అమెరికాలో ఒక్కరోజే 1.2లక్షల కొవిడ్‌ కేసులు

  • Published By: sreehari ,Published On : November 7, 2020 / 09:00 AM IST
అమెరికాలో ఒక్కరోజే 1.2లక్షల కొవిడ్‌ కేసులు

US COVID-19 cases: అమెరికాలో కరోనా వైరస్‌ మహామ్మారి మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది. అగ్రరాజ్యంలో ఎన్నికల ఫలితాల హడావుడిలో కొవిడ్‌ మహమ్మారి మళ్లీ వణికిస్తోంది. కొన్ని రోజులుగా అక్కడ రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.



ఈ సంఖ్య ఏకంగా లక్షా 23వేలు దాటినట్లు జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్శిటీ వెల్లడించింది. దీంతో అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 96లక్షలు దాటింది. ఇక వరుసగా మూడో రోజు వెయ్యి మందికి పైగా కరోనాకు బలయ్యారు.

దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,34,000 దాటింది. గురువారం ఒ‍క్క రోజే దేశవ్యాప్తంగా 1,06,414 కరోనా కేసులు నమోదయ్యాయి.



దీంతో మొత్తం కేసుల సంఖ్య 9.6 మిలియన్లకు చేరింది. కరోనా వైరస్‌ బారినపడి గడిచిన 24 గంటల్లో దాదాపు 1000 మంది మరణించగా.. ఇప్పటివరకు మొత్తం 2,40,953 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల పెరుగుదల శాతం 7.1గా ఉండగా.. టెస్టుల పెరుగుదల శాతం 6.2శాతంగా ఉంది.



https://10tv.in/special-interest-in-the-results-of-the-us-presidential-election/
ఈ చలి కాలంలో కేసులు, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ విజయం లాంఛనంగానే కనిపిస్తోంది.



అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ గెలిచే అవశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 264 ఎలక్టోరల్‌ ఓట్లతో విజయానికి అతి చేరువలో ఉన్నారు. ఇంకో ఆరు ఓట్లు సాధిస్తే అధ్యక్ష పదవిని దక్కించుకుంటారు. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ 214 ఓట్లకే పరిమితమయ్యారు.