అమెరికాలో రాకాసి దోమల దాడి..వందలాది జంతువులు బలి..

  • Published By: nagamani ,Published On : September 14, 2020 / 11:50 AM IST
అమెరికాలో రాకాసి దోమల దాడి..వందలాది జంతువులు బలి..

కరోనా సంక్షోభంలో వివిధ కర్మాగారాల్లో వరుస అగ్నిప్రమాదాలు, మిడతల దండు, భారీ వర్షాలు తదితర అనుకోని విపత్తులు దేశవ్యాప్తంగా ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేశాయి. ఇలాంటి ఓ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో వందలాది జంతువులపై రాకాసి దోమలు దాడి చేశాయి. రక్తం పీల్చి వందలాది జంతువులను చంపేశాయి. ఈ దారుణ ఘటన అమెరికాను ఉలికిపాటుకు గురిచేసింది. రాకాసి దోమల గుంపులుగా దాడికి తెగబడ్డాయి. వందల సంఖ్యలో పాడి జంతువుల్ని..అడవి వన్య ప్రాణుల్ని బలి తీసుకున్నాయి. అమెరికాలోని లూసియానాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


గత ఆగస్టు 27న హరికేన్‌ లారా కారణంగా పెద్ద సంఖ్యలో రాకాసి దోమలు లూసియానాలోకి దోమలు గుంపులు గుంపులుగా వచ్చిపడ్డాయి. అక్కడి గేదెలు, ఆవులు, గుర్రాలు, జింకలను కుట్టి కుట్టి చంపేశాయి. వాటి రక్తాన్ని జుర్రుకుని ఉసురు తీశాయి. ఈ దోమల దాడిలో 400లకుపైగా పాడి పశువులు, 30 వరకు జింకలు మృత్యువాత పడ్డాయి. దీంతో ఆయా జంతువుల యజమానులు లబోదిబోమంటున్నారు. అసలే కరోనా కాలంలో ఏదో పాలు అమ్ముకుని జీవిస్తున్నాం…ఇంతలోనే దోమలకాటుకు మా పాడి పశువులు చనిపోటంతో దిక్కుతోచకుండా అయిపోయామని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ ఘటనతో లక్ష డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు.



https://10tv.in/covid-19-twice-as-likely-to-have-eaten-at-restaurants-cdc-study/
ఈ దారుణ ఘటనతో హెలికాఫ్టర్ల సహా రంగంలోకి సహాయక బృందాలు దిగాయి..దోమల మందు పిచికారీ చేశాయి. దీంతో కొంతలో కొంత దోమలు తగ్గాయి. కానీ పూర్తిగా వాటి సమస్య తీరలేదు. సెప్టెంబర్‌ 2న ఓ వ్యక్తి తీసిన ఫోటో ఒకటి రాకాసి దోమల రక్త దాహానికి అద్దం పడుతోంది. ఆ ఫోటోలో చనిపోయిన ఎద్దు పొట్ట చుట్టూ చేరిన భారీ దోమల గుంపు దాని రక్తం పీలుస్తున్నాయి.


ఆగస్టు 27 న తుఫాను సంభవించిన ప్రదేశంలో 300 నుండి 400 పశువులు దోమకాటుకు చనిపోయాయని విల్లె ప్లాట్టేలో ఉన్న సీనియర్ పశువుల డాక్టర్ క్రెయిగ్ ఫోంటెనోట్ తెలిపారు. పాడి పశువులే కాకుండా మేకలు..గొర్రెలు..జింకలు..గుర్రాలు వంటి పలు జంతువులు చనిపోయాని తెలిపారు.