కొత్త స్ట్రెయిన్‌ భయం..భయం.. : భారత్‌లో వైరస్ తీవ్రత ఎంతంటే?

కొత్త స్ట్రెయిన్‌ భయం..భయం.. : భారత్‌లో వైరస్ తీవ్రత ఎంతంటే?

New Covid Strain enters India : కరోనా కొత్త స్ట్రెయిన్ గడగడలాడిస్తోంది. కొత్త వైరస్ పేరు ఎత్తితేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. బ్రిటన్‌లో రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు ఈ వైరస్ భారతదేశంలోకి ప్రవేశించింది. లండన్ నుంచి వచ్చిన 22 మందికి పాజిటివ్ గా కరోనా నిర్ధారణ అయింది. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే కాస్తా ఊపిరిపీల్చుకుంటున్న భారత్‌కు కొత్త కరోనా భయం పట్టుకుంది. అయితే ఆ 22 మందికి సోకింది పాత కరోనా వైరస్ లేదా కొత్త రకం కరోనా వైరస్ అన్నది సందిగ్ధత నెలకొంది.

1. భారత్‌లో కన్పించని 70 శాతం తీవ్రత
యూకేలో కన్పించినంత కొత్త స్ట్రైయిన్‌ తీవ్రత ఇప్పటి వరకు భారత్‌లో లేదన్నారు ఎన్‌ఐటీఐ అయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌. ఈ కొత్త కరోనాపై తాము యూకే పరిశోధన సంఘంతో మాట్లాడమని…అక్కడ దాని తీవ్రతా 70 శాతానికి చేరినట్లు వారు తెలిపినట్లు చెప్పారు. అయితే దేశ ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని…కానీ మనమంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

2. UK నుండి వచ్చే ప్రయాణికుల కోసం కొత్త SOP జారీ
కొత్త కరోనా స్ట్రెయిన్ పై రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ విధి విధానాలు ప్రకటించింది. స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం 21-23 డిసెంబర్ మధ్య బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులందరికి RT- PCR పరీక్షలు నిర్వహించాలి. కరోనా కొత్త స్ట్రెయిన్ ఉన్నట్లు తేలితే ప్రత్యేక్ ఐసోలేషన్‌ వార్డుకు తరలించాలి. ఇది కాకుండా కరోనా పాజిటివ్ వచ్చినవారికి ఇన్ స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉంచాలి. పాజిటివ్‌ వచ్చిన ప్రయాణికుల శాంపిల్స్‌ ఎన్‌ఐవీ పుణెకు పంపాలి.

RT-PCR టెస్ట్ లో నెగిటివ్‌ వచ్చిన వారినీ హోంక్వారంటైన్‌లో ఉంచాలని కేంద్ర తాజా మార్గదర్శకాలను రూపొందించింది. 14 రోజుల ట్రావెల్ హిస్టరీ తీసుకోవాలని సూచించింది. 25 నవంబర్-25 డిసెంబర్ మధ్యన యూకే నుంచి వచ్చిన ప్రయాణికులతో డిస్ట్రిక్ట్ సర్విలాన్స్ ఆఫీసర్ కాంట్రాక్ట్ చేసి వారి ఆరోగ్యం గురించి వాకబు చేస్తారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వారికి RT-PCR పరీక్షలు నిర్వహిస్తారు. పాజిటివ్ గా తేలితే ప్రోటోకాల్ ప్రకారం చికిత్స ప్రారంభిస్తారు.

3. ప్రస్తుత వ్యాక్సిన్లలో మార్పులు తప్పనిసరి!
కొత్త వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంటే…ప్రస్తుతం తయారు చేసిన, తయారు చేస్తున్న వ్యాక్సిన్లలను అందుకు తగ్గట్లుగా మార్చాల్సిన అవసరం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.

4. బ్రిటన్ విమానాలు రద్దు చేసిన భారత్
మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ నెల 31 వరకు బ్రిటన్‌కు విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు భారత పౌర విమానయాన శాఖ ప్రకటించింది.అక్కడి నుంచి మంగళవారం అర్థరాత్రి వరకు భారత్‌ చేరుకున్న ప్రయాణికులు విమానాశ్రయాల్లో కచ్చితంగా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది. యూకేకు విమానాలను తాత్కాలికంగా నిలిపివేసిన కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియం, డెన్మార్క్, ఇటలీ వంటి దేశాల జాబితాలో భారత్ చేరింది.

5. యూకే నుంచి తెలంగాణకు 358 మంది ప్రయాణికులు
ఇక యూకే నుంచి హైదరాబాద్‌ వచ్చిన 358 మంది ప్రయాణికులు వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రయాణికులందరూ డిసెంబర్ 15 నుంచి వచ్చారని తెలిపింది. అయితే ఇందులో ఇప్పటి వరకు 158 మందిని గుర్తించారు అధికారులు. ఇక సోమవారం యూకీ నుంచి వచ్చిన ఏడుగురు ప్రయాణీకులకు టెస్ట్‌లు నిర్వహిచంగా నెగిటివ్‌గా తేలింది.

6. అహ్మదాబాద్‌లో యూకే నుంచి వచ్చిన నలుగురికి పాజిటివ్
మంగళవారం ఉదయం యూకే ఇండియా విమానం ద్వారా అహ్మదాబాద్ చేరుకున్న బ్రిటిష్ జాతీయుడితో సహా నలుగురు ప్రయాణికులు కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించారు. విమాన నిషేధం అమల్లోకి రాకముందే యూకే నుంచి అహ్మదాబాద్‌లో దిగిన చివరి విమానం ఇది. అయితే ఈ నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

7. యూకేలో నిలిచిపోయిన 1500 ట్రక్కులు
కొత్త కరోనా వైరస్‌తో యూకేలో ప్రయాణ ఆంక్షలు విధించిడంతో…1500 ట్రక్కులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కరోనా వ్యాప్తి జరుగుతుండటంతో…ఫాన్స్‌ 48 గంటల పాటు యూకే నుంచి ట్రక్కుల ప్రవేశాన్నినిషేధించింది. ఈ నిషేధం యూకేలో అవసరమైన అత్యవసర సేవలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

8. కొత్త వైరస్‌ నేపథ్యంలో ఐర్లాండ్‌ ఆంక్షలు
కొత్త వైరస్‌ బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. అందులో భాగంగానే ఐర్లాండ్ కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. క్రిస్మస్ నుంచి జనవరి 12 వరకు ఆంక్షలు విధించింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
9. గతంలో కంటే కొత్త వేరియంట్‌ ప్రభావం ఎక్కువ
10. ఈ రోజు నుంచి భూటాన్‌లో వారం రోజులు లాక్‌డౌన్‌