బ్రాహ్మణుల్ని కులం పేరుతో పిలిస్తే ఏమీ అనుకోరు..కానీ శూద్రులు మాత్రం ఫీలైపోతారు : BJP ఎంపీ

  • Published By: nagamani ,Published On : December 14, 2020 / 01:23 PM IST
బ్రాహ్మణుల్ని కులం పేరుతో పిలిస్తే ఏమీ అనుకోరు..కానీ శూద్రులు మాత్రం ఫీలైపోతారు : BJP ఎంపీ

MP : Brahmins,  ‘shudras’ caste  Pragya Thakur comments : వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ మరోసారి తన నోటికి పనికల్పించారు. ఈ సారి కాస్త ఘటైన వ్యాఖ్యలే చేశారామె. ‘‘బ్రాహ్మణుల్ని కులం పేరుతో పిలిస్తే వాళ్లేమీ అనుకోరు..కానీ శూద్రుల్ని మాత్రం వారి కులం పేరుతో పిలిస్తే ఫీలైపోతారు? ఎందుకంటే వారికి వర్ణం అంటే కులం గురించి అర్థం కాదు అందుకే అలా ఫీలవుతారంటూ బీజేపీ ఎంపీ ప్రగ్యాఠాకూర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి వచ్చారు. శూద్రుల్ని కులం పేరుతో పిలిస్తే అదేదో తప్పన్నట్లుగా..నేరం అన్నట్లుగా భావించి ఫీలైపోతారని ఆమెఅన్నారు.

శనివారం (డిసెంబర్ 13,2020) మధ్యప్రదేశ్ లోని సెహోర్లో జరిగిన క్షత్రియ మహాసభ సభలో ప్రసంగించిన ప్రగ్యాఠాకూర్ మాట్లాడుతూ..సామాజిక వ్యవస్థలో మతపరమైన గ్రంథాలు, ధర్మశాస్త్రాల గురించి మాట్లాడుతూ ఆమె మాట్లాడుతూ..శూద్రులలో అవగాహనలోపం ఉందని..అందుకేవారిని కులం పేరుతో పిలిస్తే ఫీలవుతారని అదేదో తప్పుగా..నేరంగా భావిస్తారని అన్నారు. అదే క్షత్రియులను క్షత్రియులని పిలిస్తే వారేమీ అనుకోరు..అలాగే బ్రాహ్మణులను కులం పేరుతో పిలిస్తే వాళ్లు తప్పుగా అనుకోరు..అలాగే వైశ్యులను వైశ్యులంటే ఏమీ అనుకోరు..కానీ శూద్రులను మాత్రం శూద్రులంటే తెగ ఫీలవుతారని ప్రజ్ఞా ఠాకూర్‌ వ్యాఖ్యానించారు. దీనికి కారణం వారికి ఉండే అవగాహనలోపమని అన్నారు.

మన ధర్మాశాస్త్రాల ప్రకారం వర్గాలను నాలుగు భాగాలుగా విభజించారని వారిలో బాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ఆఖరిలలో శూద్రులు ఉన్నారని..మిగతా కులాలలవారిని వారి కులంతో పిలిస్తే తప్పుగా భావించరు..కానీ శూద్రులు మాత్రం తప్పుగా భావిస్తారు. అది వారి అవగాహనాలోపం అని అన్నారు. రిజర్వేషన్లు పేదలకు మాత్రమే వర్తించాలి కానీ..కులాలపేరుతో కాదని అన్నారు.

ఈ సందర్భంగా ప్రగ్యా రైతుల నిరసనదీక్షలపై కూడా వ్యాఖ్యలు చేశారు. రైతుల పేరిట నిరసన తెలిపిన వారు దేశ వ్యతిరేకులు. వారు రైతులు కాదు, కాంగ్రెస్,వామపక్షవాదుల సభ్యులు..కేంద్రం ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో చేస్తోంది. కానీ నిరసనల పేరుతో రైతులు వాటిని గుర్తించలేకపోతున్నారని అన్నారు. ప్రతిపక్షాలు రైతు చట్టాల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అది అర్థం చేసుకోకుండా రైతులు నిరసనలు దిగుతున్నారని అన్నారు.