కరోనా సమయంలో జిమ్, స్విమ్మింగ్ పూల్స్, మెట్రోలు ఎంతవరకు సేఫ్!

  • Published By: sreehari ,Published On : July 25, 2020 / 08:12 PM IST
కరోనా సమయంలో జిమ్, స్విమ్మింగ్ పూల్స్, మెట్రోలు ఎంతవరకు సేఫ్!

కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మొన్నటివరకూ లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉన్నవాళ్లంతా బయటుకు వస్తున్నారు. నిత్యావసర వస్తువుల నుంచి ఇతర అవసరమైన పనుల కోసం తప్పక బయటకు రావాల్సిన పరిస్థితి. కరోనా సమయంలో ప్రజా రవాణా, మెట్రోలు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ లు తిరిగి ప్రారంభించడం ఎంతవరకు సురక్షితమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇతర దేశాల్లో చాలావరకూ ఇవన్నీ తెరుచుకున్నాయి. మునపటిలానే అందరూ జిమ్, స్విమ్మింగ్ అనుమతించారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో వీటిని అనుమతించడం ఎంతవరకు సేఫ్ అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కరోనా వ్యాప్తి మరింత తీవ్రమయ్యేందుకు అవకాశం ఉంటుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జిమ్‌లు సురక్షితమేనా? :
జూలై 25 నుంచి ఇంగ్లాండ్‌లో జిమ్‌లు, రెస్ట్ సెంటర్లు తిరిగి తెరిచేందుకు అనుమతించారు. ఉత్తర ఐర్లాండ్‌లోని జిమ్‌లు ఈ నెల ప్రారంభంలో తెరుచుకున్నాయి. అయితే స్కాట్లాండ్, వేల్స్‌లో ఇండోర్ జిమ్‌లు మూసివేశారు. జూలై ఆరంభంలో, కల్చరిస్ట్ సెక్రటరీ ఆలివర్ డౌడెన్ జూలై 25 నుంచి జిమ్‌లు, విశ్రాంతి కేంద్రాలు జిమ్‌కు వెళ్లేవారిని తిరిగి అనుమతించ వచ్చునని ప్రకటించారు.

పరిశుభ్రత, సామాజిక-దూరం పాటిస్తూ మహమ్మారి సమయంలో బయట పని చేయడం సురక్షిత మైనదేనని కొంతమంది నిపుణులు చెప్పారు.  శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. జిమ్‌లకు వెళ్ళే ముందు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరమని ప్రజారోగ్య నిపుణులు సిఫారసు చేస్తున్నారు.

అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు :
NPR ప్రకారం.. గుండె జబ్బులు, 65 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో అనారోగ్య సమస్యలు ఉంటే.. ఇంట్లోనే ఉండాలని అనుకోవచ్చు. కరోనావైరస్ హాట్ స్పాట్స్‌లో నివసించే ప్రజలు జిమ్‌ కు వెళ్లకపోవడమే మంచిందంటున్నారు. ఇండోర్ జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, ఇతర క్రీడా, వ్యాయామ సౌకర్యాలకు అనుమతించకపోవడమే సరైన నిర్ణయంగా భావిస్తున్నారు.

వెంటిలేషన్ బాగుండాలి :
జిమ్‌లు మంచి వెంటిలేషన్ ఉండేలా చూడాలి. భౌతిక దూరాన్ని అమలు చేయాలి. ఉపయోగం ముందు, తరువాత అన్ని పరికరాలను శానిటైజ్ చేయాలి. ప్రాంగణంలో వెంటిలేషన్ తప్పక ఉండాలి. ఎందుకంటే ఎక్కువ వెంటిలేషన్ గాలిలో కరోనావైరస్ సాంద్రతను తగ్గిస్తుందని గుర్తించాలి. వ్యాయామం చేస్తున్నప్పుడు సాధారణంగా శ్వాస ఎక్కువగా తీసుకుంటుంటారు. సోకిన లేదా సంక్రమణ వ్యాప్తి చెందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

మాస్క్‌లు :
జిమ్స్‌లలో మాస్క్ ధరించడం తప్పనిసరి కాదనే అభిప్రాయ ఉంది. జిమ్‌లకు సంబంధించి ఫేస్ మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని కొందరు అంటుంటే.. మాస్క్‌లు ధరించకపోవటం ప్రమాదమని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అరగంట పాటు మాస్క్ లేకుండా మీ పక్కన పని చేస్తున్న వారినుంచి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. జిమ్‌లు హాజరైన వారి రికార్డును 21 రోజులు ఉంచాలి. సమీపంలో కోవిడ్ -19 వ్యాప్తి ఉందో లేదో తెలుసుకోవాలి.

