ప్రీక్వాలిఫికేషన్ లిస్టు నుంచి remdesivir తొలగించిన WHO

  • Published By: sreehari ,Published On : November 21, 2020 / 06:58 AM IST
ప్రీక్వాలిఫికేషన్ లిస్టు నుంచి remdesivir తొలగించిన WHO

WHO-remdesivir : ప్రముఖ ఫార్మా కంపెనీ గిలాడ్ అభివృద్ధి చేసిన remdesivir మలేరియా డ్రగ్‌ను ప్రీక్వాలిఫికేషన్ డ్రగ్ లిస్టు నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తొలగించింది. ఆస్పత్రిలో చేరిన కరోనా బాధితులకు Remdesivir డ్రగ్ వాడేలా గైడ్ లైన్స్ జారీ చేసిన అనంతరం WHO ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.



అభివృద్ధి చెందుతున్న దేశాల సేకరణకు ఒక ప్రమాణంగా ఉపయోగించే ఔషధాల అధికారిక జాబితా, ప్రీక్వాలిఫికేషన్ జాబితాలో గిలియడ్ Remdesivir డ్రగ్‌‌ను సస్పెండ్ చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.



https://10tv.in/corona-vaccine-should-be-available-for-public-by-april/
remdesivir డ్రగ్‌ను PQ (ప్రీక్వాలిఫికేషన్ లిస్టు) నుంచి తొలగించామని టారిక్ జాసర్వెక్ చెప్పారు. WHO తమ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా ఈ డ్రగ్‌ను సస్పెండ్ చేసింది.



అంతేకాదు.. కరోనా కోసం ఈ డ్రగ్ ను ఏ దేశాలు కూడా సేకరించే వీలు లేకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ దిశగా నిర్ణయాన్ని వెల్లడించింది. తక్కువ మధ్య-ఆదాయ దేశాలకు ఏ అంతర్జాతీయ కొనుగోలుదారులు మందులు అందిస్తున్నారో WHOకు తెలియదని ఆయన అన్నారు.

మలేరియా ట్రీట్‌మెంట్‌కు వాడే రెమెడెసివర్ డ్రగ్ ను కరోనా పేషెంట్లకు వాడొద్దని సూచిస్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇది వాడడం వల్ల రికవరీ టైం కూడా తగ్గిందంట. WHO ద్వారా చేసిన గ్లోబల్ ట్రయల్స్ లో రెమెడెసివర్ కారణంగా మరణాల రేటు మాత్రం తగ్గించడం లేదంట..