నీ పుట్టినరోజు నాడు ఎన్నో లక్షల కుటుంబాలకు సంతోషం విస్తరించింది తమ్ముడు..నాగబాబు స్పెషల్ విషెస్

  • Published By: sekhar ,Published On : September 2, 2020 / 05:42 PM IST
నీ పుట్టినరోజు నాడు ఎన్నో లక్షల కుటుంబాలకు సంతోషం విస్తరించింది తమ్ముడు..నాగబాబు స్పెషల్ విషెస్

HBDPawanKalyan: బుధవారం (సెప్టెంబర్ 2) పవర్స్టార్ పవన్కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు అందజేస్తున్నారు.

అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ప్రోత్సాహంతో సినీ రంగప్రవేశం చేసి తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకుని పవర్‌స్టార్‌గా ఎదిగారు పవన్‌ కళ్యాణ్. ఈ రోజు (బుధవారం-సెప్టెంబర్ 2) ఆయన జన్మదినోత్సవం. ఈ సందర్భంగా పవన్ సోదరుడు, మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ ద్వారా తన తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

‘‘నువ్వు జన్మించిన రోజు నాకు ఇంకా గుర్తుంది. నువ్వు మా ఇంటిని సంతోషంతో నింపేశావు. ఇప్పుడు నీ పుట్టినరోజునాడు ఆ సంతోషం ఎన్నో లక్షల కుటుంబాలకు విస్తరించింది. హ్యాపీ బర్త్‌డే తమ్ముడు’’ అంటూ తమ్ముడితో కలిసి ఉన్న ఫొటో షేర్ చేశారు నాగబాబు.