మీ చెవుల్లో రింగుమనే శబ్దం వస్తోందా? కరోనాలో ఇదో కొత్త లక్షణం

  • Published By: sreehari ,Published On : November 11, 2020 / 03:10 PM IST
మీ చెవుల్లో రింగుమనే శబ్దం వస్తోందా? కరోనాలో ఇదో కొత్త లక్షణం

COVID-19 Ears Ring  : మీ చెవిలో ఏమైనా వింత శబ్దాలు వినిపిస్తున్నాయా? చెవిలో రింగుమని మారుమోగుతున్నాయా? ఏదో జోరిగ లోపలికి వెళ్లి శబ్దం చేస్తున్న ఫీలింగ్ పదేపదే వినిపిస్తుందా? అయితే తస్మాత్ జాగ్రత్త.

ఇది కరోనా కొత్త లక్షణం కావొచ్చు.. కరోనా సోకిన బాధితుల్లో చాలామందిలో చెవుల్లో నుంచి శబ్దం మొదలై తలచుట్టూ కంపించినట్టుగా అనిపిస్తే మాత్రం అది కరోనా కొత్త లక్షణాల్లో ఒకటిగా కొత్త అధ్యయనంలో తేలింది.



చెవిలో రింగుమని మోగే శబ్దాన్ని (Tinnitus) అని పిలుస్తారు. కరోనా సోకిన వారిలో కొంతమందిలో చెవులు రింగమనడం, కంపించడం వంటి విభిన్న శబ్దాలు వినిపిస్తుంటాయి.

ప్రపంచవ్యాప్తంగా జనాభాలో కొంతమందిలో 12 శాతం నుంచి 30 శాతం దీర్ఘకాలిక సమస్యలు కనిపిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు.

కనిపించని వింత వ్యాధికి సంబంధించి మూలాల ద్వారా ఇలాంటి శబ్దాలు వినిపిస్తుంటాయని అంటున్నారు.

ఈ సమస్యలతో బాధపడే బాధితులు కోలుకోవడం చాలా కష్టమంటున్నారు. కొన్నాళ్ల పాటు చెవిలో ఈ రకమైన శబ్దాలు వినిపిస్తుంటాయని చెబుతున్నారు.



దీనికి సంబంధించి అధ్యయనాన్ని నవంబర్ 5, 2020లో జనరల్ Frontiers in Public Health ప్రచురించారు. అంగిలా రస్కిన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధక బృందం నేతృత్వంలో బ్రిటన్ టిన్నిటస్ అసోసియేషన్, అమెరికన్ టిన్నిటస్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి.

48 దేశాల నుంచి అధ్యయనంలో పాల్గొన్న వారిలో 3,103 మందిలో ఈ చెవిలో రింగుమనే శబ్దం సమస్యతో బాధపడుతున్నారని గుర్తించారు.

కరోనా సోకిన బాధితుల్లో 40 శాతం మందిలో ఈ టిన్నిటస్ లక్షణాలతో బాధపడుతున్నారని అధ్యయనంలో తేలింది.

కరోనా సోకడానికి ముందు ఇలాంటి లక్షణాలేమైనా ఉన్నాయనే కోణంలో పరిశోధకులు అధ్యయనం చేశారు. అయితే ఎక్కువమంది కరోనా సోకిన తర్వాత ఇలాంటి లక్షణాలు అభివృద్ధి చెందాయని గుర్తించారు.



మొత్తం 250 మంది పాల్గొన్న వారిలో కరోనా లక్షణాలు ఉండగా.. వారిలో 26 మందిలో మాత్రమే కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. సామాజిక దూరం వంటి చర్యల కారణంగా చాలామంది తమ జీవిన విధానాన్ని వివిధ అలవాట్లతో ఈ టిన్నిటస్ సమస్యకు దారితీసి ఉండొచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు.

కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్ అయిన చాలామంది కరోనా బాధితుల్లో ఎనిమిది వారాల తర్వాత చాలామందిలో వినికిడి సమస్య అధికంగా కనిపిస్తోందని పరిశోధక బృందం గుర్తించింది.

యూకేలో లైఫ్ స్టయిల్ మార్చుకున్న చాలామందిలోనూ వినికిడి వంటి సమస్యలు అధికమైనట్టు 46 శాతం మంది వెల్లడించారు. ఉత్తర అమెరికాలో మాత్రం 29 శాతం మాత్రమే వినికిడి సమస్య ఉందని తెలిపారు.



అనేక వైరస్‌ల కారణంగా వినికిడి సమస్యలు వస్తున్నాయని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. SARS-Cov-2 వైరస్ కారణంగా కూడా టిన్నటస్ సమస్య తలెత్తోందని ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ లో అంగిలియా రస్కిన్ యూనివర్శిటీకి చెందిన రీసెర్చర్ Eldre Beukes చెప్పారు.



ఒత్తిడి లోనయ్యే వారిలోనూ ఈ రకమైన టిన్నిటస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు. 50ఏళ్ల లోపు వయస్సు మహిళల్లోనూ ఈ సమస్య ఉందని గుర్తించారు.

నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలతో వినికిడి సమస్యలకు దారితీస్తోందని అన్నారు. అస్తమా కలిగిన బ్రిటన్లలో కరోనా సోకిన తర్వాత శాశ్వతంగా వినికిడి కోల్పోయినట్టు గుర్తించారు.



కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ తీసుకున్నవారిలోనూ వినికిడి లోపాన్ని గుర్తించినట్టు పరిశోధక బృందం వెల్లడించింది.

కరోనాతో వినికిడి సమస్యకు ప్రత్యక్ష సంబంధాన్ని గుర్తించాలంటే మరింత లోతుగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.