ఫిబ్రవరి సినిమాలు..

ఫిబ్రవరి సినిమాలు..

February Movies: పంజా వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టిని హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. సుకుమార్ రైటింగ్స్ భాగ‌స్వామ్యంతో మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఉప్పెన‌’.. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్ర‌వ‌రి 12న ‘ఉప్పెన’ విడుద‌ల‌వుతోంది.

Uppena

‘అల్లరి’ నరేష్ కొంత గ్యాప్ తర్వాత తన కామెడీ ఇమేజ్‌ని పక్కన పెట్టేసి ‘నాంది’ అనే ఓ ఢిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన నరేష్ పోస్టర్స్, టీజర్ కొత్తదనంతో ఆకట్టుకున్నాయి. విజయ్ కనకమేడలను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఎస్.వి. 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీశ్ వేగేశ్న నిర్మిస్తున్న ‘నాంది’ ఫిబ్రవరి 19న రిలీజ్ కానుంది.

Naandhi

‘మళ్ళీ రావా.. సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం, ఇదంజ‌గ‌త్‌’ సినిమాలతో వరుస విజయాలందుకున్న యంగ్ హీరో సుమంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘‘కపటధారి’’.. గతేడాది కన్నడలో సూపర్ హిట్ అయిన ‘‘కావలుధారి’’ (Kavaludaari) చిత్రానికిది రీమేక్.. విజయ్ ఆంటోని ‘భేతాళుడు’ మూవీతో ఆకట్టుకున్న ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్ట్ చేస్తున్నాడు. క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై తెలుగు, త‌మిళ భాష‌ల్లో డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. శ్వేత నందిత (నందిత శ్వేత) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Kapatadhaari

నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం.. ‘చెక్’.. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ ఫీమేల్ లీడ్స్. ఫిబ్రవరి 26న నితిన్ థియేటర్లలో గేమ్ ఆడనున్నాడు.

CHECK

 

శ్వేత నందిత (నందిత శ్వేత) ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘అక్షర’.. బి. చిన్ని కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మధు నందన్, అజయ్ ఘోష్, షకలక శంకర్, సత్య తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నఈ సినిమా ఫిబ్రవరి 26న రిలీజ్‌కి రెడీ అవుతోంది.

Akshara

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న 25 వ సినిమా ‘ఏ 1 ఎక్స్‌ప్రెస్’.. తెలుగులో హకీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం. లావణ్య త్రిపాఠి కథానాయిక.. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్లపై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 26 నుండి థియేటర్లలో హాకీ ఆట స్టార్ట్ కానుంది.
A 1 Express