బ‌ద్ధ‌కిష్టి సూర్య కిరణ్‌ ఔట్ దేవీ పర్‌ఫెక్ట్, తోపు గంగవ్వ, ఊపందుకున్న బిగ్‌బాస్

  • Published By: Suresh Kumar ,Published On : September 13, 2020 / 04:55 PM IST
బ‌ద్ధ‌కిష్టి సూర్య కిరణ్‌ ఔట్ దేవీ పర్‌ఫెక్ట్, తోపు గంగవ్వ, ఊపందుకున్న బిగ్‌బాస్

BIGG BOSS 4 Telugu 7TH DAY: శనివారం అంతా సందడే. అనుకున్నట్లే కింగ్‌ నాగార్జున్‌ చలాకీతనం, అనుభవంతో ఎపిసోడ్‌ లాక్కొచ్చాడు. ఫన్నీ టాస్క్‌ ఇచ్చి ఎంటర్‌టైన్‌తో పాటు ఇంటి సభ్యుల క్యారెక్టర్‌ ఏంటో బయటపడేలా చేశాడు.

రకరకాల బొమ్మలు ఉన్న కొన్ని మెడల్స్‌ ఇచ్చి, ఒక్కో మెడల్‌ ఎవరెవరికి ఇస్తారో రీజన్‌ చెప్పి మెడలో వేయాలని చెప్పారు హోస్ట్‌ నాగార్జున. ఈ టాస్క్‌కి బలి అయింది మాత్రం నైబర్‌ హౌస్‌ నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చిన సోహైల్‌, అరియానా అని చెప్పుకోవాలి.



ఇప్పుడిప్పుడే వీరద్దరినీ కలుపుకోవడానికి రెడీ అవుతోన్న ఇంటి సభ్యులు ఇపుడు వీరిచ్చిన మెడల్స్‌ను ఏవిధంగా తీసుకుంటారోనని సోహెల్, అరియానా భయపడ్డారు.

ఊసరవెళ్లి అని రాసి ఉన్న మెడల్‌ని సుజాతకు ఇచ్చారు సోహెల్‌, అరియానా. అప్పుడే ఏడుస్తుంది.అప్పుడే నవ్వుతుంది. వెంటనే బాధ పడుతుంది అందుకే ఆమెకు ఊసరవెళ్లి మెడల్‌ ఇచ్చామని సోహైల్‌ చెప్పుకొచ్చారు.

ఇక కాకరకాయ మెడల్‌ దివికి, రోమాంటిక్‌ పర్సన్‌ అఖిల్‌కి ఇచ్చారు. అఖిల్‌ చాలా మంచోడని, కేరింగ్‌ కూడా ఎక్కువేనని, అతనంటే ఇష్టమని అరియానా చెప్పింది. దీంతో నాగార్జున మరోసారి అరియానాకి అన్నం తినిపించాలని అఖిల్‌కు స్వీట్‌గా చెప్పారు.

సీరియల్ విలన్‌లా…కళ్యాణి
ఇక ఇంట్లో చిచ్చుపెట్టేది ఎవరంటే ఇద్దరూ కల్యాణిని సూచించారు. ఆమె ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్తారని అందుకే పుల్లలు పెట్టే మెడల్‌ ఆమెకు ఇస్తున్నామని సోహైల్‌ చెప్పాడు.