లక్షణాలే కొంచెమేనని నిర్లక్ష్యం చేయొద్దు.. కరోనా తీవ్రత పెరిగి తెలియకుండా చనిపోతారు.. వైద్యుల హెచ్చరిక!

  • Published By: sreehari ,Published On : July 24, 2020 / 01:37 PM IST
లక్షణాలే కొంచెమేనని నిర్లక్ష్యం చేయొద్దు.. కరోనా తీవ్రత పెరిగి తెలియకుండా చనిపోతారు.. వైద్యుల హెచ్చరిక!

కరోనా వైరస్ రోజురోజుకీ కొత్త లక్షణాలతో మరింత ప్రాణాంతకంగా మారుతోంది. మొదట్లో కంటే ఇప్పుడు కరోనా జన్యుపరంగా మ్యుటేట్ అవుతూ వస్తోంది. కొత్త రకం లక్షణాలతో వైద్యులు సహా పరిశోధకులను గందరగోళానికి గురిచేస్తోంది. మొదట్లో కనిపించిన లక్షణాలతో పాటు కొత్త రకం లక్షణాలు కనిపించడంతో గుర్తించడం కష్టతరంగా మారుతోంది.

కరోనా కొత్త లక్షణాల్లో అవయవాలలో బలహీనత, విరేచనాలు, నోటిలో రుచి లేకపోవడం లేదా వాసన కోల్పోవడం, దద్దుర్లు, మంట, స్వర్శను కోల్పోవడం వంటివి చాలామందిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కరోనావైరస్ వల్ల ఇన్ఫెక్షన్ సోకి లక్షణాలలో గణనీయమైన మార్పులను కారణమైందని వైద్యులు భావిస్తున్నారు. ముక్కు కారటం, వికారం, జ్వరం లేదా చలి, దగ్గు, శ్వాస ఆడకపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, గొంతు నొప్పి వంటివి ఇప్పటివరకూ కరోనా లక్షణాలుగా గుర్తించారు. ఇప్పుడు మరికొన్ని కొత్త లక్షణాలు వచ్చి చేరాయి. ఇందులో దద్దుర్లు, ఒళ్లుంతా మంటగా ఉంటుందట.

కోవిడ్ సోకిన రోగులలో ప్రారంభంలో లేదా రెండు-మూడు వారాల తరువాత ఈ లక్షణాలు బయటపడుతున్నాయంట. కేసులు పెరుగుతున్నందున కొన్ని ప్రారంభ లక్షణాలు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. కొంతమంది రోగులు విరేచనాలతో పాటు రుచి, వాసన కోల్పోతున్నారని తెలిపారు. 15 శాతం నుంచి 20శాతం మంది రోగుల్లో ఈ కొత్త రకం స్వల్ప లక్షణాలు కనిపించాయని వైద్యులు అంటున్నారు.

ఈ నిర్దిష్ట లక్షణాలను 15శాతం కేసులలో గుర్తించామని, వ్యాధి దుష్ప్రభావాలు కాకపోవచ్చునని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GIMS) డైరెక్టర్ బ్రిగేడియర్ రాకేశ్ గుప్తా (రిటైర్డ్) అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఎక్కువ మంది రోగులలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రారంభ లక్షణాలుగా గుర్తించామన్నారు.

అయినప్పటికీ ఇంతకుముందు రోగుల్లో కనిపించలేదని, ఇప్పుడు ఈ కొత్త లక్షణాలను చూస్తున్నట్టు తెలిపారు. కరోనా లక్షణాల్లో ఇంతకుముందు ఫ్లూ లాంటివి ఉంటే.. ఇప్పుడు జీర్ణశయాంతర సమస్యలు కూడా కనిపిస్తున్నాయని గ్రేటర్ నోయిడాలోని కైలాష్ హాస్పిటల్ డైరెక్టర్ దినేష్ శర్మ చెప్పారు.

కరోనా పాత లక్షణాల్లో జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శ్వాస తీసుకోకపోవడం, బలహీనతకు సంబంధించినవే ఉంటాయి. ఇప్పుడు రోగుల్లో విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, నోటిలో రుచిని కోల్పోతున్నామని అంటున్నారు. ఆ తర్వాతే వీరిలో కరోనా పాజిటివ్ అని తేలిందని వైద్యులు తెలిపారు. శరీరంలో దద్దుర్లు, మంటలు వస్తున్నట్టు చెబుతున్నారు.

రెండు లేదా మూడు వారాల తరువాత కోవిడ్ రోగులలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. పిల్లలలో, ఇన్ఫెక్షన్ మల్టీ-సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్‌ను ప్రేరేపిస్తుంది. జీర్ణ సమస్యలు, పొత్తికడుపులో నొప్పి, వాంతులకు కారణమవుతుందని సీనియర్ కన్సల్టెంట్ HOD, ఇంటర్నల్ మెడిసిన్, ఆకాష్ హెల్త్‌కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాకేశ్ పండిట్ అన్నారు.

చాలా మంది రోగుల్లో ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నందున ప్రారంభ లక్షణాలను గుర్తించడం చాలా కష్టంగా మారుతోందని అంటున్నారు. ఏడు రోజులకు పైగా వైరస్ ఉన్న వారిని గుర్తించడం కష్టంగా మారుతోంది. ఇప్పుడు హైపర్నాట్రేమియా ఎక్కువగా కనిపిస్తోంది. డీహైడ్రేషన్ కారణంగా సోడియం స్థాయిలు పెరుగుతాయి. ద్రవాల ద్వారా రీహైడ్రేషన్ రోగులను చికిత్స అందించాల్సి ఉంటుంది. కొంతమందిలో రక్త సాంద్రత, గడ్డకట్టడం పెరుగుతుందని అభిషేక్ దేశ్వాల్ అన్నారు.

స్వైన్ ఫ్లూ వంటి ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల మాదిరిగా కాకుండా కోవిడ్ కాస్తా భిన్నంగా ఉంటుంది. వైరస్ శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుందో చెప్పలేమంటున్నారు. ఆ భాగాన్ని బట్టి సంబంధిత సమస్యలు బయటపడతాయని చెబుతున్నారు.

వైరస్ మెదడును ప్రభావితం చేస్తే.. మూర్ఛలు, నాడీ సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. జీర్ణవ్యవస్థను వైరస్ ప్రభావితం చేస్తే మాత్రం.. జీర్ణశయాంతర సమస్యలు వస్తాయి. ఇవి లక్షణాలు కాదంటున్నారు. వైరస్ వ్యాప్తి వల్ల తలెత్తే సమస్యలు అని ఆరోగ్య సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.