సోషల్ మీడియాలో రౌడీ ప్రకటన : ఎవరినైనా కొట్టాలంటే రూ.5 వేలు, చంపాలంటే 55 వేలు..!!

  • Published By: nagamani ,Published On : November 6, 2020 / 10:46 AM IST
సోషల్ మీడియాలో రౌడీ ప్రకటన : ఎవరినైనా  కొట్టాలంటే రూ.5 వేలు, చంపాలంటే 55 వేలు..!!

Up gangsters services on social media add : సోషల్ మీడియాను జనాలు ఎలాపడితే అలా వాడేసుకుంటున్నారు. చేసే వృత్తి ఏదైనా సరే సోషల్ మీడియా వేదికగా తమ తాము ఎలివేట్ చేసుకుంటున్నారు. వ్యాపారాలు..టాలెంట్ లే కాదు ఏదైనా సరే సోషల్ మీడియా ప్రచార వేదికగా మారిపోయింది. ఈ ప్రచారం ఎంతలా మారిందంటే ఓ గూండా ఏకంగా ‘‘మీరు ఎవరినైనా చంపాలనుకుంటున్నారా? అయితే నన్ను కాంటాక్ట్ చేయండీ..మీరు ఎవరినైనా కొట్టాలనుకంటున్నారా? వారి కాలో చేయో తీసేయాలనుకుంటున్నారా? అయితే నన్ను కాంటాక్ట్ చేయండి అంటూ ప్రకటన ఇచ్చేంతగా మారిపోయింది. ఓ గూండా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.



వివరాల్లోకి వెళితే..నేరాల అడ్డా మారిపోయిన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో గూండాలు బరితెగించారు. ఏకంగా సోషల్ మీడియాలో తాము చేసే పనిని ప్రకటనగా వేసుకున్నారు. మీరు ఎవరినైనా బెదరించాలనుకున్నా..కొట్టాలనుకున్నా..కాలో చేయో తీసేయించాలనుకున్నా..లేదా ఏకంగా మర్డర్ చేయాలనుకున్నా..మమ్మల్ని సంప్రదించండీ అంటూ ప్రకటన ఇచ్చారు. వారు చేసే పనులకు కిరాయి (సుపారీ) ఎంత తీసుకుంటారో కూడా రేట్లు కూడా ప్రకటించారు.
https://10tv.in/london-law-firm-posts-job-ad-looking-for-a-professional-dog-walker-on-a-salary-of-30000-with-a-pension-and-free-healthcare/


ఎవరినన్నా ‘బెదిరించడానికి జస్ట్ రూ. 1000లు మాత్రమే..అదే కిడ్నాప్‌ చేయాలంటే రూ.5000, కాలో చేయాలనుకుంటే..చితక్కొట్టి వదిలేయాలనుకుంటే రూ. 10000, అదే వారిని ఏకంగా హత్య చేయడానికి రూ. 55,వేలు అని అని పోస్టర్లో చక్కగా ప్రింట్ చేశారు.



అంతేకాదు ఈ ప్రకటన చూసి ఇదేదో జోక్ అనుకోవద్దరు..ఈ పనులు గ్యారంటీగా చేసి పెడతామని నమ్మకం కలిగించేలా ఓ యవకుడి ఫొటోను కూడా పోస్టర్ లో ప్రింట్ చేయించారు. ఆ యువకుడు చేతిలో తుపాకీ పట్టుకుని ‘‘మీరు ఆర్డర్ చేస్తే చాలు ఎవరినైనా వేసేస్తా’’ అన్నట్లుగా దర్జాగా ఉన్నాడు సదరు రౌడీ.



ముజఫర్ నగర్‌లో రౌడీలు ఎక్కువే అయినా ఇలా పబ్లిగ్గా రేట్లు ప్రకంటించుకోవడం ఇదే తొలిసారి. ఈ పోస్టర్ కాస్తా వైరల్ కావడంతో పోలీసులు ఆ రౌడీల కోసం వెతగ్గా..వారి దర్యాప్తులో మరో షాకింగ్ విషయం కూడా తెలిసింది. పోస్టర్‌లో ఉన్న నిందితుణ్ని ఓ జవాన్ కొడుకుగా గుర్తించారు.



వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్‌లో మరికొందరు యువకులు కూడా ఉన్నారని, అందరికీ తాము ‘తగిన పని’ని డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే చేసి పెడతామని వెల్లడించటం మరో షాకింగ్ విషయం.



చూశారా సోషల్ మీడియా అంటే హోటళ్లు, కిరాణా షాపులు, కూరగాయలు, సినిమాలు… వ్యాపారం ఏదైనా యాడ్ ఇచ్చుకోవటమే కాదు ఏకంగా ఇలా రౌడీలు..గూండాలు చేసే అసాంఘీక పనుల ప్రకటవేదికగా ఎలా మారిపోయిందో..!! ‘నేను రౌడీని… మీకు ఏ పని చేసి పెట్టాలో చెప్పండి..’ చిటికెలో చేసేస్తాం అంటూ ఎలా బహరంగ ప్రకటన ఇచ్చేశారో..!! తమకు బేరాలు రావాలంటే తాము ఇటువంటి పనులు చేస్తామని అందరికీ తెలియాలి కదా అందుకే ఈ ప్రకటన ఇచ్చామనీ భలే దర్జాగా చెప్పేస్తున్నారు గూండాలు…!! మరి సోషల్ మీడియా ట్రెండ్ అలా ఉంది మరి..!!!