ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కల్లోలం… తూర్పుగోదావరిలో 994 కేసులు

  • Published By: sreehari ,Published On : July 18, 2020 / 04:38 PM IST
ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కల్లోలం… తూర్పుగోదావరిలో 994 కేసులు

ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఒక్క తూర్పుగోదావారి జిల్లాలోనే కొత్తగా 994 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీలో కొత్తగా 3,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 52 మంది మృతిచెందారు.

కర్నూలు జిల్లాలో 550, పశ్చిమ గోదావరిలో 407, చిత్తూరులో 343, నెల్లూరు జిల్లాలో 278 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 266 కేసులు నమోదు కాగా, అనంతపురంలో 220, గుంటూరులో 214, శ్రీకాకుళం జిల్లాలో 182 కేసులు నమోదయ్యాయి.

తూర్పుగోదావరిలో 12 మంది, గుంటూరులో 8 మంది, కృష్ణా జిల్లాలో 8 మంది మృతిచెందారు. అనంతపురంలో 7 మంది, పశ్చిమ గోదారిలో 5 మంది, ప్రకాశంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, విశాఖ జిల్లాలో ఇద్దరు కరోనాతో మృతిచెందారు.

ఏపీలో ఇప్పటివరకూ మొత్తంగా 44,609కు కరోనా కేసులు చేరగా, 586 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఏపీలో 22,260 యాక్టివ్ కేసులు ఉండగా, 21,763 మంది డిశ్చార్జి అయ్యారు. ఏపీలో గత 24 గంటల్లో 23,872 శాంపిల్స్ పరీక్షించగా 3,963 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారించారు. 1,411 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.