చర్మం ద్వారా ‘కొవాగ్జిన్‌’ టీకా.. భారత బయెటిక్‌కు అనుమతి

  • Published By: sreehari ,Published On : August 22, 2020 / 07:34 PM IST
చర్మం ద్వారా ‘కొవాగ్జిన్‌’ టీకా.. భారత బయెటిక్‌కు అనుమతి

కరోనా వైరస్ వ్యాక్సిన్లు చాలావరకు క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయి.. కరోనా వ్యాక్సిన్ల రేసులో ఉన్న భారత బయెటిక్ సంస్థ కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసింది.. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ పై క్లినికల్ ట్రయల్స్ కొనసాగు తున్నాయి.. క్లినికల్ ట్రయల్స్ నిబంధనల్లో భాగంగా ప్రభుత్వ ప్యానెల్ నుంచి  భారత బయోటిక్ కు మరో అనుమతి లభించింది.

కొవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ నిబంధనల్లో మార్పు కోసం ప్రభుత్వ ప్యానెల్ అంగీకరించింది. ఈ నిబంధన ప్రకారం.. కొవాగ్జిన్ టీకాను అన్ని టీకాల్లో కాకుండా చర్మం కింది పొరకు ఇవ్వాల్సి ఉంటుంది..



సాధారణంగా టీకాను అనేక మార్గాల్లో ఇస్తారు.. ఎక్కువగా కండరాలకు ఇస్తుంటారు… కొన్ని టీకాలను భుజాలు, పిరుదులకు టీకా ఇస్తుంటారు.. దీనిని ఇంట్రామస్కులర్ రూట్ అంటారు. కొన్ని టీకాలను సెలైన్, నోరు, నరాల ద్వారా ఇస్తారు. కొన్నింటికి చర్మం కింది పొరకు ఇస్తారు. దీనినే ఇంట్రాడెర్మల్ రూట్ అంటారు. రెండు షరతులకు లోబడి కొవాక్జిన్‌తో చర్మం కింది పొరకు టీకా ట్రయల్స్ చేపట్టేందుకు అనుమతులు లభించాయని సమాచారం..



అసలు చర్మం కింద పొరకు ఎందుకు వ్యాక్సిన్ ఇస్తారంటే.. దీని వెనుక చాలా ప్రాధాన్యం ఉందని చెప్పవచ్చు.. టీకాను కండరాలకు ఇస్తే.. ఎక్కువ ఔషధాన్ని ఇవ్వాల్సి వస్తుంది.. అదే చర్మం కింద పొరకైతే స్వల్ప మోతాదులో ఇస్తే సరిపోతుంది. ఇలా అయితే.. టీకా మోతాదు తక్కువగా ఉండి ఎక్కువ మందికి టీకా అందుబాటులోకి రావడానికి ఆస్కారం ఉంటుంది.. అంతేకాదు.. టీకా ధర కూడా తగ్గిపోతుందని భావిస్తున్నారు..



భారతదేశం లాంటి అధిక జనాభా, పేదరికం ఉన్న దేశాలకు తక్కువ ధరకే టీకా వేయాలంటే ఎక్కువ మోతాదులో టీకా ఔషధం అవసరం అవుతుంది.. దేశవ్యాప్తంగా 12 ఆస్పత్రుల్లో 1125 మంది రోగులపై కొవాక్జిన్ మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. త్వరలోనే మూడో దశ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి..