తల్లి హృదయం : ఆకలితో ఉన్న శిశువులకు తన చనుబాలను డొనేట్ చేస్తున్న భారతీయ మహిళ

  • Published By: sreehari ,Published On : November 14, 2020 / 04:58 PM IST
తల్లి హృదయం : ఆకలితో ఉన్న శిశువులకు తన చనుబాలను డొనేట్ చేస్తున్న భారతీయ మహిళ

Indian Woman Donating Donating Breast Milk : కరోనా మహమ్మారి సమయంలో తల్లిపాలు అందని శిశువులకు తల్లిగా మారిందో భారతీయ మహిళ.. తన చనుబాలతో శిశువుల ఆకలి తీర్చుతోంది ముంబైకి చెందిన నిధి పర్మార్ హిరానందని.. ఎంతోమంది శిశువులకు తన చనుబాలను విరాళంగా అందిస్తోంది.



42ఏళ్ల ఫిల్మ్ మేకర్ అయిన హిరానందని ఈ ఏడాది ఆరంభంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తన నెలన్నర బాబుకు చనుబాలునే ఇస్తోంది.

బిడ్డ ఆరోగ్యానికి డబ్బా పాలు కంటే తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవి అంటారు.

శిశువుకు ఆరోగ్యం కూడా.. అలాంటి తల్లి చనుబాలును వృథా చేయడానికి ఆమెకు ప్రాణం ఒప్పలేదు..

తనకు చనుబాల ఉత్పత్తి అధికంగా ఉండటంతో.. తనబిడ్డకు సరిపోగా మిగిలిన చనుబాలు వృథా కాకుండా చూడాలని భావించింది.

ఎలా చనుబాలను సురక్షితంగా నిల్వ చేయాలో అర్థం కాలేదు. మొదట్లో బాటిల్ లో పోసి ఇంట్లో ఫ్రీజులో పెట్టానని హిరానందిని చెప్పుకొచ్చింది.



ఇంట్లో ఫ్రీజులో పెడితే మూడు నాలుగు నెలలకే నిల్వ ఉంచిన తల్లి పాలు పాడైపోతాయని ఇంటర్నెట్లో చదివినట్టు తెలిపింది.

అందుకే ప్రతి 150 మిల్లీ లీటర్ల పాలను మూడు ప్యాకెట్లలో నిల్వ ఉంచుతోంది. తనకు తెలిసిన స్నేహితులు, బంధువులను అడిగి పాలను డొనేట్ చేయాలని తెలిపింది.

అందుకు వారంతా తమకు తోచిన సలహాలు సూచనలు చేశారు. కొందరేమో ఫేస్ ప్యాక్ వాడొచ్చునని అంటే.. మరికొందరు బేబీలతో స్నానం చేయించేందుకు వాడొచ్చునని అన్నారు.

కొందరేమో అవసరం లేనప్పుడు పారయేండని, లేదంటే సెలూన్లలో క్రీములు తయారీకి వాడొచ్చంటూ సలహా ఇచ్చారు. వారి సలహాలతో హిరానందని సంతృప్తి చెందలేదు.



వారంతా చెప్పినవి తనకు పిచ్చితనంగా అనిపించిందని, తన బ్రెస్ట్ మిల్క్ ను ఏదైనా మంచికి వాడాలనుకున్నట్టు చెప్పింది.Donating Her Breast Milk

ఇంటర్నెట్లో సెర్చ్ చేసింది.. అమెరికాలో చనుబాలను డొనేట్ చేస్తారని తెలుసుకుంది. తనకు దగ్గరలోని డొనేషన్ సెంటర్లు ఏమైనా ఉన్నాయా అని నెట్లో వెతికింది.

చివరికి.. హిరానందిని గైనాకాలిజిస్ట్ ఒకరు ముంబై ఆస్పత్రి ఒకటి ఉందని సిఫార్సు చేశారు. ఖార్ లోని సూర్య ఆస్పత్రిలో చనుబాలను డొనేట్ చేయవచ్చునని సూచించారు.

