‘మహా” సీఎంపై కంగనా ఫైర్ : నా ఇంటిలానే…త్వరలో ఉద్దవ్ అహంకారం కూలిపోతుంది

  • Published By: venkaiahnaidu ,Published On : September 9, 2020 / 05:09 PM IST
‘మహా” సీఎంపై కంగనా ఫైర్ : నా ఇంటిలానే…త్వరలో ఉద్దవ్ అహంకారం కూలిపోతుంది

Kangana Ranaut News : మహారాష్ట్ర గవెర్నమెంట్ వర్సెస్ కంగనా రనౌత్ గా కొద్దిరోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈనేపధ్యంలో ఇవాళ ముంబైలోని బాంద్రాలోని బాలీవుడ్​ నటి కంగనా రనౌత్ ఇంటిని అక్రమ నిర్మాణమంటూ​ ముంబై మున్సిపల్​ కార్పొరేషన్ అధికారులు పాక్షికంగా కూల్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందుకే ఇలా చేశామని పేర్కొన్నారు. ఆమె దగ్గరి నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండా కార్యాలయాన్ని కూల్చివేసేందుకు నిర్ణయించింది బీఎంసీ సంస్థ.


శివసేనతో కంగనకు వివాదాలు ఏర్పడిన క్రమంలో అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నివాసాన్ని అక్రమంగా నిర్మించారంటూ గతంలోనే నోటీసులు అందజేశామని.. మంగళవారం తాజాగా రెండోసారి నోటీసులు అందజేసినా ఎవరు స్పందించకపోవడం వల్లే కూల్చివేత చేపట్టారనేది బీఎంసీ అధికారులు వాదిస్తున్నారు.

అయితే, ముంబై మున్సిపల్ అధికారులు తన ఇంటి కూల్చివేతను నిలిపేయాలని కంగనా రనౌత్ హైకోర్టను ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన కోర్టు బిల్డింగ్ కూల్చివేతపై స్టే ఇచ్చింది.


కాగా, బీఎంసీ సిబ్బంది తన కార్యాలయాన్ని కూల్చుతున్న ఫొటోలను,వీడియోలను ట్విట్టర్ లో కంగనా షేర్ చేసింది. డెత్ అఫ్ డెమోక్రసీ హ్యాష్ ట్యాగ్ తో… నా ముంబై ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్’ అంటూ తన కార్యాలయాన్ని కూల్చుతున్న ఫొటోలను,వీడియోలను కంగనా షేర్ చేసింది.

నేను ఎలాంటి తప్పు చేయలేదు, కానీ ముంబై అనేది మరో పీఓకే అనే విషయాన్ని నా శత్రువులు పదేపదే నిరూపిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని చంపేశారు. ‘బాబర్, అతని సైన్యం’ అంటూ కూల్చివేతకు వచ్చిన పోలీసులు, అధికారులు, సిబ్బంది ఫొటోలను షేర్ చేసింది.



https://10tv.in/uddhav-thackarey-said-people-come-to-mumbai-but-do-not-pay-debt-of-it/
ఇది కేవలం బిల్డింగ్‌ మాత్రమే కాదు, నా వరకు ఇది రామ మందిర్‌. గుర్తుంచుకోండి బాబర్‌, అతని సైన్యం రామ మందిరాన్ని కూడా ముక్కలు ముక్కలు చేశారు. కానీ దాన్ని మళ్లీ ఇప్పుడు నిర్మించారు. నా భవనం విషయంలో కూడా అదే జరుగుతుంది. జై శ్రీరామ్‌’ అని కంగనా ట్వీట్‌ చేసింది. కంగన ఇటీవలే రూ. 48 కోట్లతో ఈ ఇంటిని కొనుగోలు చేసింది

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేపై కూడా కంగనా తీవ్ర విమర్శలు చేసింది. తన ఇల్లు కూల్చినట్లుగానే…త్వరలో ఉద్దవ్ అహంకారం కూడా కూలిపోతుందని కంగనా ఓ వీడియో మెసేజ్ ను ట్విట్టర్ లో షేర్ చేసింది.


అప్పటి నుంచే శివసేన-కంగనా వివాదం

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించిన నాటి నుంచి కంగనా రనౌత్‌, శివసేన పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్​ మాఫియా కన్నా ముంబయి పోలీసుల వల్లే ఎక్కువగా భయపడుతున్నానని ఈ మధ్యే కంగన చెప్పింది. దీంతో శివసేన నేత సంజయ్​ రౌత్​, ఆమెను ముంబై రావొద్దంటూ బహిరంగంగానే చెప్పారు. స్పందించిన కంగన.. ముంబయిని పాక్​ ఆక్రమిత కశ్మీర్​తో పోలుస్తూ ట్వీట్​ చేసింది. తద్వారా ఈ వివాదం మరింత వేడెక్కింది. ఆమె ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే సమాచారంతో కంగనకు వై- ప్లస్​ కేటగిరీ భద్రత కల్పించింది కేంద్ర ప్రభుత్వం.

చాలారోజుల తర్వాత ముంబైకి

కాగా, చాలారోజుల తర్వాత కంగనా ఇవాళ ముంబైలో అడుగుపెట్టింది. తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ నుంచి ముంబైకి వచ్చింది. అయిపోతే ముంబై విమానాశ్రయం వద్ద శివసేన పార్టీ కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.