పబ్లిక్‌లో మాస్క్ లేకుండా కనిపిస్తే.. ఇకపై జైలుకే..!

  • Published By: sreehari ,Published On : November 28, 2020 / 07:20 PM IST
పబ్లిక్‌లో మాస్క్ లేకుండా కనిపిస్తే.. ఇకపై జైలుకే..!

Police arrest COVID protocol violators not wearing mask : కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ చాలాచోట్ల మాస్క్ లేకుండా పబ్లిక్ ప్లేసుల్లో తిరుగుతున్నారు. కరోనాకు మందు ఎలాగో లేదు..



కనీసం మాస్క్ ధరించి అయినా కరోనా వ్యాప్తిని నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తుంటే.. కోవిడ్ ప్రొటోకాల్స్ నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు.

ఇక ఇలా అయితే లాభం లేదనుకుంది హిమాచల్ ప్రభుత్వం.. కోవిడ్ ప్రొటోకాల్ ఉల్లంఘించినవారిపై కఠిన ఆంక్షలు విధించాలని భావిస్తోంది.



అందులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించకుండా కనిపిస్తే జైల్లో పెడతామంటోంది. పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్ లేకుండా కనిపించినవారిని
వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.



బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మాస్క్‌ లేకుండా కనబడితే.. వారెంట్‌తో లేకుండానే అరెస్ట్‌ చేసి జైల్లో పెడతామని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.



నేరం రుజువైతే.. 8 రోజుల జైలు శిక్షతోపాటు రూ. 5 వేల రూపాయల జరిమానా కూడా విధిస్తామన్నారు.