నేటి నుంచి గాంధీ ఆస్పత్రిలో సాధారణ సేవలు…కోవిడ్‌, నాన్‌ కోవిడ్‌ రోగుల కోసం సెపరేట్‌ బ్లాక్‌లు

  • Published By: bheemraj ,Published On : November 21, 2020 / 06:52 AM IST
నేటి నుంచి గాంధీ ఆస్పత్రిలో సాధారణ సేవలు…కోవిడ్‌, నాన్‌ కోవిడ్‌ రోగుల కోసం సెపరేట్‌ బ్లాక్‌లు

Gandhi Hospital General services : హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఇవాళ్టి నుంచి అన్ని రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. నాన్‌ కోవిడ్‌ సేవలను వైద్యులు, వైద్య సిబ్బంది ఈరోజు నుంచే అందిస్తారు. అన్ని విభాగాల అవుట్‌ పేషంట్లు, ఇన్‌ పేషంట్స్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాదు… ఎలక్టివ్‌, అత్యవసర శస్త్ర చికిత్సలు కూడా అందించనున్నారు. ఈ మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు స్పష్టం చేశారు.



గాంధీ ఆస్పత్రిలో 8 నెలల క్రితం సాధారణ వైద్య సేవలు నిలిచిపోయాయి. కోవిడ్‌ కారణంగా…నాన్‌ కోవిడ్‌ సేవలన్నింటి ప్రభుత్వం నిలిపివేసింది. కోవిడ్‌ ఆస్పత్రికి మార్చింది. దీంతో అప్పటి నుంచి గాంధీ కోవిడ్‌ సేవలే అందుతున్నాయి. రోజురోజుకు కోవిడ్‌ కేసులు తగ్గుతుండటం, కరోనాపై ప్రజల్లో అవగాహన పెరగడం, ఇంటి దగ్గరే హోం ఐసోలేషన్‌లోఉండడంతో.. గాంధీకి వచ్చే కోవిడ్‌ రోగుల సంఖ్య భారీగా పడిపోయింది.



https://10tv.in/ordinance-bans-online-gambling-in-tamilnadu/
ప్రస్తుతం మూడు వందలలోపే కరోనా రోగులు ఉన్నారు. దీంతో ప్రభుత్వం నాన్‌ కోవిడ్‌ సేవలు కూడా గాంధీలో ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయం మేరకు నేటి నుంచి అన్నిరకాల వైద్య సేవలు గాంధీలో అందుబాటులోకి వస్తున్నాయి.



కోవిడ్‌, నాన్‌ కోవిడ్‌ సేవల కోసం గాంధీలో వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. క్యాజువాలిటీ దగ్గరలోని ర్యాంప్‌ దగ్గర అవుట్‌ పేషంట్‌ సేవలు అందించనున్నారు. కోవిడ్‌, నాన్‌ కోవిడ్‌ రోగులు కలిసిపోతే వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంది. దీంతో ఒక భవనంలోకి మరొకరు వెళ్లకుండా మార్క్‌ ఏర్పాట్లు చేశారు.