రతిపక్షాలు కలిసి ఈ బిల్లును రూపొందించాయి. అధికార ప్రతిపక్షాలు కలిసి ఈ బిల్లును రూపొందించటం విశేషం.


జన్మనిచ్చిన వారే తల్లిదండ్రులు..వీర్య దాత కేవలం మూడో వ్యక్తి మాత్రమే
సరోగసీ ద్వారా బిడ్డల్ని కలిగినవారు ఆ బిడ్డకు జన్మ ఇచ్చిన వారే తల్లిదండ్రులంటూ కొత్త బిల్లులో పేర్కొంది. సాధారణంగా ఈ లిటిగేషన్లన్నీ 3వ వ్యక్తి ద్వారా అండం లేదా వీర్యం కొని తల్లిదండ్రులైన వారికి ఎదురవుతుంటాయి. అసలు అద్దెగర్భం లేదా కృత్రిమ గర్భధారణతో (IVF) పుట్టే పిల్లల తల్లిదండ్రులు ఎవరన్న దానిపై కొన్నేళ్లుగా జపాన్ లో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్న ధర్మసందేహానికి విరుగుడుగా ఈ బిల్లును తీసుకొచ్చింది ప్రభుత్వం.

ప్రస్తుతం కొనసాగుతున్న డైట్ (Diet అంటే జపాన్ పార్లమెంట్) సమావేశాల్లోనే ఈ బిల్లును పాస్ చేసేందుకు అవసరమైన సంపూర్ణ మద్దతు ఉండటంతో డిసెంబరు నెలాఖరుకల్లా ఈ బిల్లు చట్టంగా మారనుంది. అంటే ఇక జపాన్ లో సరోగసీ పిల్లల తల్లిదండ్రులు ఎవరు అనే విషయానికి తెరపడనుంది.


దానం చేసిన వారు కాదు..కన్నవారే తల్లిదండ్రులు 
ఈ నయా బిల్లు ప్రకారం బిడ్డకు జన్మనిచ్చిన మహిళనే తల్లి హోదా పొందుతుంది. కానీ అండం దానం చేసిన 3వ వ్యక్తి కాదు. భర్త అంగీకారంతో 3వ వ్యక్తి దానం చేసిన వీర్యంతో భార్యకు సంతానం కలిగితే అటువంటి సంతానాన్ని తిరస్కరించే హక్కును భర్తకు లేకుండా ఈ చట్టం చేస్తుందని జపాన్ ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. కానీ తమ పుట్టుకకు కారణమైన వీర్య దాతలు (sperm doner), అండ దాతల (egg doner) వివరాలను, గోప్యతను తెలుసుకునే అవకాశం ఇలా పుట్టే పిల్లలకు లేకుండా చేసింది.


 

సరోగసీ పిల్లలకు లేని హక్కు..వస్తున్న విమర్శలు
దీనిపై విమర్శలకు కారణంగా మారే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. తమలో ఎవరి జీన్స్ ఉన్నాయో, తాము ఎవరి వల్ల పుట్టామో తెలుసుకునే అవకాశం పిల్లలకు లేకపోతే ఎలా అంటూ జపాన్ ఫెడరేషన్ ఆఫ్ స్పర్మ్ డోనర్స్ వాదిస్తోంది.


జపాన్ లో అండం, వీర్యం అమ్మకాన్ని నిషేధించారు. అద్దె గర్భాన్ని కూడా ఈ దేశంలో నిషేధించారు. అయితే కృత్రిమ గర్భధారణకు సాయం చేసే 3వ వ్యక్తి వంశం, పూర్వాశ్రమ వివరాలు తెలుసుకునే అవకాశంపై కొత్త బిల్లు పరిశీలించనుంది. ఈమేరకు సరికొత్త నియమ నిబంధనలు రూపొందించేందుకు త్వరలో అన్ని పార్టీలతో కూడిన ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు.వీరి సంగతేంటి?

 

జపాన్ లో పెరుగుతున్న ఒంటరి మహిళలు..పురుషులు
జపాన్లో ఒంటరి మహిళలు, పురుషుల సంఖ్య పెరుగుతుండగా మరోవైపు స్వలింగ సంపర్క వివాహాలు పెరుగుతున్నాయి. (దీనికి కారణం జపాన్ లో జననాలు తగ్గిపోతుండటం కూడా కారణమని నిపుణులు అంటున్నారు) ఇటువంటి వారు సంతానం పొందాలనుకుంటే స్పర్మ్ డోనర్స్ లేదా ఎగ్ డోనర్స్ ను ఆశ్రయించాల్సిందే.


స్పర్మ్ డోనర్స్, ఎగ్ డోనర్స్ కు పెరుగుతున్న డిమాండ్
ఈనేపథ్యంలో అద్దె గర్భం లేదా స్పర్మ్ డోనర్స్, ఎగ్ డోనర్స్ కు రోజు రోజుకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. కానీ వీరి అవసరాలను స్పృశించేలా తాజా చట్టం లేకపోవడంతో పలు విమర్శలు కూడా వస్తున్నాయి. ఇటువంటి వారి సంగతేంటో అర్థం కావడం లేదనే మరో చర్చ తలెత్తుతోంది. ఇటీవలి కాలంలో జపాన్ లో స్పర్మ్ బ్యాంకులకు డిమాండ్ పెరుగుతోంది. వివిధ కారణాలతో సంతాన లేమితో బాధపడేవారు ఈ స్పర్మ్ బ్యాంకులను ఆశ్రయిస్తుండగా మరోవైపు కృత్రిమ గర్భధారణకు కూడా ఇలాంటి డోనర్లు అవసరమవుతున్నారు. ఈ బిల్లుకు ప్రతిపక్ష పార్టీ అయిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ మద్దతు ఇస్తోంది.