ఇదో కొత్త ప్రాణాంతక వ్యాధి.. చల్లటి మాంసాన్ని తిననే తినొద్దు : వైద్యుల హెచ్చరిక

  • Published By: sreehari ,Published On : October 30, 2020 / 10:40 PM IST
ఇదో కొత్త ప్రాణాంతక వ్యాధి.. చల్లటి మాంసాన్ని తిననే తినొద్దు : వైద్యుల హెచ్చరిక

Eat Cold Meat : చల్లటి (కోల్డ్ మీట్) మాంసంతో జాగ్రత్త. ప్రత్యేకించి కొందరు ఈ చల్లటి మాంసాన్ని తినడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

చల్లగా ఉండే మాంసంపై Listeria అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇప్పటికే అమెరికాలోని మూడు రాష్ట్రాల్లో ఈ వ్యాధి విజృంభించింది.

వ్యాధి సోకిన వారిలో ఒక వ్యక్తి మృతిచెందగా, మరో 9 మంది అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ బ్యాక్టీరియా ఉద్భవించడానికి గల కచ్చితమైన మూలం తెలియదు.

కానీ, ప్రెగ్నెన్సీతో ఉన్నవారితో పాటు 65ఏళ్ల వయస్సు దాటినవారిలో రోగ నిరోధకశక్తిని బలహీనంగా ఉంటుంది.



అందుకే ఇటాలీయన్ స్టయిల్ డెలి మీట్స్ (కోల్డ్ మీట్) తినొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. Listeriosis అనే వ్యాధి listeria అనే బ్యాక్టీరియా ద్వారా అరుదుగా వ్యాపిస్తుంది. రిఫ్రిజరేటర్ ఉష్టోగ్రతల్లో ఈ బ్యాక్టీరియా జీవిస్తుంది.



కొన్ని నిర్దిష్టమైన ఆహార పదార్థాలు, ప్రాసెస్ చేసిన మాంసం సలామీ, సాఫ్ట్ చీజెస్ వంటి పాశ్చరైజ్ చేయని పాలు వంటి పదార్థాల్లో ఎక్కువగా బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశం ఉంది.

ఇటీవలి కాలంలో listeria బ్యాక్టీరియాకు ఆకు కూరల వంటి ఉత్పత్తులతో సంబంధం ఉందని నిపుణులు పేర్కొన్నారు.

అధిక ముప్పు :
చాలామందిలో ఈ వ్యాధి స్వల్పంగా ఉంది.. కానీ, కొన్ని ఇతర లక్షణాల్లో జ్వరం, నొప్పులు, తలనొప్పులు, డయేరియా కూడా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవచ్చు.

కొన్ని రోజుల్లోనే నయమయ్యే అవకాశం ఉంటుంది. హై రిస్క్ కేటగిరీ వారిలో వైరస్ ప్రాణాంతకంగా మారుతుందని అంటున్నారు.




listeria బ్యాక్టీరియా గర్భం దాల్చిన మహిళల్లో వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వ్యాధి కారణంగా కొన్నిసార్లు గర్భస్రావం, ప్రసవం సమయంలో అనేక ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉంది. పుట్టిన శిశువు కూడా చనిపోయే అవకాశం ఉంది.

వృద్ధులు లేదా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, కీమోథెరపీ చేయించుకునేవారు లేదా HIV ఉన్నవారు కూడా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.

యూకేలో గర్భిణీలు లిస్టెరియోసిస్ కలిగించే ప్రమాదం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం మానేయాలని NHS సూచించింది.



– కొన్ని వండని మృదువైన చీజ్‌లు, బ్రీ, కామెమ్‌బెర్ట్‌తో సహా తినరాదు.
– పాశ్చరైజ్ చేయని పాలు లేదా పాల ఉత్పత్తులు
– ఏదైనా వండిన ఆహారం (పచ్చిగా తినరాదు)

పెంపుడు జంతువులు లేదా గేదెలు వంటి ఇతర జంతువులతో గర్భిణీ స్త్రీలు సన్నిహితంగా మెలగరాదు. అక్టోబర్ 22 నాటికి, మూడు వేర్వేరు రాష్ట్రాల నుండి 10 మందికి లిస్టెరియా మోనోసైటోజెనెస్ వ్యాధి సోకగా.. ఫ్లోరిడాకు చెందిన ఒకరు మరణించారు.

రోగులు 40 నుంచి 89ఏళ్ల వయస్సు, సగటు వయస్సు 81, వారిలో 80 శాతం స్త్రీలు ఉన్నారు.



ప్రతి ఒక్కరూ అనారోగ్యానికి ముందు ఇటాలియన్ తరహా డెలి మాంసాలు, సలామి, మోర్టాడెల్లా, ప్రోసియుటో వంటివి తిన్నట్లు నివేదించారు. వివిధ ప్రదేశాలలో డెలి కౌంటర్ల వద్ద ప్రీప్యాకేజ్డ్ డెలి మాంసాలను కొనుగోలు చేసినట్లు నివేదించారు.

ఆగస్టు 6, అక్టోబర్ 3 మధ్య రోగుల నుంచి సేకరించిన నమూనాల డేటా విశ్లేషణలో బ్యాక్టీరియా జన్యుపరంగా దగ్గరి సంబంధం కలిగి ఉందని తేలింది.