రెండు పెగ్గెలేస్తే సేఫ్ అనుకోవద్దు. గ్లాస్ ఎత్తితే ఆరోగ్యానికి హానే..

  • Published By: sreehari ,Published On : August 5, 2020 / 01:17 PM IST
రెండు పెగ్గెలేస్తే సేఫ్ అనుకోవద్దు. గ్లాస్ ఎత్తితే ఆరోగ్యానికి హానే..

మద్యం సేవిస్తున్నారా? లో-రిస్క్ ఆల్కహాల్ సేవించే అలవాటు ఉందా? తస్మాత్ జాగ్రత్త.. రెండు పెగ్గెలే కదా.. ఒక్కసారికి ఏమైందిలే.. ? అని గ్లాసులు మీద గ్లాసులేత్తేస్తుంటారు. ఒక పెగ్ తో మొదలైన కాస్తా.. పీకల్దాక తాగేస్తుంటారు.. రెండే రెండు పెగ్ లేస్తే సేఫ్ అనుకోవద్దు.. గ్లాస్ ఎత్తితే ఆరోగ్యానికి హాని తప్పదని ఓ కొత్త అధ్యయనంలో హెచ్చరిస్తోంది. మీ ఆరోగ్యం డేంజర్‌లో పడినట్టే.. తక్కువ రిస్క్ ఉంటుంది కదా? అని వారంలో ఎక్కువ సార్లు మద్యాన్ని సేవిస్తుంటారు.  మీ ఆరోగ్యానికి హాని చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు..



మరోవైపు కెనడా ప్రభుత్వం లో-రిస్క్ డ్రింకింగ్ మార్గదర్శకాల ప్రకారం.. వారానికి మహిళలు కనీసం 10 కంటే ఎక్కువ మద్యాన్ని పురుషులు 15 కన్నా ఎక్కువ సేవించరాదని హెచ్చరించింది. (ఏదైనా ఆల్కహాల్ 12 oz.బీర్ 5 OZ వైన్ లేదా 1.5 oz మద్యం)గా పరిమితులు విధించింది. ఈ పరిమితులు యునైటెడ్ స్టేట్స్ కంటే కొంచెం ఎక్కువనే చెప్పాలి. ఇతర అధిక ఆదాయ దేశాల కంటే కెనడాలోనే ఎక్కువగా ఉన్నాయి. బ్రిటీష్ కొలంబియాలోని విక్టోరియా యూనివర్శిటీలో ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో ఈ తరహా మద్యాన్ని సేవించడం అధిక మద్యపానం కాదని తేలింది.

వారంలో లో రిస్క్ ఉండే మద్యాన్ని సేవించడం కూడా ఆస్పత్రిల్లో మరణానికి కారణమవుతుంది. ఆల్కహాల్, డ్రగ్స్‌పై జర్నల్ ఆఫ్ స్టడీస్‌లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. అధ్యయనంలో భాగంగా బ్రిటిష్ కొలంబియాలో, మద్యం వల్ల మరణాలు, వైకల్యం వంటి అనారోగ్య సమస్యలు అధికంగా పెరిగినట్టు బృందం గుర్తించింది.



మద్యపానం వల్ల వచ్చే క్యాన్సర్ మరణాలలో 50శాతం కంటే ఎక్కువ మంది మితంగా తాగేవారే ఉన్నారంట.. అంతేకాదు.. మద్యం తాగడం వంటి సంబంధిత మరణాల్లో 38% వారపు పరిమితుల కంటే తక్కువ తాగేవారే ఉన్నారు.. ఒకప్పుడు తాగి మానేసివారు కూడా ఉన్నారని పరిశోధక బృందం తెలిపింది.

మహిళలకు అందించిన మార్గదర్శకాలలోని మద్యపానం గుండెపోటు, డయాబెటిస్ మరణం నుంచి కొంత రక్షణను అందిస్తుందని పేర్కొంది. ఏదేమైనా, అన్ని మద్యపాన స్థాయిలలో పురుషుల్లోనే ఎక్కువగా ఆరోగ్యానికి హానికరంగా మారిందని అధ్యయన ఫలితాల్లో వెల్లడైంది.