Coronavirus in Kids : పిల్లల్లో కరోనావైరస్ కొత్త లక్షణం.. అధికారిక లక్షణాల జాబితాలో చేర్చాల్సిందేనంటున్న నిపుణులు

  • Published By: sreehari ,Published On : September 6, 2020 / 10:17 PM IST
Coronavirus in Kids : పిల్లల్లో కరోనావైరస్ కొత్త లక్షణం.. అధికారిక లక్షణాల జాబితాలో చేర్చాల్సిందేనంటున్న నిపుణులు

Warning Sign of coronavirus in kids : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా సోకినవారిలో ఇప్పటివరకూ చాలావరకు కొత్త లక్షణాలు బయటపడ్డాయి.. పెద్దవాళ్లతో పోలిస్తే చిన్నారుల్లో కరోనా ప్రభావం అంతగా లేదనే చెప్పాలి.. కరోనా బారిన పడిన చిన్నారులు తక్కువ శాతంగా ఉన్నారు. అయినప్పటికీ కరోనా పిల్లలోనూ కరోనా సోకుతోంది.. వారిలో తేలికపాటి లేదా అసలు లక్షణాలే కనిపించడం లేదు..



అందుకే ఇప్పటివరకూ పిల్లల కోసం నిర్దిష్ట లక్షణాలకు సంబంధించి జాబితా లేదు. అధికారిక కోవిడ్ లక్షణాల జాబితాలో జ్వరం, దగ్గు, వాసన లేదా రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే ఇతరుల నుంచి దూరంగా ఉండి పరీక్షలు చేయించుకోవాలంటున్నారు.. వికారం లేదా వాంతులు, విరేచనాలు పెద్దవారిలో కనిపించే లక్షణాలను జాబితాలో చేర్చాలని అమెరికాలోని ఆరోగ్య అధికారులు తెలిపారు. Queen’s University Belfast పరిశోధకులు పిల్లలలో వైరస్ లక్షణాలను విశ్లేషిస్తున్నారు.

కొత్త లక్షణాలపై హెచ్చరిక :
ఇటీవల కరోనావైరస్ సోకిందో లేదో నిర్ధారించడానికి సగటు 10ఏళ్ల వయస్సు గల 992 మంది పిల్లలను పరీక్షించారు. MedRxiv కోవిడ్ పరీక్షల ఫలితాలను వెల్లడించారు. వీరిలో 68 యాంటీబాడీస్ ఉన్నాయని వెల్లడించింది . అంటే వారిలో ఎప్పుడో కరోనా వైరస్ సోకి ఉండొచ్చునని భావిస్తున్నారు.



కరోనా పాజిటివ్ పరీక్షించిన సగం మందిలో జ్వరం వంటి లక్షణాలు ఉన్నాయని నివేదించారు. పాజిటివ్ తేలిన వారిలో దగ్గు కూడా ఒక సాధారణ లక్షణంగా గుర్తించారు. కొంతమంది పిల్లల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. జీర్ణశయాంతర లక్షణాల్లో విరేచనాలు, వాంతులు, ఛాతిలో తిమ్మిరి వంటివి ఉన్నాయి.

68 మంది పిల్లలలో 13 మందిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. యాంటీబాడీస్ ఉన్న పిల్లలలో కేవలం ఆరుగురు వాసన లేదా రుచిని కోల్పోయారని అధ్యయనం కనుగొంది. ఇలాంటి పిల్లలు ఎవరూ తీవ్ర అనారోగ్యంతో లేదా ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు.

వ్యాప్తిని నియంత్రించాలి :
కరోనా వైరస్ వచ్చిన చాలా మంది పిల్లల్లో అనారోగ్యంతో ఉండరని తమకు తెలుసనని అధ్యయనంలో డాక్టర్ టామ్ వాటర్‌ఫీల్డ్ చెప్పారు. రోగలక్షణ పిల్లలను మాత్రమే పరీక్షించడం 34లో 26శాతం లేదా 76 శాతం కేసులను గుర్తించిందని అన్నారు. జీర్ణశయాంతర లక్షణాలతో దాదాపు అన్నిటినీ 34లో 33, లేదా 97 శాతం కేసులను గుర్తించిందని తెలిపారు.



కరోనా వ్యాప్తిని నియంత్రించే దిశగా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు..  కొంతమంది పిల్లలో డయేరియా, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయని చెప్పారు. ఈ లక్షణాలను ఇప్పటికే ఉన్న అధికారిక లక్షణాల జాబితాలో చేర్చాలని నిపుణులు చెబుతున్నారు.