ట్రంప్ పిటిషన్లు కొట్టేసిన కోర్టులు

  • Published By: venkaiahnaidu ,Published On : November 6, 2020 / 09:11 AM IST
ట్రంప్ పిటిషన్లు కొట్టేసిన కోర్టులు

Judges in Georgia & Michigan Dismiss Trump Campaign Lawsuits మిచిగాన్‌,జార్జియాలో ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని,ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్ టీమ్ దాఖలు చేసిన పిటిషన్లను జార్జియా మరియు మిచిగాన్ లోని జడ్జిలు కొట్టివేసారు.



కాగా,నిన్న ఉదయం మిచిగాన్‌ లో ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని కోరుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, బ్యాలెట్ డ్రాప్ బాక్సుల వీడియోను యాక్సెస్ చేయలేదని ఆరోపిస్తూ ట్రంప్ టీమ్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసినట్లు న్యాయమూర్తి సింథియా స్టీఫెన్ చెప్పారు.



https://10tv.in/us-election-2020-over-59-million-votes-cast-but-wait-for-results-could-be-long/
ట్రంప్ ఫిర్యాదు ఓట్ల లెక్కింపు ప్రక్రియతో సంబంధం లేనందున మిచిగాన్ రాష్ట్ర కార్యదర్శిపై దాఖలైన వ్యాజ్యం సరిపోదని న్యాయమూర్తి చెప్పారు. ఓట్ల లెక్కింపు పూర్తి కానున్న దశలో దీన్ని నిలిపివేయలేమని న్యాయమూర్తి స్టీఫెన్ పేర్కొన్నారు. మిచిగాన్ లో బిడెన్ గెలవడానికి కొద్దిసేపటి ముందు మిచిగాన్,జార్జియాలలోని కోర్టులో వ్యాజ్యాలు సమర్పించారు.