శుక్ర గ్రహంపై phosphine gas.. అంటే జీవం ఉందా? ‌ఏలియ‌న్స్ ఉన్నారేమో..!

  • Published By: sreehari ,Published On : September 15, 2020 / 03:15 PM IST
శుక్ర గ్రహంపై phosphine gas.. అంటే జీవం ఉందా? ‌ఏలియ‌న్స్ ఉన్నారేమో..!

భూగ్రహంలాగే శుక్రగ్రహంపై కూడా జీవం ఉందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.. సైంటిస్టులు కూడా ఇది ఎంతవరకు వాస్తవమో కనిపెట్టే పనిలో పడ్డారు.. వాస్తవానికి పాస్పైన్ గ్యాస్ ఉంటే.. అక్కడ కచ్చితంగా జీవం ఆవిర్భవించే అవకాశం ఉందంటున్నారు సైంటిస్టులు.. ఆ గ్యాస్ వెనుక జీవం పుట్టుక మిస్టరీని కనిపెట్టే దిశగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు.



శుక్ర గ్ర‌హంపై ఫాస్పైన్ ఆన‌వాళ్లు ఉన్నాయంటే.. ఆ గ్రహంపై జీవం తప్పక ఉండాలి.. భూగ్రహం మీద మానువుల మాదిరిగా మరో జీవం ఉందంటే వారు కచ్చితంగా ఏలియన్స్ అయి ఉంటారని భావిస్తున్నారు. శుక్ర గ్ర‌హంపై ద‌ట్ట‌మైన ర‌సాయ‌నిక మేఘాల‌ను గుర్తించామ‌ని చెబుతున్నారు. ఆ వాయువు ఫాస్పైన్‌గా గుర్తించారు. గ్యాస్ ఉన్నచోట సూక్ష్మ‌క్రిములు కూడా ఉంటాయనే అభిప్రాయాల‌ను వ్యక్తం చేశారు. గ్ర‌హాంత‌రవాసులు తప్పక ఉండి ఉంటారని భావిస్తున్నారు. నేచ‌ర్ ఆస్ట్రాన‌మీలో సైంటిస్టులు రిపోర్ట్‌ను పబ్లీష్ చేశారు. శుక్రగ్ర‌హంపై ఫాస్పైన్ గ్యాస్ ఉన్న‌ట్లు గుర్తించారు. 20 పార్ట్స్ ప‌ర్ బిలియ‌న్‌గా అంచనా.. విష ‌పూరిత‌మైన వాతావ‌ర‌ణంలో ఈ పాస్పైన్ వాయువు ఉన్న‌ట్లు కనిపెట్టారు. 2017లోనే ఈ వాయువు ఆన‌వాళ్ల‌ను గుర్తించారు.



శుక్ర‌గ్ర‌హంపై గ్రహంతర వాసులు ఉన్నారంటే.. కచ్చితంగా రుజువు లేదు.. ఏ విధమైన ఇమేజ్‌ల‌ను కూడా క్యాప్చ‌ర్ చేయలేదు.. సూక్ష్మ‌జీవాల స్పెసిమెన్ల‌ను కూడా గుర్తించలేదు. బ్రిట‌న్‌, యూఎస్, జ‌పాన్ సైంటిస్టులు శుక్రుడిపై ఫాస్పైన్ ఉన్న‌ట్లు గుర్తించారు. ఈ వాయువు సాధార‌ణంగా భూమిపై ఉంటుంది. ఆక్సిజ‌న్ లేకున్నా.. ఫాస్పైన్ ఉంటే జీవాలు బ్ర‌తికే అవకాశం ఉంటుంది. ఒక‌వేళ శుక్రుడిపై ఫాస్సైన్ ఉంటే.. భూగ్రహం మాదిరిగానే గెలాక్సీలో కూడా ఎన్నో జీవాలు ఆవిర్భావించే ఉంటాయని భావిస్తున్నారు. ఫాస్పేన్‌.. ఓ ఫాస్ప‌ర‌స్ అణువుగా చెబుతారు.. మూడు హైడ్రోజ‌న్ అణువులు ఉంటాయి. PH‌3గా పిలుస్తారు. ఈ వాయువు చాలా విష‌పూరిత‌మైంది. రంగు ఉండదు.. వాస‌న మాత్రం ఉంటుంది. ఆక్సిజ‌న్ అంద‌ని ప్రాంతాల్లో బ్యాక్టీరియా ఈ తరహా వాయువుల్ని ఉత్ప‌త్తి చేస్తాయి. ఖ‌నిజాల నుంచి ఫాస్‌పేట్‌ను తీసుకుని భూమిపై బ్యాక్టీరియా హైడ్రోజ‌న్‌తో క‌లిపి ఫాస్పేన్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది.



శుక్ర గ్ర‌హంపై ఫాస్పేన్ ఉత్ప‌త్తి కావ‌డానికి ఏదో బ‌ల‌మైన కార‌ణం ఉంటుంద‌ని మాంచెస్ట‌ర్ వ‌ర్సిటీ ఖ‌గోళ‌శాస్త్ర‌వేత్త అనితా రిచ‌ర్డ్స్ స్పష్టం చేశారు. భూమి క‌న్నా స్వ‌ల్పంగా చిన్న‌గా ఉండే ఈ శుక్రగ్ర‌హం సూర్యుడి నుంచి రెండ‌వ స్థానంలో ఉంటుంది. ఈ గ్ర‌హం చుట్టూ విష‌పూరిత వాతావ‌ర‌ణం ఉంటుంది. ఆ గ్ర‌హం ఉప‌రిత‌ల ఉష్ణోగ్ర‌త‌లు సుమారు 471 డిగ్రీల సెల్సియ‌స్ వ‌ర‌కు ఉంటాయి. కార్బ‌న్ డైయాక్సైడ్ నిలువ‌లు కూడా భారీగా ఉన్నాయి. స్పేస్ క్రాఫ్ట్ వెళ్లినా నాశ‌నం చేయగల వాతావరణం వీనస్‌పై ఉందని అంటున్నారు. ఏది ఏమైనా శుక్రగ్రహంపై గ్రహంతరవాసులు ఉంటే మాత్రం.. ఈ విశాల విశ్వంలో మనం ఒంటరి కాదనే మాట అక్షరాల సత్యం అవుతుందని అంటున్నారు సైంటిస్టులు..