వాల్వ్డ్ ఎన్‌-95 మాస్కులు వాడొద్దు, కరోనా సోకే ప్రమాదం ఉంది

  • Published By: naveen ,Published On : July 21, 2020 / 08:37 AM IST
వాల్వ్డ్ ఎన్‌-95 మాస్కులు వాడొద్దు, కరోనా సోకే ప్రమాదం ఉంది

ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే రెండే మార్గాలు. ఒకటి భౌతికదూరం పాటించడం. మరొకటి మాస్కుల వినియోగం. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ రెండూ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని నిపుణులు చెప్పారు. మాస్కులు, కరోనా వైరస్ కణాల బారి నుంచి కాపాడతాయని అందరూ నమ్ముతున్నారు. అందుకే రకరకాల మాస్కులు వాడుతున్నారు. మరీ ముఖ్యంగా ఎన్-95 మాస్క్ అయితే ఫుల్ సేఫ్టీ అని, కరోనా ఎంత ట్రై చేసినా ముక్కు, నోట్లోకి దూరలేదని డాక్టర్లు ప్రచారం చేయడంతో అందరూ వాటినే వినియోగిస్తున్నారు. అంతేకాదు కవాటం ఉన్న కారణంగా గాలి పీల్చుకోవడం చాలా తేలిక అవుతుందని, ఆక్సిజన్ బాగా అందుతుందని కంపెనీలు చెప్పాయి. దీంతో అంతా ఎన్-95 మాస్కులను వినియోగిస్తున్నారు. ఇక కరోనా భయం లేదని మాస్కు మీద చెయ్యి వేసుకుని ధీగామా ఉన్నారు. ఈ క్రమంలో ఎన్-95 మాస్కు గురించి ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల డైరెక్టర్‌ జనరల్‌.

A Certain Type of N95 Mask May Do More Harm Than Good

వాల్డ్వ్ మాస్కులు కరోనాను అడ్డుకోలేవు:
మీరు వాడే ఎన్‌-95 మాస్కులకు ఒకవైపు మూతలాంటి ఏర్పాటు(వాల్వ్ రెస్పిరేటర్‌) ఉందా? అయితే తస్మాత్‌ జాగ్రత్త. అవి ఆరోగ్యానికి ప్రమాదకరమే కాక, కరోనా వ్యాప్తిని అడ్డుకోలేవని, వాటి వల్ల కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్ఎస్) తాజాగా తేల్చి చెప్పింది. ఆ తరహా మాస్కులను వాడొద్దంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్యాధికారులకు లేఖ రాసింది. వాటిని చాలామంది దుర్వినియోగపరుస్తున్నారని స్పష్టం చేసింది. సాధారణ మాస్కులు లేదా ఇంట్లో తయారు చేసినవో లేక ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో లభిస్తున్న మాస్కులో ధరిస్తే మంచిదని సూచించింది.

The Ban on Respirator Mask Valves - PK Safety Supply

నోరు, ముక్కు పూర్తిగా మూసేసే మాస్కులను మాత్రమే వినియోగించాలి:
వాల్వ్ కల్గిన ఎన్-95 మాస్కులతో ఉపయోగం లేదని డీజీహెచ్ఎస్ స్పష్టంగా చెప్పింది. వ్యక్తి నోటి నుంచి బయటకు విడుదలయ్యే వైరస్‌ను అవి ఆపలేవన్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యలకు ఇదొక అవరోధం అన్నారు. నోరు, ముక్కు పూర్తిగా మూసేసే మాస్కులను మాత్రమే వినియోగించాలని వెల్లడించారు. ఆ దిశగా అన్ని విభాగాలకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. కాగా, కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపించే అవకాశాలున్నాయనే వాదనలను పూర్తిగా కొట్టిపారేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గాలి ద్వారా కరోనా వైరస్‌ వ్యాపిస్తుందని ఇప్పటివరకు ఎన్నో అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా, కొట్టిపారేస్తూ వచ్చిన డబ్ల్యూహెచ్‌ఓ తాజాగా తన స్వరం మార్చింది. జనం రద్దీ ఉన్న ప్రాంతాల్లో, గాలి వెలుతురు లేని ప్రదేశాల్లో, ఇరుగ్గా ఉండే గదుల్లో గాలి ద్వారా వైరస్‌ వ్యాపించదని కచ్చితంగా చెప్పలేమని అంది.

