86శాతం కోవిడ్ బాధితుల్లో కరోనా వైరస్ దాక్కుంటోంది..!

  • Published By: sreehari ,Published On : October 11, 2020 / 04:01 PM IST
86శాతం కోవిడ్ బాధితుల్లో కరోనా వైరస్ దాక్కుంటోంది..!

Coronavirus Official Symptoms : కరోనా వైరస్ చాపకిందనీరులా వ్యాపిస్తోంది. కరోనా వైరస్ సోకినట్టు అనవాళ్లు కనిపించడం లేదు. కరోనా సోకిందా లేదా అనేది కూడా అర్థంకాని పరిస్థితి. (Covid positive in lockdown) లాక్‌డౌన్ సమయంలో 86 శాతం కోవిడ్ బాధితుల్లో కరోనా వైరస్ అధికారిక లక్షణాలు కనిపించడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా కరోనా అధికారిక లక్షణాలను ప్రకటించింది.



కానీ, కరోనా వైరస్ దొంగదెబ్బ కొడుతోంది. కరోనా పాజిటివ్ వచ్చినవారిలో 86 శాతం మందిలో అధికారిక లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించడం లేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. NHS ప్రకారం.. నిరంతరం దగ్గు, జ్వరం లేదా రుచి కోల్పోవడం లేదా వాసన తెలియకపోవడం కరోనా అధికారిక లక్షణాల్లో ఒకటిగా వెల్లడించింది.



ప్రపంచమంతా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ ను కంట్రోల్ చేయాలంటే విస్తృతంగా టెస్టింగ్ ప్రోగ్రామ్ చేపట్టాలని University College London (UCL)కి చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. అప్పుడే ఎవరికి కరోనా వైరస్ సోకిందో నిర్ధారించడం సాధ్యపడుతుందని తెలిపారు. టెస్టింగ్ ప్రక్రియ ద్వారా కరోనా వ్యాప్తిని ముందుగానే నియంత్రించగలమని అభిప్రాయపడ్డారు.

National Statistics (ONS) కార్యాలయంలోని డేటా ఆధారంగా రీసెర్చర్లు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కరోనా ఇన్ఫెక్షన్ సోకినవారిలో 36,061 మంది బాధితులు ఇంగ్లండ్, వేల్స్, నార్తరన్ ఐర్లాండ్ దేశాలకు చెందినవారిగా నిర్ధారించారు. 115 మందిలో 0.32 శాతం కరోనా పాజిటివ్ వచ్చినవారే ఉన్నారని నిపుణులు రివీల్ చేశారు.



అధ్యయనంలో పాల్గొన్నవారిలో టాప్ 3 కరోనా లక్షణాలను గుర్తించామన్నారు. 158 మందిలో (0.43శాతం) ఈ మూడు లక్షణాలు ఉన్నాయని NHS డేటా పేర్కొంది. మొత్తంగా 115 కరోనా బాధితుల్లో 16 మందిలో (13.9శాతం) పాజిటివ్ అని తేలగా.. మరో 99మందిలో (86.1శాతం) లక్షణాలు విరుద్ధంగా ఉన్నాయని రిపోర్టు వెల్లడించింది. కరోనా అధికారిక లక్షణాల్లో మరికొన్ని కరోనా లక్షణాలను చేర్చాల్సిందిగా కోరుతూ ఇదివరకే వైద్య నిపుణులు ప్రభుత్వాన్ని కోరారు.



పాజిటివ్ వచ్చినవారిలో కొందరిలో అలసట, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు కూడా ఉన్నాయని అధ్యయన డేటాలో పేర్కొంది. పాజిటివ్ కేసుల్లో 25మందిలో (23,5 శాతం) మందిలో కరోనా లక్షణాలు ఉంటుండగా.. మిగతా 88 మందిలో (76.5శాతం) లక్షణరహిత కరోనా బాధితులు ఉన్నారని అధ్యయనంలో తేలింది.