వారంలో తగినంత వ్యాయామం ఇలా చేయండి.. అకాల మరణ ముప్పును తగ్గించుకోవచ్చు!

  • Published By: sreehari ,Published On : August 4, 2020 / 09:19 AM IST
వారంలో తగినంత వ్యాయామం ఇలా చేయండి.. అకాల మరణ ముప్పును తగ్గించుకోవచ్చు!

వ్యాయామం.. మంచి ఆరోగ్యానికి చక్కని మార్గం.. ప్రతిరోజు వ్యాయామం చేస్తున్నవారిలో అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని ఇప్పటికే పలు అధ్యయనాలు సూచించాయి. ఆరోగ్య పరంగా ప్రయోజనాలు పొందాలంటే తప్పనిసరిగా వ్యాయామాన్ని ఒక దినచర్యగా మార్చుకోవాలని డైట్ నిపుణులు సూచిస్తున్నారు.

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ప్రతిఒక్కరూ వారంలో వ్యాయామ స్థాయిలను పెంచుకుంటూ పోతే.. వారిలో మరణ ముప్పును తగ్గించుకోవచ్చునని సూచిస్తున్నారు. ఒక కొత్త అధ్యయనంలో సిఫార్సు చేసిన ప్రకారం.. వారపు శారీరక శ్రమ స్థాయిలను పెంచుకుంటే.. కరోనా మరణ ముప్పును తగ్గించుకోవచ్చునని పరిశోధకులు కనుగొన్నారు.



అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన నిర్వహించింది. రోజువారీ కార్యకలాపాలతో సంబంధం లేకుండా వ్యాయామ స్థాయిలు ఉండాలి. అప్పుడే వ్యాయామపరంగా మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చునని అంటున్నారు. తగినంత శారీరక శ్రమ లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయని అభిప్రాయ పడుతున్నారు.

Meeting recommended weekly exercise levels could lower death risk

2013లో ప్రపంచవ్యాప్తంగా హెల్త్ కేర్ వ్యవస్థలకు 53.8 బిలియన్ డాలర్ల ఖర్చు అయింది.. సరైన వ్యాయాయం లేనివారిలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో 6-10% మంది మరణించగా.. 2008లో 9శాతం మరణాలకు శారీరక శ్రమ లేకపోవడమే కారణమని అంటోంది. శారీరక శ్రమతో అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించవచ్చని, తద్వారా మరణాలను కూడా తగ్గిస్తుందని ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వాలు సిఫార్సు చేస్తున్నాయి.



2018 యుఎస్ మార్గదర్శకాల ప్రకారం.. వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయమం లేదా కనీసం 75 నిమిషాల ఏరోబిక్ వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. ఇక పెద్దలు అయితే పెద్దలు వారానికి కనీసం రెండు రోజులలో శక్తికి తగినంత వ్యాయామం తప్పనిసరిగా చేస్తుండాలని సూచిస్తున్నారు. అధ్యయనంలో, 2018 యుఎస్ మార్గదర్శకాల ప్రకారం.. తగినంత శారీరక శ్రమ, ఏదైనా కారణంగా మరణం, హృదయ సంబంధ వ్యాధులు (CVD),క్యాన్సర్, దీర్ఘకాలిక తక్కువ శ్వాసకోశ వ్యాధులు, ప్రమాదాలు, గాయాలతో సహా 8 నిర్దిష్ట కారణాల మధ్య సంబంధాన్ని నిర్ణయించాలని బృందం కోరుకుంది. వీటితో పాటు అల్జీమర్స్ వ్యాధి, డయాబెటిస్ ప్రమాదంపై కూడా విశ్లేషణ చేశారు.

Meeting recommended weekly exercise levels could lower death risk

1997 నుంచి 2014 వరకు జాతీయ ఆరోగ్య ఇంటర్వ్యూ సర్వేలలో భాగంగా వారానికి ఏరోబిక్ శారీరక శ్రమ, మజిల్ ఎక్సరసైజ్.. చేస్తుండాలని సూచిస్తోంది. 18-85 సంవత్సరాల వయస్సు గల 479,856 అమెరికన్లపై పరిశోధనలు చేశారు. ఈ డేటా అప్పుడు దాదాపు తొమ్మిది ఏళ్ల సగటున జాతీయ మరణ రికార్డులతో అనుసంధానం చేశారు. అధ్యయన కాలంలో.. సిఫార్సు చేసిన వ్యాయామ స్థాయిలను 16శాతం (76,384) మంది మాత్రమే పూర్తి చేశారు.



మరో 59,819 మంది మరణించారు. తగినంత వ్యాయామం చేసిన వారిలో ఏ కారణం చేతనైనా 11% తక్కువ మరణ ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే తగినంత ఏరోబిక్ వ్యాయామం చేసినవారికి 29% తక్కువ ఏదైనా కారణంగా మరణ ముప్పు ఉంటుందని తెలిపింది. తగినంత శారీరక శ్రమ చేసిన వారిలో 40 శాతం మంది తక్కువ మరణ ప్రమాదం ఉందని గుర్తించారు. తగినంత ఏరోబిక్ వ్యాయామంలో పాల్గొన్న వారిలో మొత్తం ఎనిమిది నిర్దిష్ట కారణాల నుంచి మరణించే ప్రమాదాన్ని తగ్గించారు. ఎక్కువ శాతం శారీరక శ్రమలో పాల్గొన్న వారు మూడు కారణాల నుండి (సివిడి, క్యాన్సర్, దీర్ఘకాలిక తక్కువ శ్వాసకోశ వ్యాధి) మరణించే ప్రమాదం తగ్గిందని తెలిపింది.