Updated On - 2:48 pm, Fri, 7 August 20
By
sreehariకరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచమంతా ఇంటికి పరిమితమయ్యారు.. కరోనా వ్యాప్తి ప్రారంభమై ఆరు నెలలు అవుతోంది.. అప్పటినుంచి విద్యాసంస్థలన్నీ మూతపడే ఉన్నాయి. స్కూళ్లు, కాలేజీలన్ని మూసి వేయడంతో విద్యార్థుల విద్యాసంవత్సరం కూడా వెనుకబడిపోతోందనే ఆందోళన నెలకొంది. స్కూళ్లు, కాలేజీలు ఎప్పుడు తెరుస్తారనే దానిపైనే అందరి దృష్టిపడింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 14 మధ్య దశల వారీగా పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలను తిరిగి తెరిచే ప్రణాళికను కేంద్రం రూపొందించింది.
కోవిడ్ -19 సమయంలో విద్యాసంస్థలు తెరిచే ప్రణాళిక పద్ధతులపై ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ నేతృత్వంలోని మంత్రుల బృందం చర్చించింది. ఆగస్టు 31 తర్వాత మిగిలిన కార్యకలాపాలను తెరవాలని రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేయనుంది.. ఆఖరి అన్‌లాక్ మార్గదర్శకాలలో భాగంగా ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. విద్యార్థులు తిరిగి స్కూళ్లు, కాలేజీలకు వెళ్లడంపై తుది నిర్ణయం ఎలా ఉండాలి? ఎప్పుడు అనేది రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది కేంద్రం..
పాఠశాలలు, విద్యా సంస్థలకు బ్రాడ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP) జారీ చేసింది. పాఠశాల విద్యా శాఖ జూలైలో నిర్వహించిన సమగ్ర సర్వేలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించింది. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లను పంపేందుకు సిద్ధంగా లేరని సర్వేలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులు బాధపడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం దృష్టికి తీసుకొచ్చాయి.
కరోనా కేసులు తక్కువగా ఉన్న రాష్ట్రాలు మాత్రం సీనియర్ తరగతుల విద్యార్థుల తరగతులను ప్రారంభించడానికి ఆసక్తిని చూపింది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిశీలించిన మార్గదర్శకాల ప్రకారం.. పాఠశాలలను తెరిచి దశలవారీగా నిర్వహించాలని సిఫార్సు చేస్తున్నాయి. మొదటి 15 రోజులు, 10 నుంచి 12వ తరగతి విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాలి.. తరగతిలోని వివిధ విభాగాలు పాఠశాలకు హాజరు కావడానికి నిర్దిష్ట రోజులను ప్రకటించనున్నారు.
పాఠశాలలో, 10వ తరగతికి 4 విభాగాలు ఉంటే A,C విభాగాలలో సగం మంది విద్యార్థులు నిర్దిష్ట రోజులలో, మిగిలినవి ఇతర రోజులలో వస్తారు. ఫిజికల్ అంటెండెన్స్ 5-6 నుంచి 2-3 గంటల వరకు గంటల సంఖ్య పరిమితం చేస్తున్నారు. అన్ని పాఠశాలలు షిప్టుల వారీగా నడుస్తాయి. ఉదయం 8 నుండి 11 వరకు ఒక షిప్ట్ నడిస్తే.. మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు ఒక షిప్ట్ నడుస్తుంది.. ఇక శానిటైజేషన్ కోసం ఒక గంట విరామం తీసుకుంటారు. బోధనా సిబ్బంది, విద్యార్థుల 33% సామర్థ్యంతో పాఠశాలలు నడపాలని సూచించారు.
ప్రీ-ప్రైమరీ లేదా ప్రైమరీ స్కూల్ విద్యార్థులను పాఠశాలకు తిరిగి రావాలని సూచిస్తున్నారు. ఆన్‌లైన్ తరగతులతో కొనసాగడానికి ప్రభుత్వం అనుకూలంగా లేదని కార్యదర్శుల బృందంలోని చర్చలు అభిప్రాయపడ్డారు. 10 నుండి 12వ తరగతి వరకు భౌతిక తరగతులను ప్రవేశపెట్టాలని చిస్తున్నారు. 6 నుంచి 9వ తరగతి వరకు పరిమితం చేసినగంటలతో పాఠశాలలు భౌతిక పాఠశాల విద్యను ప్రారంభించాలని సూచించారు. ఒక పాఠశాలకు మల్టీపుల్ విభాగాలు ఉంటే, తరగతులు విస్తరించాలని పాఠశాలలకు సూచిస్తున్నారు.
సీనియర్ విద్యార్థులను విస్తరించడానికి ప్రాథమిక విభాగాన్ని ఉపయోగించాలని సూచిస్తోంది. స్విట్జర్లాండ్ వంటి దేశాలు పిల్లలను సురక్షితంగా పాఠశాలకు తీసుకువచ్చిన విధానాన్ని అధ్యయనం చేస్తున్నామని, ఇలాంటి మోడల్ భారతదేశంలో సక్సెస్ అవుతుందని అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కొండ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాఠశాలలు, విద్యా సంస్థలను తిరిగి తెరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Brazil Corona Deaths : కరోనాతో శవాల దిబ్బగా మారిన దేశం.. ఆ నగరాల్లో జననాల కన్నా మరణాల సంఖ్యే ఎక్కువ
Salary Increments : ఉద్యోగులకు శుభవార్త.. కరోనా కష్టకాలంలోనూ పెరగనున్న జీతాలు
Tenth, Inter Exams : ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
కరోనా ఎఫెక్ట్.. విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు కొత్త రూల్
Telangana Corona : తెలంగాణకు ముంచుకొస్తున్న ముప్పు.. ఆసుపత్రుల్లో బెడ్లు లేవు.. కరోనాతో జాగ్రత్త
Haridwar Kumbh Mela : 35లక్షల మంది స్నానాలు.. కుంభమేళాలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 2వేలకు చేరువలో కొత్త కేసులు