ఈ 5 కరోనా వ్యాక్సిన్‌లతో 100 కోట్ల డోస్‌లు సిద్ధం.. ఎప్పటికంటే?

  • Published By: sreehari ,Published On : October 23, 2020 / 06:07 PM IST
ఈ 5 కరోనా వ్యాక్సిన్‌లతో 100 కోట్ల డోస్‌లు సిద్ధం.. ఎప్పటికంటే?

5 coronavirus vaccines : ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా డజన్ల కొద్ది కరోనా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశల్లో ఉన్నాయి.

2021-22 ముగింపుకు ముందుగానే ప్రపంచవ్యాప్తంగా 5 వేర్వేరు (Covishield, Covovax, COVIVAXX, COVI-VAC, SII COVAX ) కరోనా వ్యాక్సిన్ల నుంచి 1 బిలియన్ (100 కోట్లు) డోస్‌లను సిద్ధం చేస్తున్నామని Serum Institute of India (SII) సీఈఓ అదార్ పూనవాలా వెల్లడించారు.



ఈ ఐదు కరోనా వ్యాక్సిన్లలో ఏదైనా ఒకదాన్ని ప్రతి తొలి త్రైమాసికానికి లాంచ్ చేసేందుకు సీరమ్ ప్లాన్ చేస్తోంది 2021 ప్రారంభంలో ఏదైనా ఒక వ్యాక్సిన్ లాంచ్ చేసే అవకాశం ఉంది.



ప్రస్తుతం యూకేలో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన Covishield వ్యాక్సిన్… Anglo Swedish డ్రగ్ మేకర్ AstraZeneca కంపెనీ నుంచి లైసెన్స్ పొందింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ భారతదేశంలో దాదాపు 1,600 మందితో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది.



కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు British-Swedish ఫార్మా కంపెనీ AstraZenecaతో సీరమ్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘ఇప్పటికే 20 నుంచి 30 మిలియన్ డోస్‌లను రెడీ చేస్తున్నాం.



ఒక నెల వ్యవధిలో 70 మిలియన్ల నుంచి 80 మిలియన్ల వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచవచ్చు. ప్రస్తుతం తక్కువ మోతాదులో వ్యాక్సిన్ ఉత్పత్తిపై దృష్టిపెడుతున్నాం’ అని అన్నారు.