Rhea Chakraborty Drug Link: రియా సోదరుడికి డ్రగ్ డీలర్స్‌తో సంబంధాలు, అరెస్ట్

  • Published By: madhu ,Published On : September 4, 2020 / 11:56 AM IST
Rhea Chakraborty Drug Link: రియా సోదరుడికి డ్రగ్ డీలర్స్‌తో సంబంధాలు, అరెస్ట్

Sushant Singh Rajput death case: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డ్రగ్స్ కోణం బయటపడడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. రియా సోదరుడు షోవిక్‌తో పాటు సుశాంత్ మేనేజర్ మిరాండాలను అధికారులు ఎన్సీబీ కార్యాలయంలో విడివిడిగా విచారిస్తున్నారు.



2020, సెప్టెంబర్ 04వ తేదీ శుక్రవారం ఉదయం రియా, మిరాండా నివాసాల్లో తనిఖీలు చేపట్టిన ఎన్సీబీ బృందాలు పలు కీలక వివరాలను సేకరించినట్లుగా తెలుస్తోంది. సుశాంత్ మృతి వెనుక బాలీవుడ్ డ్రగ్స్ మాఫియా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే వివరాలను సేకరిస్తున్నారు.

మరోవైపు…సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి ఇంట్లో NCB అధికారులు సోదాలు చేపట్టారు. ఆమెతో పాటు సుశాంత్ మాజీ మేనేజర్ మిరాండా నివాసంలోనూ ముంబై పోలీసులు, NCB బృందం తనిఖీలు చేస్తోంది. సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్‌ కోణం బయటపడడంతో ఆ దిశగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.



రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, మిరాండాలు డ్రగ్స్‌ డీలర్‌తో చాటింగ్‌ చేసినట్లు ఆధారాలు లభించడంతో.. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

రియా జుహు నివాసంలో రెండు నార్కోటిక్స్ బృందాలు తనిఖీ చేస్తుండగా.. ముగ్గురు ముంబై పోలీసులతో పాటు నలుగురు NCB అధికారులు మిరాండా నివాసంలో సోదాలు నిర్వహిస్తోంది. వీరికి డ్రగ్‌ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు సీబీఐ కూడా సుశాంత్ కేసులో దూకుడు పెంచింది. రియాతో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా విచారించి కీలక వివరాలు సేకరించింది.



దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరో సుశాంత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. హీరో మృతికి ప్రధాన కారణం బాలీవుడ్ డ్రగ్స్ మాఫియా అంటూ ఇటీవల పలువురు ఆరోపణలు చేశారు. దీనిపై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ బృందం ఆ దిశగా దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే రియా చక్రవర్తితో పాటు పలువురిపై కేసు నమోదు చేసిన NCB.. రియా, సుశాంత్ మాజీ మేనేజర్ మిరాండా నివాసాల్లో తనిఖీలు జరుపుతోంది.
https://10tv.in/sushant-singh-rajput-case-rhea-chakrabortys-father-indrajeet-chakraborty-summoned-again-by-the-enforcement-directorate/
బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ కేసుకు సంబంధించి సీబీఐ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుకు సంబంధించి మీడియాకు ఎలాంటి వివరాలు ఇవ్వలేదని, సీబీఐ పేరుతో మీడియాలో వస్తున్న వార్తలు సరైనవి కావని స్పష్టం చేసింది. మరోవైపు.. రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్‌ను సీబీఐ విచారించింది. వరుణ్‌ మాధుర్‌, రిషబ్‌ టక్కర్‌కు ఈడీ నోటీసులు పంపింది.



సుశాంత్‌ మేనేజర్‌ దిశ ఆత్మహత్యపై కూడా దర్యాప్తు జరపనున్నారు. మాదకద్రవ్యాల డీలరుతో రియా చక్రవర్తి జరిపిన చాటింగ్ బండారం బయటపడటంతో ఈ కేసులో మాదకద్రవ్యాల కుట్ర కూడా ఉందనే అనుమానం వ్యక్తమయింది.దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇప్పటికే డ్రగ్ డీలర్ జైద్ విలాత్రాను అదుపులోకి తీసుకుంది. అతనికి ఈనెల 9వరకూ కోర్టు రిమాండ్ విధించింది.