We miss you India: టిక్‌టాక్ ఎమోషనల్ ట్వీట్..

  • Published By: vamsi ,Published On : November 15, 2020 / 08:19 AM IST
We miss you India: టిక్‌టాక్ ఎమోషనల్ ట్వీట్..

We miss you India: భారతదేశంలో నిషేధానికి గురైన తర్వాత చైనీస్ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్.. భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఆ సంస్థ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ టిక్ టాక్‌పై నిషేధం కారణంగా వేల కోట్లు నష్టపోయింది. డేటా సెక్యురిటీ కారణాలతో.. షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ మళ్లీ రిటర్న్ అయ్యేందుకు చర్చలు ఊపందుకోగా.. త్వరలో కంపెనీ తిరిగి రాగలదని చెబుతున్నారు. అయితే, దీని గురించి ఇంకా ఏమీ స్పష్టత రాలేదు.



ఇదిలావుండగా, దీపావళి సందర్భంగా టిక్‌టాక్ తన ఫాలోవర్స్‌ను పలకరిస్తూ టిక్-టాక్ ఇండియా శనివారం సెంటిమెంట్ ట్వీట్ చేసింది. ఇందులో కంపెనీ తన వినియోగదారుల పట్ల తన ప్రేమను వ్యక్తం చేసింది. భారత్‌లో టిక్‌టాక్ యాప్ నిషేధించి నెలలు దాటినా కూడా సంస్థ ఇప్పటికీ ట్విట్టర్‌లో చాలా చురుకుగా ఉంది. ప్రతిరోజూ చాలా మందికి ట్వీట్ చేయడం ద్వారా టచ్‌లో ఉంటుంది.



దీపావళి సందర్భంగా, టిక్‌టాక్ ఎమోషనల్ ట్వీట్‌లో.. “మేం భారత్‌ను చాలా మిస్ అవుతున్నాము, గుర్తు చేసుకున్న ప్రతి రోజూ ఒక దీపం వెలిగిస్తున్నాము” అంటూ ట్వీట్ చేశారు. దీనితో పాటు అనేక దీపాలను కూడా ట్వీట్‌లో పెట్టారు. జాతీయ భద్రతను పేర్కొంటూ టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం జూన్ 29న నిషేధించింది. టిక్‌టాక్ నిషేధించబడటానికి ముందు భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన షార్ట్ వీడియో యాప్.



ఈ యాప్ తిరిగి భారతదేశానికి వచ్చే అవకాశం కూడా ఉంది. మనదేశంలో ఈ ఏడాదిలోనే నిషేధం కాకముందు టిక్‌టాక్ 61.1 కోట్ల సార్లు డౌన్ లోడ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అయిన డౌన్ లోడ్లలో అది 30.3 శాతం. 2019లో అయిన డౌన్ లోడ్లకు ఇది రెట్టింపు.