ఊబకాయంతో 65 ఏళ్లలోపు కోవిడ్ బాధితులు మరణించే అవకాశం ఎక్కువ

  • Published By: sreehari ,Published On : August 5, 2020 / 02:19 PM IST
ఊబకాయంతో 65 ఏళ్లలోపు కోవిడ్ బాధితులు మరణించే అవకాశం ఎక్కువ

ఊబకాయంతో బాధపడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీ ఆర్యోగం డేంజర్‌లో ఉంది.. కరోనా సమయంలో అధిక బరువు ఉన్నవారికి మరింత రిస్క్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అందులోనూ 65 ఏళ్ల లోపు కోవిడ్ బాధితులకు మరణం ముప్పు పొంచి ఉందని ఒక కొత్త అధ్యయనంలో తేలింది. కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన పెద్దలలో ఊబకాయం ఇంట్యూబేషన్ లేదా మరణానికి ఎక్కువ ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు.

Obesity may increase death risk in COVID-19 patients under 65

65 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిలో మరింత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. కాని పెద్దవారిలో కాదంటున్నారు. కొలంబియా యూనివర్శిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్, బృందం ఈ పరిశోధన నిర్వహించింది. ఈ అధ్యయనంలో COVD-19లో ఊబకాయం ఇంట్యూబేషన్ లేదా మరణం, మంట, గుండె గాయం లేదా ఫైబ్రినోలిసిస్‌తో ముడిపడి ఉందని బృందం పరిశీలించింది.



45 రోజుల వ్యవధిలో తీవ్రమైన కరోనావైరస్ -2 ఇన్ఫెక్షన్లతో ఆస్పత్రిలో చేరిన 2,466 మంది పెద్దల నుంచి డేటాను పరిశోధక బృందం పరిశీలించింది. ఇందులో 22శాతం మంది రోగులు ఇంట్యూబేట్ అయ్యారని గుర్తించారు. 25శాతం మంది మరణించారని, 2శాతం మంది ఆస్పత్రిలో ఏడు రోజుల పాటు ఉన్నారని పరిశోధకులు కనుగొన్నారు. ఒబెసిటీ ఉన్న రోగులకు అధిక బరువు ఉన్న రోగులతో పోల్చితే ఇంట్యూబేషన్ లేదా మరణానికి ఎక్కువ ప్రమాదం ఉందని థర్డ్ క్లాస్ కేటగిరి ఊబకాయానికి ఎక్కువ ప్రమాదం ఉందని చెబుతున్నారు.



ప్రధానంగా 65 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న రోగులకు ఈ ప్రమాదం ఉందని గుర్తించారు. బాడీ మాస్ ఇండెక్స్‌(BMI)మంట, కార్డియాక్ ఇంజ్యూర్ లేదా ఫైబ్రినోలిసిస్ బయోమార్కర్ల ప్రవేశ స్థాయిలతో సంబంధం లేదు. COVID-19లో ఊబకాయం, శ్వాసకోశ వైఫల్యానికి ఎంతవరకు దారితీస్తుందో పరిశీలించాలని బృందం పేర్కొంది. వీటిలో నిర్దిష్ట inflammatory సైటోకిన్లు, కాంప్లిమెంట్-మెడియేటెడ్ endothelial సెల్ పనిచేయకపోవడం thrombosis ఛాతీ గోడ వంటి భాగాలపై ప్రభావం అధికంగా ఉంటుందని గుర్తించారు.