గ్రేటర్‌ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు

  • Published By: vamsi ,Published On : November 24, 2020 / 08:47 AM IST
గ్రేటర్‌ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు

GHMC polls:ప్రతి వ్యక్తి తన ఓటు హక్కును పొందేలా.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూసేందుకు, అవకాశం కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే వికలాంగులకు(PWD) పోస్టల్ బ్యాలెట్ ఎంపిక ద్వారా ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చింది. PWDలతో పాటు, 80ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మరియు కోవిడ్-పాజిటివ్ వ్యక్తులు పోస్టల్ బ్యాలెట్లకు అర్హులు అని ప్రకటించింది.



ఈ క్రమంలోనే గ్రేటర్‌ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ప్రకటనలో వెల్లడించారు. ముసలివారు, వికలాంగులు, కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిన వారు www.tsec.gov.in వెబ్‌సైట్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన స్పష్టం చేశారు. భారతదేశంలో COVID-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని, కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి ప్రమాదాన్ని అరికట్టడానికి, కమిషన్ విస్తృత నిర్ణయాలను సూచించింది.



ఇక భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన COVID-19 క్రిమిసంహారక, పరిశుభ్రత మరియు నివారణకు సంబంధించి Standard operating Procedures (SOP)ను అనుసరించి GHMCకి ఎన్నికలు నిర్వహించేటప్పుడు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై జాగ్రత్తగా ఉన్నట్లు అధికారులు చెప్పారు.



https://10tv.in/1122-election-candidates-ghmc-election-2020/
సాధారణంగా కొంతమంది ఓటర్లు, సేవా సిబ్బంది మరియు వారి భార్యలు, నిర్భంధంలో ఉన్న వ్యక్తులు మరియు ఎన్నికల విధుల్లో ఉన్న వ్యక్తులకు పోస్టల్ బ్యాలెట్లు అందించబడతాయి. అయితే ఈసారి మాత్రం కోవిడ్-19 కారణంగా ఎన్నికల సంఘం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసిన తరువాత, ఓటరు RO పంపిన సీల్డ్ ప్యాకెట్‌ను అందుకుంటారు, ఇందులో పోస్టల్ బ్యాలెట్ పేపర్, ఫారం – XXVI-A లో డిక్లరేషన్, చిన్న కవర్ ‘A’ (ఫారం- XXVII), పెద్ద కవర్ ‘B’ ( ఫారం- XXVIII) మరియు ఓటర్ల మార్గదర్శకత్వం కోసం సూచనలు ఉంటాయి.