కరోనా వ్యాక్సిన్లపై కీలక సమాచారం ఇదిగో!

  • Published By: sreehari ,Published On : November 24, 2020 / 07:17 PM IST
కరోనా వ్యాక్సిన్లపై కీలక సమాచారం ఇదిగో!

Key information of effective COVID-19 vaccines : ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది.

మరోవైపు పలు ఫార్మా కంపెనీల డజన్ల కొద్ది కరోనా వ్యాక్సిన్లు ట్రయల్స్ రేసులో పోటీపడుతున్నాయి.



ఈ వ్యాక్సిన్ల రేసులో ఏ కరోనా వ్యాక్సిన్ సురక్షితమైనది? ఎంతవరకు వైరస్‌ను అడ్డుకోగలవనేది ట్రయల్స్ ఫలితాల్లో తేలిపోనుంది.

ఇప్పటికే పలు వ్యాక్సిన్ల ట్రయల్స్‌లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. తమ వ్యాక్సిన్ సురక్షితమైనదంటే.. తమదే ప్రభావంతమైనదంటూ ఫార్మా కంపెనీలు చెబుతున్నాయి.

వ్యాక్సిన్ రేసులో ఉన్న మూడు ప్రధానా కరోనా వ్యాక్సిన్లు 90శాతం కంటే ప్రభావంతంగా పనిచేస్తున్నాయని నివేదికల్లో వెల్లడైంది.



ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరిగితేనే వైరస్ కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని, అప్పటివరకూ సాధారణ జీవితానికి తిరిగి రాలేమని ఆరోగ్య నిపుణులు నొక్కి చెబుతున్నారు.

కానీ, ప్రతి సమర్థవంతమైన వ్యాక్సిన్ సొంతం సూక్ష్మ నైపుణ్యాలను కలిగి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ తగినంత మోతాదులో పంపిణీ చేయాలంటే మల్టీపుల్ వ్యాక్సిన్ల అవసరం ఎంతైనా ఉంది.



* కొన్ని ప్రపంచ వ్యాక్సిన్లకు పరిమిత స్థాయిలో పంపిణీకి ఆమోదం లభించింది. అందులో చైనా, రష్యా కరోనా వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి.

ఆమోదానికి ముందు మూడో దశ ట్రయల్స్ ఫలితాలు రాకముందే పంపిణీ మొదలు పెట్టేశాయి.



ఈ విషయంలో ప్రజారోగ్య అధికారులు ప్రజలకు వ్యాక్సిన్లతో ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

* ఇప్పటివరకూ ఏ కరోనా వ్యాక్సిన్ కూడా పూర్తి స్థాయిలో వినియోగానికి ఆమోదం లభించలేదు.

 కరోనా వ్యాక్సిన్ కంపెనీలు :

Pfizer-BioNTech :

– సమర్థత : 95శాతం
– వ్యాక్సిన్ రకం : mRNA
– మోతాదుల అవసరం : 2
– స్టోరేజీ : రిఫ్రిజేటర్‌లో 5 రోజులు లేదా సుదీర్ఘంగా మైనస్ 70డిగ్రీల సెల్సియస్
– తయారీ : 2020లో 50 మిలియన్ల డోస్‌ల వరకు, 2021లో 1.3 బిలియన్ల డోస్‌ (Pfizer)



– ధర ఖరీదు : ఒక మోతాదు (Dose)కు 20 డాలర్లు
– టీకా స్థితి : అత్యవసర వినియోగానికి FDA నుంచి (EUA) ఆమోదం కోసం ఫైజర్ దరఖాస్తు చేసుకుంది.

Moderna:
– సమర్థత : 94.5 శాతం
– టీకా రకం : mRNA
– మోతాదు ఎంత : 2
– స్టోరేజీ : రిఫ్రరిజేటర్‌లో 30 రోజులు లేదా మైనస్ 20డిగ్రీల్లో ఆరు నెలలు ఉంచొచ్చు.
– తయారీ : 2020లో 20 మిలియన్ల డోస్‌లు, 2021లో 1 బిలియన్ డోస్‌లు (Moderna)
– ధర ఎంత : 32డాలర్లు నుంచి 37 డాలర్ల వరకు
– టీకా స్థితి : రాబోయే కొన్ని వారాల్లో EUA ఆమోదం కోసం Moderna అప్లయ్ చేయనుంది.



Oxford-AstraZeneca:
– సమర్థత : మోతాదును బట్టి 62 శాతం నుంచి 90 శాతం వరకు (70.4శాతం సగటున)
– వ్యాక్సిన్ రకం : సాధారణ జలుబు, కరోనావైరస్ జెనిటెక్ మెటేరియల్ కాంబినేషన్
– ఎంత మోతాదు : 1.5
– స్టోరేజీ : రిఫ్రిజేటర్‌లో 6 నెలలు ఉండొచ్చు.
– తయారీ : మొత్తం వార్షిక సామర్థ్యం 3 బిలియన్ల డోస్‌లు (AstraZeneca)
– ఖరీదు : 3 డాలర్ల నుంచి 4 డాలర్ల వరకు