2020 US election results: భారతీయులు బైడెన్‌కే.. మినీ ఇండియాలో ముందంజ

  • Published By: vamsi ,Published On : November 4, 2020 / 06:56 PM IST
2020 US election results: భారతీయులు బైడెన్‌కే.. మినీ ఇండియాలో ముందంజ

అమెరికా ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అమెరికా మీడియా అంచనాల ప్రకారం, ఇప్పటివరకు బయటకు వచ్చిన ఫలితాల్లో మెజారిటీ స్థానాల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ ముందంజలో ఉండగా.. బైడెన్‌కు 238 ఎలక్టోరల్‌ ఓట్లు రాగా అధ్యక్షుడు ట్రంప్‌నకు 213 ఎలక్టోరల్‌ ఓట్లు పోలయ్యాయి. స్వింగ్‌ స్టేట్స్‌గా పిలిచే కీలక రాష్ట్రాల్లో పోరు హోరాహోరీగా సాగుతోంది.



అయితే అమెరికా రాష్ట్రంలో మినీ భారత్‌గా పిలిచే రాష్ట్రం న్యూజెర్సీ. ఈ రాష్ట్రంలో అత్యధికంగా భారతీయులు ఉంటారు. ఈ రాష్ట్రాన్ని అందుకే ‘లిటిల్‌ ఇండియా’ అని పిలుస్తూ ఉంటారు అమెరికన్లు. ఈసారి న్యూజెర్సీ అంతటా ముమ్మరంగా పోలింగ్‌ సాగగా.. భారతీయ అమెరికన్‌ ఓటర్లంతా ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పార్టిసిపేట్ చేశారు.



జో బైడెన్, కమలా హారిస్‌కే ఇక్కడి ప్రజలు ఎక్కువగా ఓట్లు వేసినట్లుగా ఓటర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలో 61శాతం ఓట్లు బైడెన్ కైవసం చేసుకోగా.. 38శాతం ఓట్లు ట్రంప్‌కు పడ్డాయి.



ఇక మరోవైపు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో బైడెన్ క్లీన్‌స్వీప్ చేశాడు. అక్కడ బైడెన్‌కు 93 శాతం పాపులర్‌ ఓట్లు రాగా, ట్రంప్‌కు కేవలం 5.6 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.