యూట్యూబ్ ఆగిపోయింది.. వీడియోలు కనిపించట్లేదు

  • Published By: vamsi ,Published On : November 12, 2020 / 07:13 AM IST
యూట్యూబ్ ఆగిపోయింది.. వీడియోలు కనిపించట్లేదు

యూట్యూబ్ ద్వారా ఆన్‌లైన్ వీడియో ఆధారిత సేవలకు విఘాతం కలిగింది. కొద్ది గంటల నుంచి యూట్యూబ్‌లో ఆన్‌లైన్‌లో వీడియోలు చూడడానికి సాంకేతిక సమస్యలు తలెత్తినట్లుగా కనిపిస్తుంది. దీంతో YouTube యూజర్లు గందరగోళానికి గురయ్యారు. ముందుగా వారి ఛానెళ్లు మాత్రమే ఆగిపోయినట్లుగా భావించారు.



అయితే అన్నీ యూట్యూబ్ ఛానెళ్లు ఆగిపోవడంతో సాంకేతిక సమస్యే కారణం అని భావిస్తున్నారు. ఈ విషయంపై యూట్యూబ్ సంస్థ కూడా క్లారిటీ ఇచ్చింది. భారతదేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్, కెనడా తదితర దేశాల్లో కూడా యూట్యూబ్ సేవలు నిలిచిపోయినట్లుగా తెలుస్తుంది.



యూట్యూబ్ సేవలు నిలిచిపోవడం యూజర్లను కంగారు పెట్టేస్తుంది. యూట్యూబ్‌లో ఎలాంటి వీడియోలు అప్‌లోడ్ కావడం లేదు. ఏమైందో తెలియడం లేదు.. ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాల్లో యూజర్లు తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్రం యూట్యూబ్ కంటెంట్‌పై ఫోకస్ చేసినట్లుగా వార్తలు వచ్చిన తర్వాతి రోజే యూట్యూబ్ సేవలు ఆగిపోవడం గమనార్హం.



అయితే యూట్యూబ్ సాంకేతిక బృందాలు యూజర్లకు కలిగిన అంతరాయాన్ని నిర్మూలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన సాంకేతిక బృందం సమస్యను పరిష్కరిస్తున్నట్లుగా ప్రకటించింది యూట్యూబ్. అయితే, ఈ సమస్య ఎందుకు వచ్చిందో మాత్రం వెల్లడించలేదు. యూజర్లు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం కావాలని యూట్యూబ్‌ను యూజర్లు కోరుతున్నారు.