Covid-19 టెస్టుకు కొత్త డివైజ్ బాక్సు.. 90 నిమిషాల్లో కచ్చితమైన రిజిల్ట్స్

  • Published By: sreehari ,Published On : September 18, 2020 / 09:06 PM IST
Covid-19 టెస్టుకు కొత్త డివైజ్ బాక్సు.. 90 నిమిషాల్లో కచ్చితమైన రిజిల్ట్స్

కరోనా వైరస్‌ మహమ్మారిని నిర్ధారించే మరో కొత్త డివైజ్ వస్తోంది.. ప్రపంచ మార్కెట్లోకి అతి త్వరలో రాబోతోంది. ఈ టూల్ ద్వారా ‘కోవిడ్‌ నడ్జ్‌ టెస్ట్‌’ చేస్తారు. కేవలం 3 గంటల్లోనే (90 నిమిషాల్లోనే) కోవిడ్‌ ఇన్ఫెక్షన్ సోకిందా లేదా ఇట్టే చెప్పేయొచ్చు..



కరోనా టెస్టుల్లో 94 శాతం కచ్చితమైన ఫలితాలు వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ‘కోవిడ్‌–టెస్ట్‌’ డివైజ్‌లు 70 శాతమే కచ్చితమైన ఫలితాలు వస్తున్నాయని అంటున్నారు. అయితే ఈ కొత్త డివైజ్ ద్వారా 94 శాతం కచ్చితమైన రిజిల్ట్స్ వస్తాయని స్పష్టం చేశారు పరిశోధకులు.



షూ బాక్స్ అంత పరిమాణంలో ఉండే ఈ డివైజ్ క్యార్టిడ్జ్‌ సాయంతో పరీక్షలు చేస్తారు. కరోనా అనుమానితుల ముక్కులోని శ్లేష్మం, నోటిలో స్వాబ్ తీసుకునే శాంపిల్స్‌ను ఈ క్యార్టిడ్జ్‌పై డివైజ్ లోకి జొప్పిస్తారు. మూడు గంటల్లోగా స్వాబ్‌ను విశ్లేషించి ఫలితాన్నిస్తుంది. దాదాపు 30 పౌండ్లు ఉంటుంది.. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.2,900 వరకు ఉంటుంది.



‘కోవిడ్‌ నడ్జ్‌టెస్ట్‌ బాక్స్‌’లను లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీకి చెందిన స్పినౌట్‌ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. 5 వేల డివైజ్‌లు, 58 లక్షల క్యార్టిడ్జ్‌ల కోసం ఆర్డర్‌ ఇచ్చినట్లు బ్రిటన్‌ NHS వర్గాలు పేర్కొన్నాయి. థియేటర్లు, స్కూళ్లు, కాలేజీల్లోనే కాదు.. ఇంట్లోనే ఉండి టెస్టులు చేయించుకోవచ్చుంట.