పెళ్లి చేసుకొంటేనే ఆనందంగా ఉంటారా? మీరు అనుకుంది నిజం కాకపోవచ్చు

  • Published By: sreehari ,Published On : July 25, 2020 / 06:39 PM IST
పెళ్లి చేసుకొంటేనే ఆనందంగా ఉంటారా? మీరు అనుకుంది నిజం కాకపోవచ్చు

పెళ్లికాని ప్రసాదులకన్నా సంసారంలో ఉన్నావాళ్లే ఆనందంగా ఉంటారు… ఎక్కువకాలం బతుకుతారని అనం అనుకొంటాం. ఇంట్లో పెద్దలు, సినిమాల్లోని కేరక్టర్లు, చివరకు సైకాలజిస్ట్‌లు అలానే చెప్పారు.  1998లో ఒక పరిశోధన జరిగింది. 17దేశాల్లోని  పెళ్లిచేసుకున్నవాళ్లను అధ్యయనం చేశారు. బ్యాచిలర్స్ కన్నా మ్యారీడ్ 3.4రెట్లు ఆనందంగా ఉంటారని తేల్చేశారు. అందుకే వద్దు మొర్రో అంటున్నా, పెళ్లిచేసుకోరా…హ్యాపీగా ఉంటావని జడ్జిమెంట్లు ఇచ్చేస్తారు.

కాకపోతే కొత్త పరిశోధన వచ్చింది. ఆశ్చర్యంగా దీనికి రివర్స్‌లో ఫలితాలను వెల్లడించింది. Michigan State University పరిశోధకులకు ఒక సందేహం. ఆనందానికి, పెళ్లికి మధ్య లింకేంటి? సినిమాల్లో భర్తను భరించేవాడిగా చాలా జోక్స్ వేస్తారుకదా.  లేదంటే నిజంగా ఆనందంగానే ఉన్నారా? అసలు పెళ్లి చేసుకొన్నవాళ్లు, పెళ్లికి సిద్ధమైన వాళ్ల మధ్య ఆనందం, సంతోషాల్లో ఉన్న తేడా ఏంటి? తెలుసుకోవాలనుకున్నారు. నిజానికి ఇది చాలామంది డౌట్ కూడా.



Journal of Positive Psychologyలో ఫలితాలను ప్రచురించారు. 7,532 మంది అనుబంధాల చరిత్రను పరిశోధించారు. వాళ్లను మూడు గ్రూపులుగా అంటే 16 నుంచి 60 ఏళ్ల వరకు  మధ్యనున్నవాళ్లను సెలక్ట్ చేశారు. వాళ్ల ఏజ్ లో ఎంత ఆనందంగా ఉన్నారో స్టడీచేశారు.

మిక్సెడ్ రిలేషన్ షిప్‌లో ఉన్నావాళ్లు, సింగిల్స్‌కు మధ్య ఆనందంలో పెద్దగా తేడాల్లేవు. ఇద్దరి సంతోషాల మోతాదు ఒకేలా ఉంది. కాకపోతే అసలు ప్రేమించలేకపోవడం కన్నా ప్రేమను అనందించి ఆ తర్వాత కోల్పోయినవాళ్లే ఎంతో కొంత ఆనందంగా ఉన్నారనుకోవచ్చు.



మ్యారేజ్ స్టేటస్‌ను బట్టి ఎంత ఆనందంగా ఉన్నారో చెప్పలేమన్నది పరిశోధకుల మాట. కొందరు సంసారంలో ఎన్నికష్టాలున్నా పట్టించుకోకుండా బతికేస్తుంటారు. అలాగే సింగిల్స్ కూడా పెళ్లి, పిల్లలు లాంటి బాదరాబందీలేకపోయినా.. ఫ్రెండ్ షిప్, రొమాన్స్, హాబీలు, కెరీర్ అంటూ బిజీగా హ్యాపీగా గడిపేస్తుంటారు.

ఇంకోసంగతి, ఒకరు మొదట్లో ఆనందంగా లేకపోతే వాళ్లకు పెళ్లి అన్నది ఆనందానికి పరమౌషదం కాదు. భార్యో, భర్తో పక్కనున్నంత మాత్రానా వాళ్లేమీ నవ్వుతూ, తుళ్లుతూ తిరగరు.


సారాంశం ఒక్కటే… సింగిల్‌గా మీరు కనుక హ్యాపీగా ఉంటే… పెళ్లిఅయినా మీరు ఆ ఆనందాన్ని జీవితాంతం కొనసాగించొచ్చు. పెళ్లిఅయినా, లేకపోయినా….మీకు హ్యాపీయే. అదే మీరు మూడీగా ఉండేవాళ్లనుకోండి…మిమ్మల్ని మీ భాగస్వామికూడా మార్చలేరు.