కరోనా రెండోసారి సోకుతుందా? మనకు తెలియనదేంటి? తెలుసుకోవాల్సిందేంటి?

  • Published By: sreehari ,Published On : October 14, 2020 / 07:08 PM IST
కరోనా రెండోసారి సోకుతుందా? మనకు తెలియనదేంటి? తెలుసుకోవాల్సిందేంటి?

COVID-19 Reinfection : కరోనా వైరస్ నుంచి కోలుకున్నాక రెండోసారి కరోనా సోకే ఛాన్స్ ఉన్నాయని అంటున్నారు పరిశోధకులు.. ఇప్పటికే చాలామందిలో కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ కరోనా బారినపడ్డారు. కొంతమందిలో కరోనా లక్షణాలు స్వల్పంగా ఉంటే.. మరికొందరిలో తీవ్రత ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.



కోవిడ్-19 రెండోసారి వచ్చినా అనారోగ్యానికి దారితీస్తుందని కొత్త కేసు రిపోర్టులో వెల్లడైంది. Lancet Infectious Diseasesలో ఈ రిపోర్టును ప్రచురించారు. కానీ, కరోనా రీఇన్ఫెక్షన్ విషయంలో ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉందని అంటున్నారు నిపుణులు.. బయోలాజికల్ గా కరోనా వైరస్ ఎలా పరివర్తనం చెందుతుందో అధ్యయనంలో విశ్లేషిస్తున్నామని Nevada State Public Health Laboratory అధ్యయన సహా రచయిత, డైరెక్టర్ Mark Pandori పేర్కొన్నారు.

ఈ అధ్యయనం ప్రకారం.. కరోనా వైరస్ రెండోసారి సోకే అవకాశం ఉందని ఎలా గుర్తించాలి? అది వారిని మరోసారి ఏ స్థాయిలో అనారోగ్యానికి గురిచేస్తుందో నిర్ధారించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. నివేదలో ఉండే 25ఏళ్ల వ్యక్తికి ఏప్రిల్ ప్రారంభంలో రెండోసారి Covid-19 వచ్చింది.



అతడిలో దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, వికారం, డయేరియా వంటి లక్షణాలు కనిపించాయి. ఏప్రిల్ నెలఖారులో ఆ లక్షణాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత మరోసారి టెస్టింగ్ చేయడంతో నెగటివ్ అని తేలింది. ఆ తర్వాత మళ్లీ మే నెలలో రెండోసారి కరోనా వచ్చింది. ఉన్నట్టుండి అతడిలో ఒకేరకమైన లక్షణాలు కనిపించాయి. జూన్ ఆరంభంలో ఆస్పత్రిలో చేరాడు.. అక్కడే అతడికి రెండోసారి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

శ్వాసకోశ సమస్య అధికంగా ఉండటంతో వైద్యులు అతడికి ఆక్సిజన్ ద్వారా బ్రీతింగ్ సపోర్ట్ అందించారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ ఎటాక్ పై గత అధ్యయనాలు వెల్లడించాయి. అమెరికాలో ఒకే వ్యక్తికి రెండుసార్లు కరోనా సోకడం తొలికేసు కూడా.



కరోనా రీఇన్ఫెక్షన్ వెంటనే కూడా సోకే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.. కేవలం 48 రోజుల్లో ఒక బాధితుడు మొదటి, రెండో పాజిటివ్ టెస్టులు నిర్ధారణ కావొచ్చు. కానీ, గత అధ్యయనాల్లో మాత్రం కరోనా నుంచి కోలుకున్నవారిలో యాంటీబాడీలు తయారై రోగ నిరోధక వ్యవస్థను పటిష్ట పరుస్తాయని చెప్పారు.

ఈ యాంటీబాడీలు కనీసంగా మూడు నెలలు శరీరంలోనే ఉంటాయని అధ్యయనాలు పేర్కొన్నాయి. కానీ, దీనిపై కచ్చితమైన ఆధారాలేమి లేవని అంటున్నారు పరిశోధకులు.