COVID-19 Investigation: The Indian Market Is Flooded with Fake N95 ...

వాల్వ్‌ ఎన్-95 మాస్కులు ఎందుకు ప్రమాదం అంటే:
కవాటం ఉన్న ఎన్-95 మాస్కులతో ప్రయోజనం లేదని, అవి కరోనా వ్యాప్తిని అడ్డుకోలేవని కేంద్రం చెప్పడానికి కారణాలు లేకపోలేదు. వాల్వ్డ్ మాస్కులు బయటి నుంచి వచ్చే గాలిని శుద్ధి చేస్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, బ్రీట్ ఔట్ చేసినప్పుడు ఆ వాల్వుల నుంచి గాలి ఫోర్స్ గా బయటకు వెళ్తుంది. ఆ గాలిని వాల్వులు శుద్ధి చేయలేవు. కరోనా రోగులు ఎవరైనా ఇలాంటి వాల్వులు ఉన్న మాస్కులు ధరించి బయటకు వస్తే శ్వాస వదిలినప్పుడు కరోనా కణాలు గాలిలో కలిసే అవకాశం ఉంది. దాంతో చుట్టు పక్కల ఉన్న వ్యక్తులకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉంది. అంతేకాదు, వాల్వ్ ఉన్న N95 మాస్కులను వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే… వాల్వ్‌కి ఏ చిన్నపాటి కన్నం ఉన్నా అందులోంచి కరోనా వైరస్ నోట్లోకీ, ముక్కులోకీ వచ్చే ప్రమాదం ఉంది.

అసలు వాల్వ్ ఉండే మాస్కులు… వైరస్‌లను అడ్డుకోవడానికి తయారుచేసినవి కావు. పరిశ్రమలలో కాలుష్యం ఉండే ప్రాంతాల్లో పనిచేసేవాళ్లు ఇలాంటి మాస్కులు వాడతారు. ఈ వాల్వ్ ఏం చేస్తుందంటే… మనిషి పీల్చే గాలిని ఫిల్టర్ చేసి… మంచి ఆక్సిజన్‌ను ముక్కుకు అందిస్తుంది. అలాగే… మనం విడిచే గాలిని… ఈ వాల్వ్ బయటకు వదిలేస్తుంది. అందుకు ఇలాంటి మాస్కులు ఉపయోగపడతాయే తప్ప… ఇవి కరోనా వైరస్‌ని ఆపలేవంటున్నారు నిపుణులు.

ఎన్-95 మాస్కులపై మళ్లీ చర్చ:
వాల్వ్ ఉన్న ఎన్-95 మాస్కుతో ఎలాంటి ప్రయోజనం లేదని, అది కరోనాను అడ్డుకోలేదని, వాటిని వాడొద్దని అధికారులు చేసిన హెచ్చరిక సంచలనంగా మారింది. ఇప్పటికే మాస్కుల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఏది మంచిదో ఏది కాదో తెలియక జనాలు పరేషాన్ అవుతున్నారు. ఎన్-95 మాస్కు అయితే చాలా సేఫ్ అని ఇప్పటివరకు నమ్ముతూ వచ్చారు. మార్కెట్ లో వాటి ధర ఎక్కువ. రూ.150 నుంచి 1000 వరకు పలుకుతున్నాయి. అయినా ఆరోగ్యం కోసం వాటినే కొంటున్నారు. వాటిని ధరించి హమ్మయ్య అని రిలాక్స్ అవుతున్నారు. ఇప్పుడు సడెన్ గా కేంద్రం చేసిన ప్రకటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది.