ఆ.. ఒక కోటి మందికి ముందుగా తొలి డోస్ కరోనా వ్యాక్సిన్..!

  • Published By: sreehari ,Published On : November 24, 2020 / 05:10 PM IST
ఆ.. ఒక కోటి మందికి ముందుగా తొలి డోస్ కరోనా వ్యాక్సిన్..!

1 crore health workers to get first dose : దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి నిర్వహణపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన నరేంద్ర మోడీ కీలక భేటీ జరుగనుంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఎవరికి వ్యాక్సిన్ ముందుగా అందిస్తున్నారనేదానిపై సర్వత్రా చర్చనీయాంశమైంది.



ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ ముందుగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కరోనా మొదటి మోతాదు టీకాను ముందుగా ఒక కోటి మంది ఆరోగ్య కార్యకర్తలకు ఇచ్చేందుకు ఎంపిక చేయనున్నట్టు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ఏర్పాట్లపై నిపుణుల బృందంలో ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. మొదటి ప్రాధాన్యత పరంగా వ్యాక్సిన్ పొందే ఆరోగ్య కార్యకర్తలకు సంబంధించి డేటాబేస్ కూడా రెడీ అవుతోందని చెప్పారు.



కరోనా వ్యాక్సిన్ వాణిజ్యపరంగా వినియోగానికి భారత రెగ్యులేటరీ విభాగం నుంచి అనుమతి రావాల్సి ఉంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి రాష్ట్రాల నుంచి గణనీయమైన స్పందన వచ్చింది. దేశంలో రాష్ట్రాల వ్యాప్తంగా 92శాతం ప్రభుత్వ ఆస్పత్రులు డేటాను సమర్పించాయి.

56 శాతం ప్రైవేట్ సెక్టార్ ఆస్పత్రులు కూడా డేటాను అందించాయి. టీకా పంపిణీకి అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నాం’ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్లు అందరూ కలిపి మొత్తంగా ఒక కోటి వరకు ఉంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.



హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు సంబంధించి వ్యాక్సిన్ డేటాను క్రియేట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మరోవైపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వ్యాక్సిన్ పంపిణీపై కీలక సమావేశం కానున్నారు.

నీతి అయోగ్ సభ్యులైన వీకే పాల్, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తో కూడిన నిపుణుల బృందం దీనిపై సమగ్ర వివరణ ఇవ్వనున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.



జూలై 2021 నాటికి దాదాపు 20కోట్ల నుంచి 25 కోట్ల మంది ప్రజలకు 400 మిలియన్ డోస్ ల నుంచి 500 మిలియన్ల డోస్ ల వరకు వ్యాక్సిన్ అందించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్లకు సంబంధించి పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కేంద్రానికి డేటాను సమర్పించాయి. అందులో అనేక రంగాలకు చెందిన ఫ్రంట్ లైన్ వర్కర్లు ఉన్నారు.



https://10tv.in/corona-third-wave-danger-for-europe-countries/
అల్లోపథిక్ వైద్యులు, AYUSH వైద్యులు, ఆస్పత్రుల్లో నర్సులు, ASHA వర్కర్లు, ANM నర్సు (మిడ్ వైఫరీ)లకు కూడా మొదటి టీకా మోతాదు అందించనున్నారు. ఈ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, ఫ్యాకల్టీ మెంబర్లు కూడా పాలుపంచుకోనున్నారు.