Hyderabad : ప్రజల ఆరోగ్యం కోసం ‘పంచతత్వ’ పార్కులు

  • Published By: nagamani ,Published On : November 16, 2020 / 03:55 PM IST
Hyderabad : ప్రజల ఆరోగ్యం కోసం ‘పంచతత్వ’ పార్కులు

Hyderabad panchatatva parks : నగరాల్లో జీవించే మనిషికి ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగుల జీవితమే. కాలంతో పాటు పరుగెత్తాలి. క్షణం తీరిక ఉండదు. ఇక ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? కానీ ఏ మనిషినా సరే ఒత్తిడిని మోసుకుంటూ తిరిగితే తొందరగా పైకెళ్లిపోవటం ఖాయం. ఒత్తిడిని తగ్గించుకోవాలి..ప్రశాంతంగా ఉండాలి. మరి నగరంలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి కాంక్రీటు జంగిల్ లో బతికే మనిషికి ‘అబ్బా ఇక్కడ ఎంత హాయిగా ఉంది..ప్రశాంతంగా పది నిమిషాలు కూర్చుకుందాం’’అని ఎక్కడ అనిపిస్తుంది? అంటే మనసుంటే మార్గం ఉండదా? అన్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం వారి ఆరోగ్యం కోసం ‘‘పంచతత్వ’’పార్కుల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.



ఉరుకుల పరుగుల జీవితంతో అలసిపోయే నగరవాసుల్లో ఒత్తిడిని దూరం చూసి, ఆరోగ్యాన్ని అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ‘‘పంచతత్వ’’ పార్కులను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటగా దోమలగూడలోని ఇందిరాపార్కులో రూ.16 లక్షలతో నిర్మించిన ఈ పార్కులో ఆక్యుప్రెజర్‌ వాకింగ్‌ ట్రాక్‌ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. నగరవ్యాప్తంగా మరో 16 పంచతత్వ పార్కులు ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.



‘పంచతత్వ’ పార్క్ ప్రత్యేకతలు..
‘పంచతత్వ’. స్వచ్ఛమైన గాలికి కేరాఫ్‌ అడ్రస్‌. ఒత్తిడిని మాయం చేసి..ఆయుష్షు పెంచే అమృతంగా పనిచేసే సంజీవని పంచతత్వ పార్కు. ఉల్లాసపరిచే స్నేహాలయం. తెలంగాణలో మొదటిసారిగా పంచతత్వ ఆక్యూప్రెజర్‌ పార్కు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రజలకు ఆరోగ్యాన్ని కలిగించి హాయిని కలిగించే లక్ష్యంగా ప్రభుత్వం అనేక ప్రత్యేకతలతో నిర్మించిన ఈ పంచతత్వ పార్కు ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది.



రకరకాల చెట్లు, ఔషధ మొక్కల నుంచి వెలువడే పరమళాలు, కంకర రాళ్లు, చెట్ల బెరడు, ఇసుక, నల్లరేగడి మట్టి, రివర్‌స్టోన్స్‌, నీళ్ల అనుసంధానంతో వాకింగ్‌ ట్రాక్‌ను నిర్మాణం కనువిందు చేస్తోంది. మధ్యలో ఏర్పాటు చేసిన బుద్ధుడి విగ్రహం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చేతులెత్తి మొక్కాలనిపించేలా చూడముచ్చటగా ఉంది. రాశివనం, నవగ్రహాలు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి.



ఆసియాలోనే పెద్ద పార్క్ ఇందిరా పార్క్..
మొత్తం 67 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇందిరాపార్కు అంటే హైదరాబాద్ లో తెలియనివారు ఉండరు. ఇందిరా పార్కులో ఎకరం విస్తీర్ణంలో పంచతత్వను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నవగ్రహ వనం, రాశివనం, హెర్బల్‌ గార్డెన్‌, 2 వాటర్‌ కాన్‌స్కెడ్స్‌ను ఏర్పాటు చేశారు.



పంచతత్వతో ప్రయోజనాలు..
ఈ ట్రాకుపై చెప్పులు..షూలు వంటివి లేకుండా వట్టి కాళ్లతోనే నడవాలి.
పాదానికి తగిలే స్పర్శతో శరీరంలో పాజిటివ్‌ వైబ్స్‌ ఏర్పడుతాయి.
దీని వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది..
డయాబెటిస్‌ను కంట్రోల్‌ అవుతుంది..
నిద్రలేమిని దూరం చేస్తుంది…హాయినిచ్చే సుఖ నిద్ర కలుగుతుంది..
ఈ ట్రాకుపై వాకింగ్ చేస్తే నాడి వ్యవస్థను బలోపేతమవుతుంది..
శరీరానికి నూతనోత్తేజం కలుగుతుంది..
రుతుచక్రం సజావుగా సాగేలా చక్కగా ఉపయోగపడుతుంది..
హార్మోన్లను ఉత్తేజితం..శరీరంలోని వేడిని తగ్గిస్తుంది…
గుండె సంబంధిత పనితీరును మెరుగుపరుస్తుంది.
బీపీ తగ్గుతుంది…ఆలోచన శక్తిని పెరుగుతుంది..
ఒత్తిడిని తగ్గిస్తుంది…తద్వారా ప్రశాంతత కలుగుతుంది..
ప్రశాతత లభించటంతో తలనొప్పి రాదు..
టెన్షన్ ఫ్రీ అయితే థైరాయిడ్‌ సమస్యలు దరి చేరవు..