కరోనా వ్యాక్సిన్ రేసులో యూకేలో మరిన్ని క్లినికల్ ట్రయల్స్

  • Published By: sreehari ,Published On : November 16, 2020 / 08:55 AM IST
కరోనా వ్యాక్సిన్ రేసులో యూకేలో మరిన్ని క్లినికల్ ట్రయల్స్

UK clinical trials COVID-19 vaccine : యూకేలో గ్లోబల్ ఫార్మా కంపెనీ జాన్సెన్ సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను కనిపెట్టే రేసులో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించబోతోంది. దేశ వ్యాప్తంగా 6,000 వాలంటీర్లు ఈ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొననున్నారు.



17వ నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఫర్ హెల్త్ రీసెర్చ్ (NIHR)తో పాటు సౌంతాప్టన్, బ్రిస్టల్, కార్డిఫ్, లండన్, లెచిస్టర్, షెఫీల్డ్, మాంచెస్టర్, డుండె, బెల్ ఫాస్ట్ ప్రాంతాల్లోనూ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు.

యూకేలో క్లినికల్ ట్రయల్స్ లోకి అడుగుపెట్టబోతున్న మూడో వ్యాక్సిన్ ఇది. మరోవైపు అమెరికా బయోటెక్ కంపెనీ నోవాక్స్, యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్/ఆస్ట్రాజెనికా కూడా కరోనా వ్యాక్సిన్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి.



ఫైజర్, బయోంటెక్ తమ వ్యాక్సిన్ ట్రయల్స్ ఫలితాల్లో 90 శాతానికి పైగా సమర్థతవంతగా పనిచేయగలదని ప్రకటించాయి. వారం తర్వాత యూకేలోని గ్లోబల్ ఫార్మా జాన్సెన్ కూడా మూడో దశ ట్రయల్స్ లోకి అడుగుపెడుతోంది.



https://10tv.in/dozens-to-be-deliberately-infected-with-coronavirus-in-uk-human-challenge-trials/
Janssen వ్యాక్సిన్ కూడా Oxford/Astra Zeneca వ్యాక్సిన్ మాదిరిగానే ఉంటుందని ప్రొఫెసర్, క్లినికల్ రీసెర్చ్ ఫెసిలిటీ అండ్ చీఫ్ ఇన్వెస్టిగేటర్, డైరెక్టర్ సౌల్ ఫాస్ట్ తెలిపారు. శరీర రోగనిరోధక శక్తిని స్పైక్ ప్రోటీన్ చూపిస్తుందని అన్నారు. అన్ని కంపెనీలు స్పైక్ ప్రోటీన్‌కు వ్యతిరేకంగా టీకాలు తయారు చేస్తున్నాయి.



అందువల్ల టీకాలు అన్నింటికన్నా ఎక్కువ లేదా తక్కువ స్థాయిలో పనిచేస్తాయని భావిస్తున్నారు. వేర్వేరు కంపెనీల నుంచి అనేక రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉండట చాలా ముఖ్యమన్నారు. ఎందుకంటే మన దగ్గర ఒక టీకా అన్ని వయసులవారిలో లేదా అన్ని జనాభాలో పనిచేస్తుందో లేదో తెలియదన్నారు.

కరోనావైరస్ వ్యాక్సిన్ అధ్యయనాలలో పాల్గొనడానికి 3లక్షల మంది ప్రజలు NHS వ్యాక్సిన్స్ రిజిస్ట్రీకి సంతకం చేశారు. NHS వ్యాక్సిన్ నమోదు ప్రక్రియలో కరోనావైరస్ ప్రభావాలకు గురయ్యే వాలంటీర్లు అవసరమన్నారు. ఫ్రంట్‌లైన్ హెల్త్ అండ్ సోషల్ కేర్ వర్కర్స్, బ్లాక్, ఆసియన్, జాతి మైనారిటీ ప్రజలు ఉన్నారు.