పనిమనిషి కావలెను..నెలకు రూ. 18.5 లక్షల జీతం..!!

  • Published By: nagamani ,Published On : October 28, 2020 / 12:47 PM IST
పనిమనిషి కావలెను..నెలకు రూ. 18.5  లక్షల జీతం..!!

Britain queen elizabeths housekeeping assistant job : పనిమనిషి కావలెను..నెల జీతం రూ. 18 లక్షలు. ఈ ప్రకటన చూస్తే ఇదేదో జోక్ అనో లేదా బోగస్ అనే అనుకుంటాం.కానీ నిజమే నిజంగా పనిమనిషి కావాలి. నెలకు రూ.18.5లక్షల జీతం ఇస్తాం..అనే ప్రకటించారు అంటే వారి రేంజ్ ఏంటో ఊహించుకోవచ్చు.


అంబానీ, టాటా, బిర్లాల ఇళ్లలో పనిచేసేవాళ్లకే అంత జీతం ఉండదు. వారి ఇళ్లలో పనిచేసేవారికి మహా ఉంటే రూ.50వేలు అనుకుందాం…ఇంకా అయితే రూ.లక్ష. కానీ.. 18 లక్షల రూపాయల జీతం ప్రకటించారు అంటే అదేదో ఆషామాషీ కుటుంబం అయి ఉండదని ఊహించే ఉంటారు. మీ ఊహ కూడా నిజమే.


ఈ ప్రకటన ఇచ్చింది సాక్షాత్తూ..బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ దగ్గర చేయాల్సిన ఉద్యోగం అది. అందుకే అంత జీతం. మరి ఇప్పుడైనా నమ్ముతారు కదూ రూ.18 లక్షల జీతం అంటే..మరి రాణి ఎలిజిబెత్ దగ్గర ఉద్యోగం అంటే మాటలా..ఇంచుమించు లక్షాధికారి రేంజాఫా స్టైల్ ఉండాల్సిందే. రాణి ఎలిజిబెత్ ను అనుక్షణం అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. కనురెప్పపాటు సమయంలో అన్ని అమర్చిపెట్టాలి.


కాకపోతే..పనీపాటాలేని బ్రిటిన్ రాజరిక కుటుంబీకుల కోసం ఏటా కోట్లకొద్దీ ఖర్చు చేస్తున్నారని విమర్శలు వస్తున్న క్రమంలో ఈ పనిమనిషి ఉద్యోగ ప్రకటన పెను దుమారం రేపుతోంది. విండ్సర్ క్యాజిల్లో హౌజ్‌ కీపర్ పోస్టును భర్తీ చేస్తున్నామని..అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవాలని రాచకుటుంబం ప్రకటన ఇచ్చింది. ఈ ఉద్యోగంలో జాయిన్ అయితే మొదట నెలకు రూ.18.5లక్షల జీతం ఉంటుందంటూ ఆశలు రేకెత్తించింది. అంతేకాదు సంవత్సరానికి 33 సెలవులు కూడా ఉంటాయని ప్రకటించింది. హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు ట్రావెలింగ్ అలవెన్సు వేరుగానే ఉంటుంది.


రాచకుటుంబ బాగోగులు చూసే ఇతర సిబ్బందికి ఇస్తున్నట్లే ట్రావెలింగ్, హెల్త్, ఇన్సూరెన్స్ గట్రా అన్ని అలవెన్సులూ ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు. కాకపోతే ఈ ఉద్యోగం రావాలంటే అంత ఈజీకాదు. రాజదర్పాలను అర్థం చేసుకోవాలి. వారి అలవాట్లు, వారి రుచులు, అభిరుచులు, వారి ఆలోచనా విధానం..ఏ క్షణంలో ఏం కావాలంటో తెలియాలి. వారి అడుగులకు మడుగులు వత్తాలి. ఇలా చాలా అంటే చాలా నేర్చుకోవాలి. తెలుసుకోవాలి.



ఈ ఉద్యోగానికి సెలక్ట్ అయితే ఏకంగా 13 నెలలపాటు ట్రైనింగ్ కూడా ఉంటుంది. రాచకుటుంబాలకు సంబంధించి కీలక విషయాలను తెలుసుకోవాలి. కానీ ఏ చిన్న విషయం కూడా బైటకు పొక్కకూడదు..!


రాచకుటుంబీలకు సంబంధించి ఏ విషయం బైటకు చెప్పకూడదు. వారి కదలికలు..ఎప్పుడు ఏ రాసప్రాసాదంలో ఉంటారో ఏం చేస్తుంటారో..ఏం తింటారో ఇలా ఏ ఒక్క చిన్న విషయం కూడా బైటకు పొక్కకూడదు. నోరు మెదపకూడదు.



అంతేకాదు అతి ముఖ్యమైన విషయం బ్రిటన్ ఇంగ్లీష్ స్లాంగ్ లో గలగలా మాట్లాడ్డంతోపాటు..లెక్కలు కూడా బాగా రావాలట..మరి మాటలా బ్రిటన్ రాణి కొలువులో ఉద్యోగం అంటే..!అది పనిమనిషి ఉద్యోగమైనా సరే..!!అది బ్రిటన్ రాణి కుటుంబాల రేంజ్…!!!