కరోనావైరస్ అధికారిక డేటా కంటే ఆరు రెట్లు ఎక్కువ.. ఇటలీ సర్వే

  • Published By: sreehari ,Published On : August 4, 2020 / 11:33 AM IST
కరోనావైరస్ అధికారిక డేటా కంటే ఆరు రెట్లు ఎక్కువ.. ఇటలీ సర్వే

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. కరోనా ప్రారంభంలో ఇటలీ కరోనా కేసులతో తీవ్రంగా దెబ్బతిన్నది. కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదవుతూనే ఉన్నాయి. కరోనా అధికారిక లెక్కల్లో అసలైన గణాంకాలకు సరిపోలడం లేదు. ఇటలీలో దాదాపు 1.5 మిలియన్ల మంది లేదా జనాభాలో 2.5శాతం మంది కరోనావైరస్ యాంటీబాడీస్‌ను అభివృద్ధి చేశారు.



అధికారిక సంఖ్యల కంటే ఆరు రెట్లు ఎక్కువ అని గణాంక సంస్థ Istat ఒక సర్వేలో తెలిపింది. దీని ప్రకారం.. 64,660 మందిపై యాంటీబాడీ పరీక్షల ఆధారంగా ఇస్తాట్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఇందులో అధికారిక గణాంకాలు ఇటలీలో 248,229 COVID-19 కేసులను నిర్ధారించగా.. 35,166 మంది మరణించారు.

ఫిబ్రవరిలో మొట్టమొదటిసారిగా కరోనా సంభవించిన స్థానిక ప్రాంతమైన లోంబార్డితో స్థానిక తేడాలు ఉన్నాయని ఈ సర్వేలో తేలింది. సిసిలీ దక్షిణ ప్రాంతంలో కేవలం 0.3% తో పోలిస్తే 7.5% జనాభా కరోనావైరస్ యాంటీబాడీలతో పాజిటివ్ పరీక్షలు చేసింది. యాంటీబాడీస్ ఉన్న దాదాపు 30% మంది ప్రజలు లక్షణరహితంగా ఉన్నారని సర్వేలో తేలింది.



వారిలో వైరస్ క్యారియర్లుగా తెలియకుండానే ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదాన్ని సూచిస్తున్నారు. కరోనా ఉన్న విషయమే తెలియదు.. లక్షణాలు కనిపిస్తే తప్ప వారిలో కరోనా వైరస్ ఉందా? లేదో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ వైరస్ వచ్చినా.. కొంతమందిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కొందరిలో జలుబు, దగ్గు, జ్వరంతో మొదలై ఇతర అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి.

మరికొంతమందిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటోంది.. వారిలో శ్వాస కోస సమస్యలు లేదా జీర్ణ కోశ సమస్యలు అధికంగా ఉంటున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా మరణాలకు సంబంధించి కచ్చితమైన డేటా ఉన్నప్పుడే కరోనా మరణాలు, కేసుల గణంకాలను లెక్కించడానికి వీలుపడుతుంది.

కరోనా సోకిన విషయం తెలియకుండానే చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. కరోనా మరణాల్లో ఇలాంటి మరణాలు లెక్కల్లోకి తీసుకోని కారణంగా అధికారిక గణంకాల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయని సర్వే వివరించింది.