అమెరికా, చైనా తప్ప.. గ్లోబల్ వ్యాక్సిన్ ప్లాన్‌లో చేరిన 150కు పైగా దేశాలు

  • Published By: sreehari ,Published On : September 22, 2020 / 05:55 PM IST
అమెరికా, చైనా తప్ప.. గ్లోబల్ వ్యాక్సిన్ ప్లాన్‌లో చేరిన 150కు పైగా దేశాలు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకమయ్యాయి.. అందులో అగ్రరాజ్యం అమెరికా, కరోనా అంటించిన డ్రాగన్ చైనా మాత్రం ముందుకు రాలేదు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నేతృత్వంలోని ఈ గ్లోబల్ స్కీమ్‌లో దాదాపు 150కి పైగా దేశాలు చేరాయి.



భవిష్యత్తులో కరోనా వ్యాక్సిన్ల పంపిణీకి సంబంధించి పారదర్శకత కోసం ఈ గ్లోబల్ వ్యాక్సినేషన్ స్కీమ్ ను ఏర్పాటు చేసింది WHO. కానీ, ఈ ఒప్పందానికి సూపర్ పవర్ చైనా, యూనైటెడ్ స్టేట్స్ మాత్రం అంగీకరించలేదు.

ఇదివరకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా భవిష్యత్తులో వ్యాక్సిన్ల పంపిణీకి ముందే సెక్యూర్ చేసుకుంది.

ఈ విషయంలో స్వార్థంతో పేద దేశాలను పెద్దగా పట్టించుకోలేదు అగ్రరాజ్యం.. 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల వ్యాక్సిన్ డోస్ లను పంపిణీ చేసేందుకు COVAX ప్లాన్ తీసుకొచ్చింది WHO సంస్థ.



ఈ ప్లాన్‌ జాబితాలో మొత్తం 64 ధనిక దేశాలు చేరగా.. కరోనాకు కారణమైన డ్రాగన్ మాత్రం అందుకు ముందుకు రాలేదు.

కానీ, ఈ విషయంలో బీజింగ్‌తో చర్చలు జరుగుతున్నాయని సంబంధింత అధికారి ఒకరు వెల్లడించారు. WHO, GAVI వ్యాక్సిన్ కూటమిలో భాగంగా ప్రపంచ జనాభాలో మూడో వంతుగా ఈ స్కీమ్‌ ద్వారా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని భావిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా 31 మిలియన్ల మందికి కరోనా వైరస్ సోకగా.. దాదాపు 1 మిలియన్ మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఐదో వంతు మరణాలు అమెరికాలోనే ఎక్కువగా నమోదయ్యాయి.



ఇప్పటికే కరోనా నిర్మూలన కోసం డజన్ల కొద్ది కరోనా వ్యాక్సిన్లు టెస్టింగ్ దశలో కొనసాగుతున్నాయి. ఈ వ్యాక్సిన్ కూటమిలో రానున్న ప్రారంభ రోజుల్లో మరో 38 ధనిక దేశాలు చేరే అవకాశం ఉంది. ఇప్పటికే వ్యాక్సిన్ రీసెర్చ్, అభివృద్ధి కోసం 1.4 బిలియన డాలర్ల మేర నిధులు అందాయి.

కానీ, అత్యవసరంగా మరో 700 మిలియన్ డాలర్ల నుంచి 800 మిలియన్ డాలర్ల వరకు అవసరమ ఉందని WHO అభిప్రాయపడింది. ఈ కూటమిలో ఏయే దేశాలు నిధులను సమకూరుస్తున్నాయో వెల్లడించలేదు.



యూరోపియన్ జాయింట్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్ ద్వారా మాత్రమే వ్యాక్సిన్ల పంపిణీ చేస్తామని ఫ్రాన్స్, జర్మనీ పేర్కొన్నాయి.

150కు పైగా పొటెన్షియల్ వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా టెస్టింగ్ పూర్తి అయింది.. మరో 38 వ్యాక్సిన్లు హ్యుమన్ ట్రయల్స్ దశలో ఉన్నాయి.