పిల్లాడు తిండితినట్లేదంటే…కరోనా కొత్త లక్షణానికి సంకేతం కావచ్చు

  • Published By: sreehari ,Published On : August 31, 2020 / 03:27 PM IST
పిల్లాడు తిండితినట్లేదంటే…కరోనా కొత్త లక్షణానికి సంకేతం కావచ్చు

మీ ఇంట్లో పిల్లలు సరిగా తినడంలేదా? కరోనా కొత్త లక్షణానికి సంకేతం కావొచ్చు. ఇప్పుడు చాలామంది చిన్నారుల్లో ఈ తరహా లక్షణ ఒకటి బాగా కనిపిస్తోంది. సాధారణంగా కొత్త కరోనా లక్షణాల్లో కొత్త నిరంతర దగ్గు, జ్వరం, రుచి లేదా వాసన కోల్పోవడం వంటి ఎక్కువగా కనిపిస్తాయని NHS పేర్కొంది. కానీ ఇప్పుడు పిల్లలలో ప్రధాన లక్షణాలు పెద్దల కంటే భిన్నంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు..



ఇందులో ప్రధానంగా ఆకలి తగ్గడమనే లక్షణం అధికంగా పిల్లల్ల కనిపిస్తోందని అంటున్నారు. దేశవ్యాప్తంగా పిల్లలు వచ్చే నెలలో తిరిగి పాఠశాలకు వెళ్లాల్సి ఉంది. లేదంటే విద్యాసంవత్సరాన్ని కోల్పోయే అవకాశం ఉంది. మరోవైపు మహమ్మారి కరోనా నుంచి మరణాలు తగ్గుతున్నాయి. వాస్తవానికి కోవిడ్ -19 ఆరోగ్యకరమైన పిల్లలపై పెద్దగా ప్రభావం ఉండదని ఒక అధ్యయనం వెల్లడించింది .

లండన్ లోని కింగ్స్ కాలేజీలోని జన్యు ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ మాట్లాడుతూ.. పెద్దలకు వ్యాపించే కరోనా ఐదు లక్షణాలతో పిల్లలు బాధ పడుతున్నారు. కోవిడ్‌కు పాజిటివ్ పరీక్షించిన 18 ఏళ్లలోపు పిల్లలలో మొదటి ఐదు లక్షణాలు తలనొప్పి, అలసట, జ్వరం, గొంతు నొప్పి, తినకపోవడం వంటి లక్షణాలను కోవిడ్ సింప్టమ్ ట్రాకర్ యాప్ నుండి వచ్చిన డేటా వెల్లడించామని చెప్పారు.



చిన్నారులతో పోలిస్తే.. పెద్దవారిలో మొదటి ఐదు నుంచి లక్షణాలు భిన్నంగా ఉంటాయి. సాధారణంగా దగ్గు, ఊపిరి తీసుకోలేకపోవడం, వాసన కోల్పోవడం వంటివి గుర్తించారు. అలాగే, తలనొప్పి, భోజనం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే చాలు.. వెంటనే వైద్యసాయం తీసుకోవడం మంచిందని చెబుతున్నారు. ప్రైమరీ స్కూళ్లు, హై స్కూళ్లలోని విద్యార్థుల మధ్య స్పష్టమైన తేడాలు లేవని ప్రొఫెసర్ స్పెక్టర్ చెప్పారు. పిల్లలలో చర్మంపై దద్దుర్లు చాలా సాధారణ లక్షణమన్నారు. ఈ దద్దుర్లు ఇతర లక్షణాల ముందు రావచ్చు. లేదంటే ఇతర లక్షణాల తర్వాత వచ్చే అవకాశం ఉందన్నారు.

కరోనా లక్షణాలపై ప్రస్తుత ప్రభుత్వ మార్గదర్శకాలతో పిల్లలకు పెద్దలకు ఒకేలా ఉంటాయని తేల్చేశారు. ఈ పద్దతిని ఫాలో అవడం ద్వారా అనేక కేసులను తప్పించవచ్చని హెచ్చరించారు. ఇప్పటివరకు కరోనా సింప్టమ్ ట్రాకర్ యాప్‌లో 300,000 మంది పిల్లల డేటా ఉంది. దీనిద్వారా పిల్లలు ఎలా వైరస్ బారినపడుతున్నారో గుర్తించడానికి సాయపడుతుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు యాప్ ద్వారా సైన్ అప్ చేయమని ప్రోత్సహించాలని సూచించారు. ఒక్కో వయసు వారిలో కరోనా లక్షణాలు ఒక్కోలా ఉంటాయని పరిశోధకులు తెలిపారు.