చంద్రునిపై జెండాను పాతిన చైనా.. రెండో దేశంగా డ్రాగన్

  • Published By: sreehari ,Published On : December 6, 2020 / 08:15 AM IST
చంద్రునిపై జెండాను పాతిన చైనా.. రెండో దేశంగా డ్రాగన్

China second nation to plant flag on the Moon : చంద్రుడిపై డ్రాగ‌న్ చైనా త‌న జాతీయ జెండాను ఎగుర‌వేసింది. చంద్రని ఉపరితలంపై జెండాను పాతిన ఫోటోల‌ను చైనా రిలీజ్ చేసింది. 50 ఏళ్ల క్రితం అమెరికా తమ జాతీయ జెండాను చంద్రుడిపై పాతింది. చంద్రుడిపై జెండాను నాటిన రెండవ దేశంగా చైనా నిలిచింది. Chang’e-5 అంతరిక్ష పరిశోధనలో భాగంగా ల్యాండ‌ర్‌కు అమర్చిన కెమెరా ద్వారా ఫోటోను తీసింది. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి విడుదలైన ఫొటోలను పరిశీలిస్తే.. గాలిలేని చంద్ర ఉపరితలంపై 5 నక్షత్రాల ఎర్ర జెండాను చూడొచ్చు. చంద్రుడి నేల‌పై ఉన్న మ‌ట్టిని తీసుకువ‌చ్చేందుకు చైనా ఈ మిషన్ చేప‌ట్టింది. చైనా పాతిన జెండా సుమారు 2 మీట‌ర్ల పొడుగు, 90 సెంటీమీట‌ర్ల వెడ‌ల్పు ఉంది.



న‌వంబ‌ర్ 23న లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా Chang’e-5 మిష‌న్‌ను చైనా లాంచ్ చేసింది. Chang’e-5 అంతరిక్ష పరిశోధనలో భాగంగా చంద్రుని నుంచి రాళ్ల నమూనాలతో బయల్దేరే ముందు కెమెరాతో అక్కడి ప్రాంతాన్ని ఫొటోలు తీసింది. గతంలో చైనా రెండు చంద్ర మిషన్లకు సంబంధించి జెండాలు ఉన్నాయి. అందుకే ఈసారి చంద్రుని ఉపరితలానికి తాకలేదు. ఇప్పటికే చంద్రుడి ఉప‌రిత‌లం మీద నుంచి అమెరికా, ర‌ష్యా దేశాలు రాళ్లు తెచ్చాయి. ఇప్పుడు ఆ జాబితాలో మూడ‌వ దేశంగా చైనా చేరింది. చంద్రుని మీద‌కు మ‌నుషుల‌ను పంపిన చైనా.. 2030 నాటికి మార్స్ గ్ర‌హం నుంచి కూడా మ‌ట్టిని తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ వేసింది. 1969లో చంద్రుడిపై అమెరికా జెండా నాటింది.



అపోలో 11 మిష‌న్‌లో వెళ్లిన వ్యోగాములు పూర్తి చేశారు. ఆ త‌ర్వాత 1972 వ‌ర‌కు మ‌రో అయిదు జెండాల‌ను చంద్రుడిపై అమెరికా పాతింది. అయితే ఆ జెండాలు ఇంకా నిల‌బ‌డి ఉన్న‌ట్లు 2012లో తీసిన నాసా శాటిలైట్ చిత్ర‌లు వెల్ల‌డించాయి.
Moons 1972 వరకు తదుపరి మిషన్ల సమయంలో మరో 5 అమెరికా జెండాలను చంద్ర ఉపరితలంపై పాతారు. 2012లో నాసా శాటిలైట్ ఫొటోలను విడుదల చేయగా అందులో 5 జెండాలు ఇప్పటికీ నిలబడే ఉన్నట్టు కనిపించాయి.

China flag

అక్కడి మట్టి, రాతి నమూనాలను చైనా చంద్ర కక్ష్యలో 15 కిలోమీటర్ల (9 మైళ్లు) చంద్ర ఉపరితలం పైకి తీసుకువెళ్ళింది. చాంగ్ -4 ల్యాండర్ రోవర్ 2019లో జెండాను చంద్రుని చీకటి వైపుకు తీసుకెళ్లాయి. చైనా జాతీయ జెండా చంద్రునిపై మొట్టమొదటి చంద్ర ల్యాండింగ్ మిషన్, చాంగ్ -3 సమయంలో ల్యాండర్ రోవర్ తీసిన ఫొటోలు కనిపించాయి. ఏడేళ్లలో చంద్రునిపై చాంగే -5 మిషన్ తో విజయవంతంగా చైనా మూడో ల్యాండింగ్ చేసింది.