వాసన ఇలా పసిగట్టేస్తున్నారా? అతిగా కాఫీ తాగేస్తున్నారు.. జాగ్రత్త!

  • Published By: sreehari ,Published On : October 24, 2020 / 09:54 PM IST
వాసన ఇలా పసిగట్టేస్తున్నారా? అతిగా కాఫీ తాగేస్తున్నారు.. జాగ్రత్త!

Drinking Too Much Caffeine : మీలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? కాఫీ వాసనను ఇట్టే పసిగట్టేస్తున్నారా? అయితే మీరు అతిగా కాఫీ (Caffeine) తాగేస్తున్నారన్నట్టే.. తస్మాత్ జాగ్రత్త.. కాఫీ ఎక్కువగా తీసుకునేవారిలో కొన్ని లక్షణాలతో పాటు వాసన కూడా ఎక్కువగా గుర్తుపడుతున్నారంట.

ఎక్కడ కాఫీ ఉన్నా వాసన వెంటనే తెలిసిపోతుందంట.. కాఫీ కోరికలు ఎక్కువగా ఉన్నవారిలోనే ఈ తరహా లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు U.Kలోని University of Portsmouth పరిశోధకులు.

ఒక రోజులో మూడు లేదా నాలుగు సార్లు కాఫీని ఎక్కువగా తీసుకునేవారిలో అనేక అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని చెబుతున్నారు. కాఫీ తాగేవారిలో ఎంతమంది కాఫీ వాసనకు తొందరగా స్పందిస్తున్నారు అనేదానిపై పరిశోధక బృందం అధ్యయనం చేసింది.Drinking Too Much Caffeine

ఇందులో కాఫీలోని కెఫిన్ ఎక్కువగా తీసుకునేవారే చాలా సున్నితంగా ఉన్నారని గుర్తించారు. శరీరంలో అధిక మోతాదులో కెఫిన్ నిల్వలు అధికంగా ఉన్నవారిలో ఈ రకమైన స్మెల్ సెన్సేషన్ ఉంటుందని పరిశోధక బృందం తెలిపింది. కాఫీకి బాగా అలవాటుపడినవారిలోనే ఈ తరహా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

ఇంతకీ మీరు రోజు కాఫీ తాగుతున్నారా? అయితే మీలో కెఫిన్ ఎంత స్థాయిలో ఉందో తెలుసుకోవాలనుంటున్నారా? దూరంగా ఉన్నా మీకు కాఫీ వాసన గుర్తించగలుగుతున్నారా? అయితే సమస్యే.. మీ ఆరోగ్యం డేంజర్ జోన్ లో ఉన్నట్టే అంటున్నారు పరిశోధకులు.

ఈ లక్షణాల బట్టి మీకు కాఫీ అతిగా తాగే అలవాటు ఉందని, మీలో కెఫిన్ పరిమాణం అధికంగా ఉందని నిర్ధారించుకోవచ్చు.. కాఫీ ఎక్కువగా తీసుకునేవారిలో మరో 4 లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని గుర్తించారు.. అవేంటో ఓసారి చూద్దాం…

1. చెమటలు పట్టడం :
కాఫీ తాగితే చాలు.. కొంతమందిలో ఎక్కడలేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఒక కప్ తో మొదలై అతిగా తాగేస్తుంటారు.. ఇలాంటివారిలో అధికంగా చెమటలు పట్టేస్తుంటాయి.

కెఫిన్ కారణంగానే ఇలా జరుగుతుందని అంటున్నారు పరిశోధకులు. శరీరంలోని కెఫిన్.. నాడీ వ్యవస్థ పనితీరును వేగవంతం చేస్తుంది.Drinking Too Much Caffeine

అంతేకాదు.. హార్ట్ రేటు పెరిగిపోతుంది.. బ్లడ్ ప్రెజర్ కూడా పెరిగిపోతుంది. రోజుకు నాలుగు కప్పుల్లో 400 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా కాఫీ తీసుకునేవారిలో అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

2. గుండె దడగా ఉండటం :
హృదయ సంబంధిత సమస్యలపై MBBH, MPH, కార్డియక్ ఎలక్ట్రోఫిజియోస్ట్ స్పెషలిస్టు Arun Sridhar ప్రకారం.. చాలామందిలో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు.

అధిక మోతాదులో కెఫిన్ ఉన్నవారిలో హృదయ స్పందనలో మార్పులు కనిపిస్తాయని చెబుతున్నారు.
Drinking Too Much Caffeine

వేగంగా గుండె కొట్టుకుంటుంది.. కొన్నిసార్లు ఆగి ఆగి కొట్టుకోవడం లేదా హైరేటులో ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కళ్లు తిరగడం లేదా అలసగా ఉండటం వంటిగా అనిపిస్తే మాత్రం వెంటనే వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

3. వికారం :
అధిక స్థాయిలో కెఫిన్ తీసుకునే వారిలో వికారం తరచుగా కనిపిస్తుంటుంది. అసౌకర్యంగా అనిపించడం లేదా వాంతులు వచ్చినట్టుగా ఉండం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

దీనిర్థం.. కడుపులో తీవ్ర స్థాయిలో యాసిడ్ ఉత్పత్తి అవ్వడం కారణంగా వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Drinking Too Much Caffeine

4. ఆందోళన :
కెఫిన్ అక్షరాలా మీ శరీరంలో ఆడ్రినలిన్‌ను విడుదల చేస్తుంది. దీని కారణంగా యాసిడ్ విడుదల అవుతాయి.. కొన్నిసార్లు చాలా తీవ్రంగా కూడా ఉండొచ్చు.

కెఫిన్-ప్రేరిత ఆందోళన రుగ్మత డయాగ్నొస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ (DSM) లో నాలుగు కెఫిన్-సంబంధిత మానసిక రుగ్మతలలో ఒకటిగా చెప్పవచ్చు.

Drinking Too Much Caffeine

రెండో కప్పు లేదా మూడవ కప్పు కాఫీ తాగిన తర్వాత మీలో ఎక్కువగా ఆందోళన ఎక్కువగా అనిపిస్తే మాత్రం… కాఫీ వాడకాన్ని సాధ్యమైనంత తొందరగా తగ్గించే సమయం ఆసన్నమైందని అర్థం.. లేదంటే ఆరోగ్యపరంగా మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు పరిశోధకులు.