స్విమ్మింగ్ ఫూల్ సురక్షితమేనా? :
పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ చాలా బహిర్గతంగా ఉంటాయి. క్లోరిన్ ఇతర రసాయనాలు కలిపిన నీటిని వాడతారు. వైరస్ జాడలను చంపుతాయని నిపుణులు అంటున్నారు. మూసివేసిన నాన్-ఎన్వలప్డ్ వైరస్‌లను చంపడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన క్లోరినేషన్ స్థాయి 15mg.min / లీటరు సరిపోతుంది. పూల్ వాటర్ ట్రీట్మెంట్ అండ్ అడ్వైజరీ గ్రూప్ (PWTAG) నుంచి మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.. కరోనా సమయంలో ఈత కొట్టడం సాధారణంగా సురక్షితం అని ప్రజారోగ్య అభిప్రాయపడుతున్నారు.
Coronavirus : how safe are gyms, swimming pools, trains, and tubes?స్విమ్మింగ్ ఫూల్‌లో నీరు, క్లోరిన్ వైరస్‌ను చంపడానికి సాయపడతాయి. ప్రతి స్విమ్మర్ ఆరు చదరపు మీటర్ల స్థలం ఉండేలా సామర్థ్యాన్ని పరిమితం చేయాలి. సూపర్ మార్కెట్లు వంటి ఇతర ప్రదేశాల మాదిరిగానే, స్విమ్మింగ్ ఫూల్ వద్ద కూడా కఠినమైన సామాజిక దూరం ఉండేలా చూడాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమైనదిగా సూచిస్తున్నారు. ఈత కొట్టడానికి ముందు తరువాత స్నానం చేయాలి. డోర్ హ్యాండిల్స్‌ లేదా లాకర్‌ను తాకిన తర్వాత మీ చేతులను శానిటైజ్ చేసుకోవాలి. హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలి. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు సబ్బు, నీటితో 20 సెకన్ల పాటు బాగా కడగాలి. శుభ్రమైన స్విమ్మింగ్ కిట్, తువ్వాళ్లను వాడాలి.

ప్రజా రవాణా ఎంత సురక్షితం? :
బస్సులు, రైళ్లలో ఫేస్ మాస్క్‌లు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. జూన్ 15 నుంచి ప్రజా రవాణాలో ఫేస్ షీల్డ్ ధరించాలని కండీషన్ పెట్టారు. ఒకటి కంటే ఎక్కువ ట్యూబ్ లైన్లను తరచుగా ఉపయోగించే వ్యక్తులు ఫ్లూ లాంటి లక్షణాలతో బాధపడే అవకాశం ఉందని తేలింది. సంవత్సరానికి సుమారు 1.2 బిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది.

Coronavirus : how safe are gyms, swimming pools, trains, and tubes?

అంటు వ్యాధులు ప్రబలే హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఎక్కువ ప్రయాణాలు చేసేవారు లేదా బిజీ స్టేషన్లను ఉపయోగించే ప్రయాణికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా తాకిన బస్సు భాగాలు, స్తంభాలు, తలుపులు వంటివి ప్రతిరోజూ శానిటైజేషన్ చేస్తుండాలి. కోవిడ్ -19 వ్యాప్తి వంటి అన్ని ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని నిరోధించాలంటే బస్సు, ఆటో లేదా రైలును ఉపయోగించే ముందు తరువాత చేతులు తప్పనిసరిగా శుభ్రపరుచుకోవడం అలవాటుగా చేసుకోవాలి. లేదంటే వైరస్ బారినపడే ప్రమాదం ఉందని మరవొద్దు..