గత ఏడాది నుంచే తల్లి చనుబాలను స్టోర్ చేసే మిల్క్ బ్యాంకుగా సేవలు అందిస్తోంది. ఇక్కడే తన చనుబాలను డొనేట్ చేయాలని భావించింది.



ఒకవైపు దేశవ్యాప్తంగా మార్చినెలలో లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో డోర్ స్టెప్ పికప్ కష్టంగా మారింది.. అందుకే సూర్య ఆస్పత్రిలోని Neonatal Intensive Care Unit (NICU) మిల్క్ బ్యాంకుకు డొనేట్ చేసింది.

మే నుంచి 40 లీటర్ల చనుబాలు డొనేట్ : 
ఈ మిల్క్ బ్యాంకు ద్వారా ఎందరో శిశువులకు చనుబాలను అందించింది. ఈ ఏడాదిలో మే నుంచి హిరానందిని 42 లీటర్ల వరకు చనుబాలను డొనేట్ చేసింది.

NICUలో ప్రీమెచ్యూర్, బరువు తక్కువగా పుట్టిన శిశువులే ఎక్కువగా ఉన్నారు. దాదాపు 65 యాక్టివ్ బెడ్స్‌పై ఇంక్యూబేటర్లలో తల్లి లేని శిశువులు పాల కోసం అల్లాడిపోతున్నారు. కొంతమంది తల్లులు కొన్ని అనారోగ్య కారణాల రీత్యా పుట్టిన బిడ్డకు పాలు ఇచ్చే పరిస్థితి లేదు.

2017లో నిర్వహించిన ఓ చిన్న సర్వేలో.. పుట్టిన గంటలోపు తమ శిశువులకు 44 శాతం మంది భారతీయ తల్లులు మాత్రమే తమ చనుబాలను ఇవ్వగలుగుతున్నారు. 2018 మరో సర్వేలో 70 శాతం మంది భారతీయ తల్లులు చనుబాలు ఇవ్వడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి సహకారం లేకపోవడం, చనుబాలిచ్చేందుకు పరిస్థితులు అనుకూలించకపోవడం వంటి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు.



అలాంటి వారి కోసం హిరానందిని తన చనుబాలను డొనేట్ చేశారు. తాను డొనేట్ చేసిన పాలను ఎంతమంది శిశువులకు ఉపయోగపడుతున్నాయో తెలుసుకునేందుకు ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ 60 వరకు శిశువులు తల్లి పాల కోసం ఆరాటపడుతున్నాయి.

అందుకే తాను కనీసం ఏడాది వరకు తన చనుబాలను డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నానని హిరానందని చెప్పుకొచ్చింది. వాస్తవానికి భారతదేశపు మొట్టమొదటి హ్యుమన్ మిల్క్ బ్యాంకు ముంబైలోని సియాన్ ఆస్పత్రిలో ఉంది. 1989లోనే ఈ మిల్క్ బ్యాంకును ఏర్పాటు చేశారు.



తల్లి పాలు ఇవ్వలేని శిశువులకు ఇలా మరో తల్లి చనుబాలను డొనేట్ చేయడం మంచి ప్రత్యామ్నాయమని వైద్యులు అంటున్నారు. కానీ, చాలామందికి దీనిపై పెద్దగా అవగాహన లేదంటున్నారు.

చాలామందికి ఈ మిల్క్ బ్యాంకులు ఎక్కడ ఉన్నాయి ఎలా డొనేట్ చేయాలో కూడా తెలియదని ముంబై ఆధారిత గైనకాలిజిస్ట్ ముంజాల్ వి కపాడియా అన్నారు.

గత ఏడాదిలో బాలీవుడ్ నటి నేహా డుపియా చనుబాల డొనేషన్ పై అవగాహన కల్పించారు. తాను 2018లో మొదటి బిడ్డకు జన్మనిచ్చినప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.